అదిలాబాద్

మత్స్యకారుల జీవనోపాధికి రాయితీ యూనిట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, జూన్ 23: మత్స్యకారుల ఆర్థికాభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం గత మూడేళ్లుగా ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తూ వారి జీవోనాధికి బాటలు వేస్తోందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగురామన్న అన్నారు. శనివారం ఆదిలాబాద్ జైనథ్ మండలం మేడిగూడ గ్రామంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది పథకాలకు ఆకర్షితులై పలువురు మంత్రి రామన్న సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మం త్రి రామన్న మాట్లాడుతూ మత్స్యకారులు సామాజికంగా, ఆర్థికంగా వెనకబాటుకు గురవుతున్నారని, చేపల వృత్తే ఆధారంగా జీవనం సాగిస్తున్న మత్స్యకారులకు రాయితీపై వలలు, మోఫెడ్లు, ఇతర సంక్షేమ పథకాలు వర్తించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. గంగపుత్రులు టీఆర్‌ఎస్ పార్టీకి గత ఉద్యమంలో అండగా నిలిచారని, వారి సంక్షేమం కోసం రాయితీపై స్వయం ఉపాధి యూనిట్ల మంజూరు కోసం బీసీ కార్పొరేషన్ ద్వారా నిధులు మంజూరి చేసి ఆదుకుంటామని అన్నారు. దేశంలో ఏ ప్రభుత్వం అమలు చేయని విధంగా తమ ప్రభుత్వం మత్స్యకారుల ఉపాధి కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టిన విషయాన్ని గుర్తుచేశారు. సాత్నాల ప్రాజెక్టులో భారీ ఎత్తున ఈసారి చేప పిల్లల పెంపకానికి చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఆరె రాజన్న, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు బోజారెడ్డి, ఎంపీపీ చంద్రయ్య, మత్స్యకారుల సంఘ నేతలు అశోక్, రామన్న, తదితరులు పాల్గొన్నారు.