అదిలాబాద్

ప్రసవాలు పెంచేందుకు చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచిర్యాల,జూన్ 23 : ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య పెంచేందు కు చర్యలు తీసుకోవాలని, లక్ష్యాలను పూర్తి స్థాయిలో పూర్తిచేయాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశం మందిరంలో వైద్యాధికారులు,సూపర్‌వైజర్‌లు, అంగన్‌వాడీ సీడీపీవోలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మాతా, శిశు మరణాలు తగ్గించేందుకు వైద్యసిబ్బంది, వైద్యాధికారులు కృషిచేయాలన్నారు. ప్రైవేట్ ఆసుత్రులకు ధీటుగా ప్రసవాలను ప్రభుత్వ ఆసుపత్రులలో చేయాలని, జిల్లాలో ఇప్పటి వరకు 4792 కేసిఆర్ కిట్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. కాసిపేట, జన్నారం, కోటపల్లి, వేమనపల్లి, నెనె్నల, భీమిని మండలాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వౌలిక వసతులు, వైద్యాధికారుల క్వార్టర్‌ల మరమ్మతులు, తదితర అంశాలపై పర్యవేక్షించి ప్రతిపాదనలు పంపించామన్నారు. ప్రతినెలా తప్పనిసరిగా వైద్య సిబ్బంది సీడీపీలు అంగన్‌వాడీ సిబ్బంది సమీక్షా సమావేశాలు నిర్వహించాలని సలహా చేశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి భీష్మా, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ యశ్వంత్ రావు, జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్ , వైద్యాధికారులు, సీడీపీఓలు , ఆయాలు, ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.
పేదల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి
* ఎమ్మెల్యే దివాకర్ రావు
దండేపల్లి, జూన్ 23: పేదల అభ్యున్నతికి తెరాస ప్రభుత్వం కృషి చేస్తోందని మంచిర్యాల శాసనసభ్యుడు నడిపెల్లి దివాకర్ రావు అన్నారు. మండలంలోని 84 మంది లబ్ధిదారులకు మంజూరైన కల్యాణ లక్ష్మి చెక్కులను శనివారం మండల పరిషత్ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదింటి ఆడపిల్ల వివాహం జరిగితే వారికి రూ. 75 వేలు, ఏప్రిల్ మాసం నుంచి లక్ష రూపాయల కానుకను ఇస్తుందని పేర్కొన్నారు. రాజకీయాలకతీతంగా ప్రతి పేదబిడ్డకు కళ్యాణ లక్ష్మి అందించాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని, అందుకు అనుగుణంగానే ఇప్పటి వరకు మండలంలో 494 కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులు ఇవ్వడం జరిగిందన్నారు. అనంతరం ముఖ్యమంత్రి సహా య నిధి నుంచి మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు. ఎంపిపి గోళ్ళ మంజుల, జడ్పిటిసి సభ్యుడు భూక్య యశ్వంత్ నాయక్, రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ మోటపలుకుల గురువయ్య, వైస్ ఎంపిపి ఆకుల రాజేందర్, సహకార సంఘం చైర్మన్ గడ్డం శ్రీనివాస్, తెరాస మండల అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు మల్లేష్, శ్రీనివాస్, ఆర్‌ఐ గణపతి, సర్పంచులు, ఎంపిటిసిలు, తెరాస కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.