అదిలాబాద్

అక్రమ భవన నిర్మాణాలపై విచారణ జరపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడెం, జూన్ 23: కడెం మండలంలోని పెద్దూర్ గ్రామపంచాయతీ పరిధిలో గల కడెంలో అక్రమ నిర్మాణాలతో వర్షపునీరు, మురుగునీటితో కలిసి జలమయమై 6,7వ వార్డు ప్రజల ఇండ్లలో చేరిన నీటిని తొలగించి ప్రజలకు సౌకర్యం కల్పించి అక్రమ నిర్మాణాలపై విచారణ జరపాలని ఖానాపూర్ మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మెన్ ఎ.అలెగ్జాండర్, స్థానిక వార్డు నాయకులు ఎండి వాజిద్‌ఖాన్, ఎండి జావిద్‌ఖాన్, ఎస్‌కె జమీల్, జాడి శేఖర్, వార్డు ప్రజలు డిమాండ్‌చేశారు. శనివారం మండల కేంద్రమైన కడెం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. తాము పెద్దూర్ గ్రామపంచాయతీ పరిధిలో 6,7వ వార్డుల్లో ప్రభుత్వం ఇచ్చిన నివాస గృహంలో గత 50 సంవత్సరాలుగా గృహాలు నిర్మించుకుని నివసిస్తున్నామన్నారు. గతంలో తమ ఇండ్లముందు ఖాళీ స్థలం ఉండేదని, వర్షపునీరు పోవడానికి అభ్యంతరం ఉండేది కాదని, కాని ప్రస్తుతం కన్నాపూర్ శివారులోని 266 సర్వేనంబర్‌లో ఖాళీ స్థలంలో నూతనంగా అక్రమ భవన నిర్మాణాలు చేపట్టడం జరిగిందని, ఇట్టి నిర్మాణాలు చేపట్టిన రియల్ ఎస్టేట్ నిర్వాహకులు, గ్రామపంచాయతీ వారు అనుమతి ఇవ్వడం జరిగిందన్నారు. భవనాలు నిర్మించడం వల్ల వర్షం పడినప్పుడు రోడ్లపై నుండి బురదమయమైన నీరు వచ్చి తమ ఇండ్లలోకి చొరబడుతున్నాయని వారు తెలిపారు. ఈ విషయంపై విచారణ జరిపి న్యాయం చేయాలని వారు కోరారు.
నిందితుడ్ని కఠినంగా శిక్షించాలి
కడెం, జూన్ 23: నిర్మల్ జిల్లాలోని సోన్ గ్రామంలో ఇటీవల పదేళ్ల బాలికపై అత్యాచారం, హత్యచేసిన నింధితున్ని కఠినంగా శిక్షించాలని స్వచ్చంద సంస్థల నెట్‌వర్క్ నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు మంజులారాణి డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా స్వచ్చంద సంస్థల నెట్‌వర్క్ వారు సోన్ గ్రామానికి వెళ్లి అత్యాచారం, హత్యగావించబడిన స్పందన కుటుంబాన్ని శనివారం ఆమె పరామర్శించారు. పదేళ్ల బాలికను దారుణంగా హత్యచేయడం అవమానవీయ చర్య అని అన్నారు. ఈ హత్యకు పాల్పడిన వ్యక్తిని ఉరితీయాలని, అతనికి సహకరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్‌చేశారు. మూడు నెలల క్రితం సోన్ మండల కేంద్రంలో అత్యాచారం జరిగినప్పుడు ఎటువంటి చైతన్య, అవగాహన కార్యక్రమాలు చేపట్టకపోవడం, తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఈ సంఘటన పునరావృతం కావడం జరిగిందన్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి గ్రామస్తాయిలో బాలలపై అత్యాచారాలు, హక్కుల ఉల్లంఘన, చట్టాలు, శిక్షలపై ప్రతీ ఒక్కరికి అవగాహణ కల్పించాలన్నారు. ఈ కేసు మానవత దృక్ఫథంగల ఏ అడ్వకేట్ కూడా వాధించకూడదని బార్ కౌన్సిలర్‌లో తీర్మాణం చేయాలన్నారు. ఈ సంఘటన పునరావృతం కాకూడదన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. ఈ కుటుంబాన్ని పరామర్శించిన వారిలో స్పందన స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు బొడ్డు గంగన్న, ఆదరణ ఎన్జీవో సంస్థ అధ్యక్షుడు ప్రసాద్, నల్లరాంరెడ్డి, జోసెఫ్, బండారి వెంకటేష్, గంధం మహేందర్, వీ.శ్రీనివాస్ పాల్గొన్నారు.