అదిలాబాద్

మండలంలో డెంగ్యూ లక్షణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉట్నూరు, జూలై 20: మండలంలో డెంగ్యు లక్షణాలు కనిపించడంతో వైద్య అధికారులు అప్రమత్తమై నివారణ చర్య లు చేపట్టారు. నాలుగు రోజుల క్రితం స్థానిక మండలం మథుర సాకెర గ్రామానికి చెందిన లాక్య సందీప్ (11) అనే విద్యార్థి వాంతులు, విరేచనాలతో ఆనారోగ్యానికి గురికాగా కుటుంబ సభ్యులు ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. అక్కడ వైద్యం పొందుతూ మృతి చెందగా వైద్య పరీక్షల్లో డెంగ్యూ లక్షణాలు కనిపించడంతోపాటు రక్తకణాలు పడిపోయాయని తేలింది. దీంతో అప్రమత్తమైన వైద్య సిబ్బంది శుక్రవారం మథుర సాకెర గ్రామంలో జిల్లా వైద్యాధికారి రాజీవ్‌రాజ్, డిప్యూటీ డిఎంఆండ్‌హెచ్‌వో వసంత్‌రావు అధ్వర్యంలో పర్యటించి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి ఒక్కరికి వైద్య పరీక్షలు నిర్వహించగా, మరో అమ్మాయికి డెంగ్యూ లక్షణాలు కనిపించడంతో హుటా హుటిని ఆసుపత్రికి తరలించారు. దివ్య అనే అమ్మాయి డెంగ్యు నిర్దారణ కావడంతో గ్రామంలోని బోరుబావుల్లో, పరిసరాల్లో, ఇండ్లల్లో డెంగ్యు నివారణ మందుతో పిచికారి చేయించారు. అనంతరం అక్కడి ప్రజలతో సమావేశం నిర్వహించారు. ఈ సంధర్భంగా డిఎంఆండ్‌హెచ్‌వో రాజీవ్‌రాజ్ మాట్లాడుతూ ప్రతీఒక్కరూ పరిశుభ్రత పాటించాలని, లేనట్లయితే వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని సూచించారు. పగటి పూట కుట్టిన దోమల వల్ల డెంగ్యు జ్వరం వస్తుందని, దీంతో రక్తకణాలు తగ్గిపోయి రక్తహీనత ఏర్పడుతుందన్నారు. కార్యక్రమంలో ఈవోపిఆర్‌డి లక్ష్మణ్, సర్పంచ్ సరిత శ్రీనివాస్, కార్యదర్శి రమేష్, వైద్యసిబ్బంది వెంకటేశ్వర్లు, గోకుల్ తదితరులు పాల్గొన్నారు.

పటిష్ట నిఘాతోనే శాంతిభద్రతల అదుపు
* సమీక్షా సమావేశంలో జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్
ఆదిలాబాద్ టౌన్, జూలై 20: జిల్లాలో పటిష్టమైన పోలీసు నిఘా ఏర్పాటు చేయడంతోనే శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ అన్నారు. శుక్రవారం స్థానిక పోలీసు సమావేశ మందిరంలో జిల్లా పోలీసు అధికారులతో శాంతి భద్రతలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలకమైన అంశాలపై చర్చించారు. ఆసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి కేసును లోతుగా దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, సామాన్యులకు పోలీసులు అండగా ఉండాలన్నారు. బాధితులుగా వచ్చిన వారితో మర్యాదగా మాట్లాడాలని సూచించారు. పెండింగ్ కేసుల్లో పురోగతి సాధించిన నాన్ బెయిల్‌బుల్ వారెంట్‌దారులను గుర్తించి అరెస్ట్ చేయాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించినవారిపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానం జోడించి న్యాయస్థానంలో కఠినంగా శిక్ష అమలు చేసే విధంగా కృషి చేయాలని తెలిపారు. అదే విధంగా ఆపరేషన్ ముస్కాన్4లో భాగంగా బడి ఈడు పిల్లలను గుర్తించి బడిలో చేర్పించాలని, హరితహారంలో పోలీసులు చురుగ్గా పాల్గొని రికార్డుస్థాయిలో మొక్కలు నాటాలన్నారు. సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్న తప్పుడు వదంతులపై ప్రజల్లో మరింత ప్రచారం చేసి చైతన్య పర్చాలని, నూతన వ్యక్తులు, అనుమానితులపై ప్రజలు చేయి చేసుకోవద్దని, పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. పోలీసులకు తెలుపకుండా దాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువతీ యువకులు ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్‌కు పాల్పడకుండా కళాశాలల్లో షీటీంలతో అవగాహన కల్పించాలన్నారు. డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో మరింత కఠినంగా వ్యవహరించలని పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు. ప్రతి కాలనీల్లో సీసీ టీవీలు అమర్చేవిధంగా స్థానికులతో సమావేశాలు నిర్వహించాలని, పోలీసు అధికారులు గ్రామాల్లో సందర్శించి ముందస్తుగా సమస్యలపై సమాచారం సేకరించి పరిష్కారం అయ్యేవిధంగా కృషి చేయాలన్నారు. గిరిజన ఏజెన్సీ ప్రాంతాల్లో భూ సమస్యలను పరిష్కరించేందుకు రెవెన్యూ అధికారులతో సమన్వయంగా ఉండి పర్యవేక్షించాలని, సామాజిక రుగ్మతలైన భానామతి, రైతు ఆత్మహత్యలు, అంటరానితనం, రోడ్డు ప్రమాదాలు, తదితర అంశాలపై కళాబృందంతోప్రదర్శనలు చేపట్టాలన్నారు. శాంతి భద్రతల రక్షణకు పోలీసులు మరింత శ్రమించాలని, నిజాయితీగా విధులు నిర్వహించినవారికి నగదు ప్రోత్సహంతో పాటు ప్రశంస పత్రాలు అందజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ సాదు మోహన్ రెడ్డి, కంచ మోహన్, డిఎస్పీలు కె.నర్సింహారెడ్డి, ఎన్.వెంకటేష్, జి.కిషన్‌సింగ్, స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ ఏ.విశ్వప్రసాద్, సిఐ కొంక మల్లేష్, టి.సురేష్, స్వామి, ఎన్.సత్యనారాయణ, ఏ.ప్రదీప్‌కుమార్, ఎస్.సతీష్‌కుమార్, జయరాం, వినోద్, ఎస్సైలు ఎన్.వెంకటేష్, పుల్లయ్య, తిరుపతి, సుబ్బారావు, ఎస్‌ఏ బాకీ, అన్వర్ ఉల్ హఖ్, బి.అనిల్, సిసి దుర్గం శ్రీనివాస్, జిల్లా కంప్యూటర్ విభాగం ఇంచార్జీ సింగజ్‌వార్ సంజీవ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

14లోగా భగీరథ పనులు పూర్తి చేయాలి
* కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
ఆసిఫాబాద్, జూలై 20: రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పనులను జిల్లాలో ఆగష్టు 14లోగా పూర్తిచేసి అన్ని గ్రామాలకు నల్లాల ద్వారా నీరందిచేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశమందిరంలో మిషన్ భరీరథ పనులపై భగీరథ, ఆర్ డబ్ల్యుఎస్, కాంట్రాక్టర్లతో ఆయన సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మిషన్ భగీరథ పనులను ఆగష్టు 14లోగా పూర్తి చేయడంతోపాటు ఇప్పటికే పనులు పూర్తయిన గ్రామాలకు నీటిని సరాఫరా చేయాల న్నారు. కుమ్రంభీం ప్రాజెక్టు కుడి వైపు ఉన్న 10 మండలాల్లో పనులు వేగవంతంగా పూర్తిచేయాలన్నారు. జిల్లాలోని 622 హాబిటేషన్లలో నీటి సరాఫరా కొనసాగుతోందని మిగతా గ్రామాల్లో పనులు పూర్తిచేసి నీటిని పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాంట్రాక్టర్ల పనితీరును ఏఇలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ గడువులోగా పూర్తయ్యేలా చూడాలన్నారు. మిషన్ భగీరథ ఇంట్రా పనుల్లో భాగం గాజిల్లావ్యాప్తంగా 915ట్యాంకుల నిర్మాణానికిగాను ఇప్పటివరకు 82 ట్యాంకు ల నిర్మాణం పూర్తికాగా, మిగిలిన 695 ట్యాంకుల నిర్మాణం పురోగతిలో ఉందన్నారు. కాగా,113.61కిమీ ఫైప్‌లైన్ నిర్మాణం పూర్తయిందని మిగతా పనులు త్వరితగతిలో పూర్తిచేయాలన్నారు. జిల్లాలో 69 ఆవాసాలకు తాగునీటిని నల్లాల ద్వారా ఇవ్వడం జరగుతోందని మిగతా పనులన్నీ జూలై 30లోగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో మిషన్ భగీరథ ఇఇ రమణ, భగీరథ ఇంట్రా ఇఇ కృష్ణమూర్తి, ఏఇలు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.