అదిలాబాద్

నాలుగో విడత హరితహారానికి 4కోట్ల మొక్కలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, జూలై 20: పెరుగుతున్న జనాభా నేపథ్యంలో నానాటికి అటవీ విస్తీర్ణం తగ్గిపోవడంపై ముఖ్యమంత్రి కెసిఆర్ ఇటీవల అందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో హరితహారంలో భారీఎత్తున మొక్కలునాటి లక్ష్యాన్ని అధిగమించేందుకు అధికార యంత్రాంగం సమాయత్తమవుతోంది. వర్షాలు సమృద్ధిగా కురవడంతో నాల్గో విడత హరితహారంలో మొక్కలు నాటేందుకు వాతావరణం అనుకూలిస్తోందని, వారం రోజుల్లోగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని యజ్ఞంలా నిర్వహించేందుకు ఇప్పటికే అటవీ శాఖతో పాటు డిఆర్‌డిఏ, ఐటిడిఏ, పోలీసు శాఖ కసరత్తు సాగిస్తోంది. ప్రభుత్వ శాఖలకు ఈ మేరకు లక్ష్యాలను నిర్దేశించడంతోపాటు విద్యార్థులు, యువజన సంఘా లు, స్వచ్చంద సంస్థలను భాగస్వాములను చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో సగటున ఏటా 30చదరపు కిలోమీటర్ల మేర అటవీ సంపద అంతరించిపోతున్నాయని, అడవులు మైదానంలా మారుతున్నాయని, భూభాగంలో 24శాతం అటవీ భూములు ఉంటే అక్రమణలు, చెట్లు కొట్టేయడంతో 12శాతానికి పరిమితమయ్యాయని ముఖ్యమంత్రి ఇటీవల జరిగిన సమావేశంలో పేర్కొ న్న నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు ప్రతిష్టాత్మకంగా సవాల్‌గా తీసుకుంటున్నారు. ఈమేరకు ఆదిలాబాద్ జిల్లాలో 4కోట్ల మొక్కలు నాటేలా ప్రణాళిక రూపొందించారు. జిల్లాలో అటవీ విస్తీర్ణం 41.10 శాతం ఉండగా మంచిర్యాల జిల్లాలో 43.85, కుమురంభీం జిల్లాలో 49.61 శాతం, నిర్మల్ జిల్లాలో 31.55 శాతం అటవీ విస్తీర్ణం ఉన్నట్లు గణంకాలు చెబుతున్నాయి. పర్యావరణ పరిరక్షణతో పాటు రాష్ట్రాన్ని పచ్చలహారంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రతి ఏటా నిర్వహిస్తున్న హరితహారంలో భాగంగానే ఈసారి మరింత పకడ్బందీగా చేపట్టేలా కసరత్తు సాగిస్తున్నారు. జిల్లాలో 96నర్సరీల్లో కోటి పది లక్షల మొక్క లు అందుబాటులో ఉండగా మంచిర్యాల జిల్లాలో 94నర్సరీలకుగాను కోటి మొక్కలు, కుమురంభీం జిల్లాలో 71నర్సరీల్లో 85లక్షల మొక్కలు, నిర్మల్ జిల్లాలో 62నర్సరీలకుగాను కోటి 12లక్షల మొక్కలు అందుబాటులో ఉంచారు. రహదారుల ఇరువైపుల గుల్‌మోహర్, ఫెల్లోఫాం, రైన్‌ట్రీ, చీమతంగెడు, రాగీ, మర్రి, కానుగ, వేప, నేరెడు తదితర వాటిని నాటనున్నారు. ఈసారి ఇంటి ఆవరణలోను పండ్లమొక్కలు నాటేలా నిమ్మ,దానిమ్మ,మామిడి,మునగ, బొప్పాయి, సీతాఫలం, ఉసిర మొక్కలు పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో విద్యార్థుల చేత భారీ గా మొక్కలు నాటేలా నిర్దేశించారు. ప్రభుత్వ కార్యాలయ ప్రాంగణంలో ఉద్యమంలా మొక్కలు నాటేందుకు సన్నద్దమవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా వారం రోజుల్లో హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించేలా కసరత్తు సాగిస్తుండగా వాతావరణం అనుకూలించడం అధికారుల్లో ఆనందం కల్గిస్తోంది.