అదిలాబాద్

ఆదిలాబాద్‌లో భానుడి ప్రచండ రూపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, ఏప్రిల్ 21: ఆదిలాబాద్ జిల్లాలో ప్రచండమైన ఎండల తీవ్రతకు ప్రతి రోజూ జనం పిట్టల్లా రాలిపోతున్నారు. గురువారం పగటి ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్ నమోదు కావడంతో ప్రజలు ఇంటి గడప దాటి బయటకు వెళ్లలేకపోయారు. నిప్పుల కుంపటిగా మండుతున్న ఎండలకు తోడు వడగాల్పుల సెగలతో జనం తల్లడిల్లిపోయారు. రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టి సాయంత్రం వేళల్లో చల్లటి గాలులతో ప్రజలు సేద తీరగా ఆకస్మత్తుగా భానుడు ఉగ్రరూపం దాల్చడంతో ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కాగజ్‌నగర్ డివిజన్ ప్రాంతాల ప్రజలు తీవ్ర అవస్థలకు గురయ్యారు. ముఖ్యంగా ఏజెన్సీలో ఎండల తీవ్రత రికార్డు స్థాయిలో నమోదవుతుండగా పిల్లలు, వృద్దులు విష జ్వరాలతో ఆసుపత్రి పాలవుతున్నారు. కాగా గురువారం ఒకే రోజు ఎండ దెబ్బకు నలుగురు మృత్యువాత పడ్డారు. కాగజ్‌నగర్ పట్టణంలో ప్రైవేట్ వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న బండ్యాల రాంచందర్ (52) అనే వ్యక్తి, యశోద (67) అనే మహిళ వడదెబ్బతో మృతి చెందారు. దండేపల్లి మండలం నెల్కి వెంకటపూర్‌కు చెందిన టేకం లచ్చుబాయి (60) వడదెబ్బ సోకి వాంతులు, విరేచనాలతో గురువారం మృత్యువాత పడింది. అదే విధంగా బెల్లంపల్లి పట్టణంలో కొమ్ము గంగులు(50) మృతి చెందాడు. జిల్లాలో రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో సామాన్యులు, వ్యవసాయ కూలీల ఉపాధి దెబ్బతింటుండగా మూగ జీవాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మరో వారం రోజుల పాటు ఎండల తీవ్రత ఇదే విధంగా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.