అదిలాబాద్

పైసలు ఇస్తేనే.... పట్టా అంటున్నారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచిర్యాల, జూలై 7: జిల్లాలోని మందమర్రి మండలం నార్లాపూర్ గ్రామానికి చెందిన గోపతి శారద అదే గ్రామ శివారులోని 3 ఎకరాల 19 గుంటల భూమిని వీరాసత్ చేయాలని మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్‌ను వేడుకున్నారు. ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు ఆర్డీవో కార్యాలయం చుట్టు తిరిగిన వీరాసత్‌పై సమాధానం చెప్పకుండా తిప్పించుకుంటున్నారన్నారు. నార్లాపూర్ గ్రామంలోని మా మామ గారు అయిన గోపతి మొండి పేరు మీద 60 సంవత్సరాల నుండి పట్టా ఉన్నది. కొంత కాలం క్రితం మామ మొండి మృతి చెందాడు. అంతలోనే నా భర్త లక్ష్మణ్ క్యాన్సర్ వ్యాధితో చనిపోయాడు. లక్ష్మణ్ వైద్యం కోసం తిరుగుతున్న సమయంలో మాకు దూరపు బంధువులు అయిన రియల్ ఏస్టేట్ వ్యాపారం చేసే గోపతి మల్లేష్, గోపతి శ్రీనివాస్, గోపతి సత్యనారాయణలు నేను లేని సమయంలో 1.19 గుంటల భూమిని కబ్జా చేశారు. నా భూమిని కబ్జా చేశారని మందమర్రి పోలీస్‌స్టేషన్‌లో పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ న్యాయం జరుగలేదని, తహసీల్దార్‌కు విన్నవించినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బెల్లంపల్లి ఏసిపికి భూమిని కబ్జా చేశారని ఫిర్యాదు చేయడంతో మల్లేష్‌ను పేపర్‌లు ఉంటే కోర్టుకు వెళ్లి ఆర్డర్ తెచ్చుకో అని ఏసిపి చెప్పడంతో ఎలాంటి పేపర్ లేదని కబ్జా చేసిన వ్యక్తులు ఏసిపికి తెలియపరిచినట్లుగా తెలిపారు. ఏసిపి నన్ను భూమి సాగు చేసుకోమని తెలపడంతో భూమి సాగు చేసుకుంటుండగా నాపై దాడి చేయడమే కాకుండా చంపే ప్రయత్నం కూడా చేశారన్నారు. వారిపై మందమర్రి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ స్పందించకపోవడంతో మానవ హక్కుల కమీషన్‌కు ఫిర్యాదు చేయడం జరిగింది. మానవ హక్కుల కమీషన్ మావద్ద ఉన్న పాస్ పుస్తకాలు పరిశీలించి మంచిర్యాల ఆర్డీవోను కలువాలని తెలపడంతో ఫిబ్రవరి 15న ఆర్డీవోను కలిసి సమస్యను వివరిస్తే రూ.5 లక్షలు ఇస్తేనే మీ పేరునా భూమినీ వీరాసత్ చేసి ఇస్తానని ఆర్డీవో తెలపడంతో మా వద్ద అన్ని డబ్బులు లేవనీ వేడుకోగా సదరు పార్టీ రూ.5 లక్షలు ఇస్తామంటున్నాడని అతనికే చేస్తామని చెప్పడం జరిగిందని బాధితరాలు శారద తెలిపారు. అతని వద్ద భూమికి సంబంధించిన ఎలాంటి పేపర్‌లు లేవని ఎలా చేస్తారని ఆర్డీవోను నిలదీసి అడిగినప్పటికీ నేను తలుచుకుంటే ఏమైనా చేస్తానని బెదిరిస్తు ఇస్తే రూ.5లక్షలు ఇవ్వు, లేకపోతే ఏమి జరుగుతుందో చూడు అంటూ ఆసభ్యకరంగా ఆర్డీవో ప్రవర్తించాడని తెలిపారు. వారసత్వంగా వస్తున్న భూమిని నమ్ముకొని అత్త , పెళ్లికి ఎదిగిన బిడ్డ కుటుంబం అంతా ఆధారపడి బతుకుతున్నామని, భూకబ్జాదారుల నుండి భూమిని రక్షించి వీరాసత్ చేయాలని వేడుకున్నారు. లేనిపక్షంలో సామూహిక ఆత్మహత్య చేసుకుంటామని బాధితురాలు శారద తెలిపారు.