అదిలాబాద్

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆసిఫాబాద్, జూలై 7: వర్షాకాలంలో ప్రబలే వ్యాధుల పట్ల వైద్య శాఖ అప్రమత్తంగా ఉండాలని కుమరం భీం కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వైద్యాధికారులతో సీజనల్ వ్యాధులపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ పాల్గొని సూచనలు చేశారు. వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత వైద్య సిబ్బందిపై ఉందన్నారు. ముఖ్యంగా పరిసరాల పరిశుభ్రత లోపించడం, దోమలు, ఈగలు వ్యాప్తిచెందడం కారణంగా వ్యాధులు ప్రబలే ఆస్కారం ఉందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని పారిశుధ్యం పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యంగా ఇంటి పరిసరాల్లో నీరు నిలువ ఉండడం వల్ల దోమలు, ఈగలు వృధ్ది చెంది అంటు వ్యాధులకు కారణమవుతాయని కలెక్టర్ పేర్కొన్నారు. దోమల బారిన పడకుండా దోమతెరలు వాడేలా ప్రజలకు వివరించాలన్నారు. వ్యాధులకు సంబంధించిన పోస్టర్లను ముద్రించి అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యంగా మలేరియా, డెంగ్యూ వ్యాధు ల గురించి ఉపాధ్యాయులు పిల్లలకు వివరించాలన్నారు. సీజనల్ వ్యాధుల గురించి ఎజెన్సీ మండలాల్లో ఎక్కువగా ప్రచారం చేయాలన్నారు. అలాగే 0 నుంచి 18 సంవత్సరాల లోపు చిన్నారులను గుర్తించి వ్యాధి నివారణ టీకాలు వేయాలన్నారు. ఎఎన్‌సీ చెకప్ కోసం 102 వాహనాల్లో ఆసుపత్రులకు వచ్చే వారికి పౌష్టికాహారం అందించాలని ఐసిడిఎస్ సిడిపిఓను కలెక్టర్ ఆదేశించారు. వారికోసం ప్లాట్‌ఫారం ఏర్పాటు చేయాలన్నారు. ఇంటింటి సర్వే చేసి టిబి రోగులను గుర్తించి ఆశ వర్కర్ల ద్వారా వారికి చికిత్స అందించాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జిల్లా వైద్యాధికారి సుబ్బారాయుడు, డిప్యుటీ వైద్యాధికారి, మలేరియా అధికారి, ఐసిడిఎస్ సూపర్‌వైజర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

మోడల్ ఆసుపత్రుల్లో రోగుల అవస్థలు
ఇచ్చోడ, జూలై 7: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మోడల్ ఆసుపత్రిగా అవార్డు పొందినా ఆసుపత్రికి వచ్చే రోగుల కష్టాలు మాత్రం తీరలేదు. శనివారం పురిటి నొప్పులతో దాదాపుగా 20 కి.మీటర్ల దూరంలోని సిరికొండ నుండి ఇచ్చోడ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన రేష్మ అనే గర్భిణీని రోడ్డు బురదమయంకావడంతో ఆస్పత్రి భవనం వరకూ వాహనం వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఆసుపత్రి సిబ్బంది ఆమెను స్ట్రెచర్‌పై రోడ్డు వద్ద నుంచే ఆసుపత్రికి తీసుకువెళ్లారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆసుపత్రి రహదారి బురదమయంగా మారడంతో రోగులను తీసుకవచ్చే వాహనాలు బురదలో కూరుకుపోవడంతో రోగుల పరిస్థితి దయానీయంగా మారింది. ఈ ఆసుపత్రిని ఇటీవల కేంద్ర బృందం పర్యటించి మోడల్ ఆసుపత్రిగా ఎంపిక చేశారు. గతంలో అనేకమార్లు ఈ ఆసుపత్రి రోడ్డుకు ఇరువైపుల వీదిదీపాలు, సిసి రోడ్డు నిర్మించాలని కోరినప్పటికీ పట్టించుకోకపోవడంతో రోగుల అవస్థలు వర్షాకాలంలో సమస్యలు తప్పడం లేదు. శనివారం జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఈ సమస్యను ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు దృష్టికి తీసుకవెళ్ళగా త్వరలో జిల్లా వైద్యాధికారి దృష్టికి సమస్యను తీసుకువెళ్ళి నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు.