అదిలాబాద్

పోలీసు వ్యవస్థ పటిష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, జూన్19: రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధునిక సంస్కరణలు చేపట్టి పోలీసు వ్యవస్థను పటిష్టపర్చారని, ప్రజలతో సంబంధాలు మరింత మెరుగుపడ్డాయని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగురామన్న అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పోలీసు శాఖ అద్వర్యంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌లో రూ.20లక్షలతో నిర్మించిన రిసెప్షన్ సెంటర్‌ను ఎస్పీ విష్ణు ఎస్. వారియర్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం రూరల్ పోలీసు స్టేషన్‌లో రూ.20లక్షల వ్యయంతో నిర్మించిన మరో రిసెప్షన్ సెంటర్‌ను ప్రారంభించిన అనంతరం మంత్రి ప్రసంగించారు. శాంతిభద్రతలు అదుపులో ఉన్నప్పుడే సామాజిక అభివృద్ధి సాధ్యపడుతుందని, ఆదిలాబాద్ జిల్లాలో సంస్కరణల కారణంగానే పోలీసు వ్యవస్థ బలోపేతమైందన్నారు. రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా 18వేల పోలీస్ పోస్టులను భర్తీ చేస్తున్నామన్నారు. మహిళ ల రక్షణే లక్ష్యంగా షీటీంల ఏర్పాటు, నేరాల అదుపు కోసం కార్డెన్ సెర్చ్‌లు నిరంతరం కొనసాగుతున్నాయన్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్ రంగినేని మనీషా, డీసీసీబీ చైర్మన్ దామోదర్ రెడ్డి, డీఎస్పీ నర్సింహారెడ్డి, జడ్పీటీసీ అశోక్, మార్కెట్ చైర్మన్ రాజన్న, వైస్ చైర్మన్ గంగారెడ్డి, రైసస జిల్లా అధ్యక్షుడు అడ్డి బోజారెడ్డి పాల్గొన్నారు.