అదిలాబాద్

‘పంచాయతీ’ వైపు అడుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్, జూన్ 21: పంచాయతీ ఎన్నికల వైపు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే సంబంధిత యంత్రాంగం ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను దాదాపుగా పూర్తిచేసింది. గత రెండు మూడునెలల నుంచి పంచాయతీ అధికారులు రాత్రింభవళ్లు శ్రమించి పోలింగ్‌స్టేషన్లు, ఓటర్ల సంఖ్య, రిజర్వేషన్లకు సంబంధించిన ప్రక్రియపై తీవ్రమైన కసరత్తు చేశారు. దీని ఫలితంగా ఇప్పటికే వాటికి సంబంధించిన తుదిదశ ప్రక్రియ పూర్తయినట్లు తెలుస్తోంది. రేపో మాపో గ్రామపంచాయతీల వారీగా రిజర్వేషన్లు సైతం ఖరారు కానున్నాయి. దీనికితోడుగా పోలింగ్ బాక్సుల సేకరణ కూడా పూర్తయింది. దీంతోపాటు రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల నియామకాలు పూర్తిచేసి వారందరికి ఒకరోజుపాటు శిక్షణసైతం ఇచ్చారు. కాగా, ఇప్పటికే వివిధ శాఖల నుండి ఉద్యోగులు, ఉపాధ్యాయుల జాబితాను సైతం సేకరించి వారందరికి ఎన్నికల విధులను అప్పగించేందుకు రంగం సిద్ధం చేశారు. త్వరలోనే రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ జారీచేసే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. జూలై 1 లేదా రెండవ వారంలో నోటిఫికేషన్ జారీకావచ్చని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా, ఈసారి జరగబోయే పంచాయతీ ఎన్నికలు పార్టీలకు అతీతంగా ప్రత్యక్ష పద్దతిలో జరగనున్నాయి. వార్డుసభ్యులందరూ ఉప సర్పంచ్‌ను ఎన్నుకోగా, సర్పంచ్‌ను మాత్రం గ్రామ ఓటర్లంతా ఎన్నుకోనున్నారు. పార్టీ రహితంగా పంచాయతీ ఎన్నికలు జరగనున్నప్పటికి ప్రధాన రాజకీయ పార్టీలు తమ అనధికారిక అభ్యర్థులను సర్పంచ్ ఎన్నికల భరిలో నిలపనున్నాయి. ముఖ్యంగా రాబోయే 2019 సాధారణ ఎన్నికలకు ముందు జరగబోతున్న ఈ పంచాయతీ ఎన్నికలు ప్రధాన రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకం కానున్నాయంటున్నారు. అధికార టీఆర్‌ఎస్ పార్టీ ఓ అడుగు ముందకేసి ఇప్పటికే గ్రామ పంచాయతీల వారీగా తమ కార్యకర్తలను, నాయకులను ఎన్నికల కోసం సంసిద్దులను చేస్తోంది. పేరుకు పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితమైనప్పటికి పరోక్షంగా మాత్రం ప్రధాన రాజకీయ పార్టీల ప్రమేయం తప్పదన్నది బహిరంగ సత్యమే. అధికార టీఆర్‌ఎస్ పార్టీ రాబోయే సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుండే తమ కార్యకర్తలను ఉత్తేజితులను చేసేందుకు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను ముమ్మరం చేస్తున్నాయి. ఎన్నికల్లో గెలిచే సర్పంచ్‌లంతా మెజార్టీ సంఖ్యలో తమవారే ఉన్నట్లయితే వారంతా సాధారణ ఎన్నికలకు సైన్యంలా పనిచేస్తారని ఆ పార్టీ భావిస్తోంది. అలాగే ప్రతిపక్ష కాంగ్రెస్‌పార్టీ సైతం ఈసారి ఎలాగైన అత్యధిక సంఖ్యలో పంచాయతీలను కైవసం చేసుకుని తన ఉనికిని విస్తరించుకోవాలని ప్రయత్నిస్తోంది. ఎలాగైన మెజార్టీ పంచాయతీలను సాధించి రాబోయే సాధారణ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్ పార్టీకి సవాల్ విసరాలని కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటి నుండే వ్యూహరచన చేస్తోంది. దీనికితోడుగా బీజేపీ, సిపిఐ, సీపీఎం, అలాగే ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలోని తెలంగాణ జన సమితి సైతం ఈసారి సర్పంచ్ పదవులకు పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.