అదిలాబాద్

మంత్రుల ఇళ్ల్లు ముట్టడిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉట్నూరు, డిసెంబర్ 26: గిరిజన వర్సిటీని ఉట్నూరు కేంద్రంగా ఏర్పాటు చేయనిపక్షంలో మంత్రుల ఇళ్లు ముట్టడిస్తామని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి పూసం సచిన్ హెచ్చరించారు. శనివారం ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ అన్నిరంగాల్లో వెనుకబడి ఉన్న గిరిజనులు అభివృద్ధి సాధించాలంటే వారికి విద్య అవసరమని, కేంద్రప్రభుత్వం ఏర్పాటుచేసే గిరిజన వర్సిటీని ఉట్నూరు కేంద్రంగా ఏర్పాటు చేసినట్లయితే ఆదివాసీ గిరిజనులు అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతారన్నారు. ప్రస్తుత తెలంగాణలోని అన్ని జిల్లాల్లో వర్సిటీలు ఉన్నాయని, ఖమ్మం, ఆదిలాబాద్‌లో వర్సిటీలు లేనందున ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీలు ఎక్కువగా ఉన్నందున వర్సిటీని ఆదిలాబాద్ జిల్లాలోనే ఏర్పాటు చేయాలన్నారు. గతంలో కలెక్టర్‌గా పనిచేసిన ఆహ్మాద్‌బాబ్ అధ్వర్యంలో యూనివర్సిటీ ఏర్పాటుకు 400 ఎకరాల స్థలసేకరణ ఉట్నూరులో గుర్తించి, నివేదికలు సైతం పంపడం జరిగిందన్నారు. లేనిపక్షంలోఅందోళనలు చేపడుతామని హెచ్చరించారు. సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు నగేష్, రాహుల్, జయశ్రీ, మహేష్, రాజేందర్, దేవురావు తదితరులు పాల్గొన్నారు.

బిసి స్టడీ సర్కిల్ డైరెక్టర్‌గా ప్రవీణ్‌కుమార్

ఆదిలాబాద్ టౌన్, డిసెంబర్ 26: బిసి స్టడీ సర్కిల్ డైరెక్టర్‌గా గడ్డల ప్రవీణ్‌కుమార్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు బిసి స్టడీ సర్కిల్ ఇన్‌చార్జి డైరెక్టర్‌గా ఉన్న మేఘనాథ్ నుండి ప్రవీణ్‌కుమార్ ఈ మేరకు పూర్తి బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పేద నిరుద్యోగ విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ స్టడీ సర్కిళ్లను బలోపేతం చేస్తుందన్నారు. జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు ఉచిత శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.