అదిలాబాద్

పట్టాదార్ పాస్‌బుక్ మొదటిపేజీ తప్పులను సరిదిద్దాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్, జూలై 7: భూ ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా రైతులకు అందించిన పట్టాదార్‌పాస్‌బుక్‌లో దొర్లిన తప్పులను రెండు రోజుల్లోగా వందశాతం సరిదిద్దాలని జిల్లా కలెక్టర్ ఎం.ప్రశాంతి రెవెన్యూ అధికారులకు ఆదేశించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆర్డీవోలు, తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు, వీఆర్‌వోలతో ఎల్‌ఆర్‌యుపిపై సమీక్షించారు. భూ ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా జారీచేసిన పట్టాదార్‌పాస్‌బుక్కుల్లో దొర్లిన తప్పులను పట్టాదార్ పాస్‌బుక్ మొదటి పేజీని రెండు రోజుల్లో సరిదిద్ది పూర్తిచేయాలన్నారు. ఆధార్ సీడింగ్, డిజిటల్ సంతకం చేసి ప్రింటింగ్‌కు పంపాలన్నారు. ఆర్డీవోలు, తహశీల్దార్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పూర్తిచేయాలన్నారు. మండలాలు, గ్రామాలవారీగా నివేదికలు తీసుకుని తప్పులను సరిదిద్దాలన్నారు. గ్రామ రెవెన్యూ అధికారులు సత్వరమే స్పందించి రికార్డులను సరిదిద్దాలన్నారు. లేనిచో కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. గ్రామాలవారీగా కలెక్టర్ సమీక్షించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి రమేష్ రాథోడ్, ఆర్డీవో ప్రసూనాంభ, తహసిల్దార్లు, డీటీవోలు, వీ ఆర్‌వోలు, తదితరులు పాల్గొన్నారు.
మైనార్టీల అభివృద్ధికి కృషి
* ముధోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి
తానూర్, జూలై 7: ముస్లిం మైనార్టీల సంక్షేమ అభివృద్దికి తెలంగాణ రాష్ట్ర ఫ్రభుత్వం ఎంతో కృషిచేస్తుందని ముధోల్ ఎమ్మెల్యే జి.విఠల్‌రెడ్డి అన్నారు. శనివారం తన నివాసంలో జౌల(బి) గ్రామ ముస్లిం మైనార్టీలకు సోదరులకు షాదీఖానా నిర్మాణం కోసం రూ.5 లక్షల నిధులు మంజూరైన పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనార్టీల సంక్షేమానికి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి అమలుచేస్తుందన్నారు. ముస్లిం మైనార్టీ ఆడపడుచులకు షాదీముబారక్ పథకం కింద రూ. ఒక లక్ష 116లు ఆర్థికసాయం, మైనార్టీ విద్యార్థుల చదువు కోసం మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్, గురుకుల పాఠశాలలు, తదితర వాటిని అభివృద్ది చేస్తుందన్నారు. అన్నివర్గాల అభివృద్దికి తెలంగాణ ఫ్రభుత్వం అహర్నిషలు కృషిచేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెరాసా నాయకులు బషీర్, గ్రామస్థులు బాబుమియా, అమీర్‌సాబ్, మీరా, తదితరులు పాల్గొన్నారు.

ఆత్మ చైర్మన్‌గా శ్రీనివాస్‌రెడ్డి
ఇచ్చోడ, జూలై 7: ఇచ్చోడ మండల ఆత్మచైర్మెన్‌గా తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు ఏనుగు శ్రీనివాస్ రెడ్డిని నియమించారు. ఈమేరకు నియామక పత్రాన్ని శనివారం బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ఆయనకు అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన శ్రీనివాస్ రెడ్డిని ఆత్మచైర్మెన్‌గా నియమించడం సంతోషకరమని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు. ఉద్యమాల్లో పనిచేసిన వారందరికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సముచిత గుర్తింపునిస్తుందన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తమపై నమ్మకంతో ఆత్మచైర్మెన్‌గా నియమించిన ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వారి సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండల పార్టీ కన్వీనర్ మిరాజ్ ఆహ్మాద్, బాలాజీపటేల్, రాథోడ్ ప్రకాష్, అబ్దుల్ రషీద్, పాండురంగ్ తదితరులు పాల్గొని శ్రీనివాస్ రెడ్డిని శాలువాలతో సన్మానించారు.