అదిలాబాద్

హామీలను నెరవేర్చని సీఎం కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడెం, జూన్ 23: తెలంగాణ రాష్ట్రంలో గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవెర్చడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని బహుజన లెఫ్ట్ ఫ్రంట్ రాష్ట్ర నాయకులు తొడసం భీంరావు ఆరోపించారు. శనివారం బహుజన లెఫ్ట్ ఫ్రంట్ కడెం మండల సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి బీఎల్‌ఎఫ్ నియోజకవర్గ కో కన్వీనర్ డాకూరి తిరుపతి అధ్యక్షత వహించారు. సమావేశానికి ముఖ్యఅథితిగా బీఎల్‌ఎఫ్ రాష్ట్ర నాయకులు, నియోజకవర్గ డిప్యూటీ ఛైర్మెన్ తొడసం భీంరావు హాజరై మాట్లాడారు. సమావేశంలో బీ ఎల్‌ఎఫ్ జిల్లా కో కన్వీనర్ దుర్గం నూతన్‌కుమార్, నియోజకవర్గ కో కన్వీనర్ పసుల రాజలింగం, బొమ్మెన సురేష్, నాగెల్లి నర్సయ్య, బీసీబీ జిల్లా కార్యదర్శి పసుల వెంకన్న, సిఐటీయు నాయకులు కంది రాజేశ్వర్, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు డి.రాజేంధర్, బాల నరేష్, బి.కిరణ్, రాజేంధర్, నారపాక స్వామి హాజరయ్యారు.
లాక్కున్న గిరిజన భూములను తిరిగి ఇవ్వాలి
* సీపీఎం కార్యదర్శి రవి
భీమిని, జూన్ 23: కనె్నపల్లి మండలం లింగాల గ్రామంలో దళిత గిరిజన రైతులు సాగు చేసుకుంటున్న పంట భూములను భూ పంపిణీ పేరుతో బలవంతంగా రైతుల నుండి లాకొని గిరిజన రైతులకు అన్యాయం చేస్తుందని, తెరాస ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని సిపి ఎం కార్యదర్శి సంకె రవి అన్నారు. శనివారం లింగాల గ్రామంలో గిరిజన రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ లాకున్న భూములను తిరిగి రైతులకు అందించాలని జిల్లా కలెక్టర్, తహసీల్దార్‌లకు ఎన్నో మార్లు దరఖాస్తు చేసుకున్న గిరిజనులను కనికరించకపోవడం పై తెరాస ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని, పేదల ప్రభుత్వం అని చెప్పుకుంటూ పేదల భూములను లాక్కోవడం అంతర్యం ఏమిటో ప్రభుత్వం సమధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉన్న భూములను లాక్కోవడంతో ఉపాధి లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే అధికారులు చోద్యం చూస్తున్నారని ఇలాంటి ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో మాయ మాటలు చెబుతూ ప్రజలకు ఏ సంక్షేమం అందకుండా చేస్తుందని ఆయన దుయ్యబట్టారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను మరిచి ప్రస్తుతం అవలంభిస్తున్న తీరుకు పోంతన లేదని ప్రభుత్వం ఇలానే వ్యవహరిస్తే రాబోయే ఎన్నికలలో పేద ప్రజల సత్తా ఏమిటో ప్రభుత్వం చవి చూడక తప్పదని ఆయన అన్నారు.
ఆయన వెంట గిరిజన నాయకులు పున్నం, జిల్లా కార్యదర్శి కొడిపే శ్రీనివాస్, సిపిఎం కార్యదర్శి రాజారాం, గిరిజన రైతులు సిడం సంతోష్, చింతపురి లక్ష్మణ్, రెడ్డి బక్కన్న, తదితరులు ఉన్నారు.