అదిలాబాద్

కేంద్ర పథకాలను సద్వినియోగం చేసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆసిఫాబాద్ టౌన్, జూలై 20: ప్రజల సంక్షేమాన్ని కోరుతూ ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వ సహాయ కార్యదర్శి ప్రియాంక అన్నారు. శుక్రవారం మండలంలోని సాలెగూడ గ్రామంలో నిర్వహించిన గ్రామస్వరాజ్ అభియాన్ యోజన సభలో ఆమె మాట్లాడుతూ మారుమూల గ్రామాల అభివృద్ధి కోసం కేంద్రం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. గ్రామస్వరాజ్‌లో భాగంగా జిల్లాలోని 149 గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటుచేసి సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతోందన్నారు. ప్రజలందరూ ఎల్‌ఇడి బల్బులనే వినియోగించాలని తద్వారా విద్యుత్ వినియోగం తగ్గుతుందన్నారు. స్వచ్ఛ్భారత్‌లో భాగంగా ఇంటింటికి మరుగుదొడ్లు నిర్మించుకొని వాటిని వినయోగించుకోవాలని సూచించారు. అర్హులైన ఎస్సీలకు ఉచితంగా వాటిని అందించండం జరుగుతోందన్నారు. కార్యక్రమంలో డిపివో గంగాధర్ గౌడ్, డిప్యూటీ డిఎంహెచ్‌వో సుధాకర్ నాయక్, ఏవో ఖాదర్ హుస్సేన్, విద్యుత్ శాఖ ఏఇ ఫిరోజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

కారుణ్య నియామకాలు వేగవంతం
* టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావు
శ్రీరాంపూర్ రూరల్ జూలై 20: కారుణ్య నియమాకాలను వేగవంతం చేసి కార్మికులకు అండగా నిలుస్తామని టిబిజికెఎస్ అధ్యక్షుడు బి వెంకట్రావు పేర్కొన్నారు. శుక్రవారం శ్రీరాంపూర్ ప్రెస్‌క్లబ్ ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటి వరకు దాదాపు 1300 మంది మెడికల్ అన్‌ఫిట్ కోసం దరఖాస్తు చేసుకోగా దాదాపు 1000 మందికి మెడికల్ ఇన్‌వాల్యుయేషన్ ద్వారా అన్‌ఫిట్ చేయడం జరిగిందని తెలిపారు. టిబిజికేఎస్ ఒత్తిడి మేరకే బోర్డులో చాలామంది కార్మికులు మెడికల్ ఇన్‌వ్యాల్యుయేషన్ ఇచ్చారే తప్పా యజమాన్యం ఎవరికి లేటర్ ఇవ్వలేదన్నారు. దీనిపై ఈనెల 23న డైరెక్టర్ స్థాయి సమావేశంలో కారుణ్య నియమాకాల వేగవంతంపై చర్చిస్తామన్నారు. దరఖాస్తు చేసుకున్న కార్మికులలో దాదాపు 70శాతం మందికార్మికులకు అన్‌ఫిట్ చేసి వారి వారసులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. ప్రభుత్వం, టిబిజికేఎస్ కార్మికుల అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నప్పటికీ జీర్ణించుకోలేని ఏఐటియూసి, ఐఎన్‌టియూసి సంఘాలు ఆసత్య ప్రచారాలు చేస్తు కార్మికులను ప్రక్క ద్రోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో టిబిజికేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, ఉపాధ్యక్షుడు బడిగెల సంపత్ కుమార్, బెల్లంపల్లి రిజీయన్ కార్యదర్శి మంద మల్లారెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, సిక్స్‌మెన్ కమిటీ సభ్యులు కే వీర భద్రయ్య, పెట్టెం లక్ష్మణ్, కుమార స్వామి, బ్రాంచ్ ఉపాధ్యక్షుడు ఏ సురేందర్‌రెడ్డిలతో పాటు వివిధ గనుల ఫిట్ సెక్రటరీలు పాల్గొన్నారు.