అదిలాబాద్

సమష్టి కృషితో పురోగతి సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆసిఫాబాద్, జూలై 20: సమష్ఠి కృషితో కేసుల విచారణలో పురోగతి సాధ్యమని జిల్లా ఎస్పీ కల్మేశ్వర్ సింగన్‌వార్ అన్నారు. శుక్రవారం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో జిల్లాలోని పోలీస్ అధికారులతో నిర్వహించిన నెలావారీ నేర సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని సమీక్ష నిర్వహించారు. పోలీస్ అధికారులకు నేరాలు, ప్రమాదాల పట్ల సరైన అవగాహన ఉన్నప్పుడు నేరాల సంఖ్య గణనీయంగా తగ్గుతాయన్నా రు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌ల వారీగా నేరాల నమోదు వాటి పరాష్కారానికి తీసుకున్న చర్యలపై ఎస్పీ సమీక్షించారు. పెండింగ్‌లో ఉన్న నేరాల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పెట్టి కేసులు, సమన్లు , నాన్‌బెయిలేబుల్ వారంట్లు ఒక క్రమ పద్ధతిలో పొందుపరిచి వాటిని క్రమం తప్పకుండా పరిశీలిస్తూ కన్విక్షన్‌కు తీసుకురావాలిన్నారు. రోజురోజుకు పోలీసింగ్‌లో నాణ్యతను పెంచుకోవాలని సూచించారు. తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. డ్రంకెన్ డ్రైవ్‌లపై అవగాహన కల్పిస్తూ తాగడం వల్ల కలిగే అనర్థాలను వివరించాలని సూచించారు. నమోదు అయిన కేసుల వివరాలను ఎప్పటికప్పుడు సిసిటి ఎన్ ఎస్‌లో నమోదు చేయాలని సూచించారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ గోద్రు, డిస్పీలు సాంబయ్య, ఎస్బీ ఇన్స్‌పెక్టర్ కాశయ్య, డిసిఆర్బీ ఇన్స్‌పెక్టర్ వేణు గోపాల్, జిల్లాలోని సి ఐలు, ఎస్ ఐలు పాల్గొన్నారు.

గొర్రెల పంపిణీ పకడ్బందీగా చేపట్టండి
* కలెక్టర్ ప్రశాంత్ పాటిల్
ఆసిఫాబాద్ టౌన్, జూలై 20: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండవ విడత గొర్రెల పంపిణి కార్యక్రమాన్ని జిల్లాలో పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో గొర్రెల పంపిణీ కార్యక్రమంపై జిల్లాలోని పశు వైద్యాధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. గొర్రెల పంపిణీపై ఆయా సమావేశాలు నిర్వహించి సభ్యులకు అవగాహన కల్పించాలన్నారు. లబ్దిదారులు తమవంతు వాటా 25శాతం డబ్బును డిడిగా కట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 2200యునిట్ల లక్ష్యం ఉన్న నేపథ్యంలో రెండు మూడు నెలల్లోగా లక్ష్యాన్ని సాధించేదిశగా పశువైద్యాధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో సహాయ సంచాలకులు డాక్టర్ ఎండి ఖాన్, డాక్టర్ సిహెచ్ రమేష్, జిల్లాలోని ఆయా మండలాల పశువైద్యాధికారులు పాల్గొన్నారు.