అదిలాబాద్

బ్యాక్‌లాగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, జూన్ 21: జిల్లాలో ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ దివ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రూప్-4 సర్వీస్ పరిధిలో ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులకు సంబంధించి 9 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఎస్సీ కోటా కింద ఎస్సీ జనరల్-1, ఎస్సీ మహిళా-3, ఎస్టీ కోటా కింద ఎస్టీ జనరల్-1లకు కేటాయించడం జరిగిందన్నారు. జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీ, టైపిస్టు పోస్టులకు ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులై ఉండడంతో పాటు తెలుగు టైప్‌రైటింగ్‌లో ప్రభుత్వంచే నిర్దేశించిన కీబోర్డు విద్యార్హతలు కలిగి ఉండాలన్నారు. దరఖాస్తు ఫారాలను సంబంధిత వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడు చేసుకోవాలని, జూలై 4వ తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలన్నారు.

రాష్ట్ర సాధనలో న్యాయవాదుల త్యాగం మరువనిది
* రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
నిర్మల్, జూన్ 21: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటంలో న్యాయవాదుల త్యాగం మరువలేనిదని రాష్ట్ర గృహనిర్మాణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. గురువారం నిర్మల్‌లోని కోర్టు ప్రాంగణంలోని బార్ కార్యాలయంలో న్యాయవాదులకు హెల్త్‌కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర సాధన పోరాటంలో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద న్యాయవాదులు పోరాటం చేశారన్నారు. రాష్టస్రాధనలో పాల్గొన్నవారిపై పెట్టిన కేసులను న్యాయవాదులు ఉద్యమకారుల తరపున వాధించారన్నారు. న్యాయవాదులకు ప్రోత్సాహం కల్పించాలనే ఉద్దేశంతో దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా రూ.10 లక్షల ఆరోగ్య, ప్రమాద బీమాను 18వేల మందికి కల్పించినట్లు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వివరించారు. ఈ హెల్త్‌కార్డుల ద్వారా రాష్ట్రంలోని 900 ఆసుపత్రుల్లో ఎక్కడైనా వైద్యం పొందవచ్చన్నారు. న్యాయవాదులు ఎక్కువగా ఉన్న కోర్టు ల్లో లైబ్రరీల నిర్వహణకోసం రూ.5 లక్షల వరకు కేటాయించనున్నట్లు తెలిపారు. జూనియర్ న్యాయవాదులకు నల్సార్ వర్సిటిలో శిక్షణ నివ్వనున్నామన్నారు.జిల్లాకేంద్రంలోని శ్యాంఘడ్ పక్కన రూ.20 కోట్లతో కోర్టు భవనాన్ని నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి న్యాయవాదులకు హెల్త్‌కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి, నిర్మల్ బార్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు కె.వినోద్‌రావు, ఎం.సురేష్, ఉపాధ్యక్షులు రాజలింగం, అడెల్లి ఆలయ కమిటి చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, సీనియర్ న్యాయవాదులు విలాస్‌రావు, జగన్ తదితరులతోపాటు ఆర్‌అండ్‌బి ఈఈ శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు.