అదిలాబాద్

కాల్వలు ఇలా నీరు పారేది ఎలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాంకిడి, ఏప్రిల్ 21: చిన్న చిన్ని మరమ్మతు పనులు, సరిచేయని ఎత్తువంపులు, సక్రమంగా పూర్తిచేయని కాల్వ పనుల వల్ల కోట్ల రూపాయలు వెచ్చించి మండలంలో నిర్మించిన అనేక చెరువులు నిరుపయోగంగా మారుతున్నాయి. ఇదే కోవకు చెందిన మండలంలోని బంబార గ్రామంలో 2010లో నిర్మించిన బంబార చెరువు ఒకటి. ఈ చెరువుని దాదాపు 10కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన చెరువులు రైతులకు ఏమాత్రం ఉపయోగపడడంలేదని మండలంలోని బంబార గ్రామానికి చెందిన ఆయకట్టు రైతులు వాపోతున్నారు. ఈ చెరువుకు కనీసం మిషన్ కాకతీయలోనైన న్యాయం చేయాలని వారు ప్రజాప్రతి నిధులను, నాయకులను,అధికారులను కోరుతున్నారు.చెరువు కింద ఉన్న ఆయకట్టు రైతుల భూములకు చెరువు కాల్వలు నిర్మించినప్పటి నుండి ఇంత వరకు చుక్కనీరు అందలేదని వారంటున్నారు. ప్రధాన కాల్వ నిర్మాణంలో చేసిన చిన్నచిన్న తప్పులవల్ల రైతులకు ఈ చెరువు ఉపయోగంలేదని,కాల్వ నీటిని చిన్న చిన్న వాగులను దాటించడానికి నిర్మాణం సమయంలో వేసిన పైపులు పగిలి నీరంత లీక్ అవుతుంది. దీంతో దిగువ ఉన్న పొలాలకు ప్రధాన కాల్వ నీరు ఏకాలంలో కూడా అందడంలేదని,బంబార, కొసార, బనార్‌కొసార, ఖైరిట్ గ్రామాల ఆయకట్టు రైతులు వాపోతున్నారు. ఈ చెరువుకింద 500ఎకరాలు ఆయకట్టుగా డిజైన్‌చేసి దాదాపు 10కోట్ల రూపాయలతో ఈ చెరువు నిర్మించారు. అయితే ఇప్పటి వరకు ఒక్క ఎకరం కూడా సాగులోకి రాలేదని పై గ్రామాల రైతులు వాపోతున్నారు. కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ చెరువు కింద 500 ఎకరాల ఆయకట్టుని గుర్తించిగా, చెరువు నిర్మించి ఐదారు సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికీ ఏఒక్కరికి దీంతో ఉపయోగం లేదని రైతులు అంటున్నారు. చెరువు పూర్తి అయినప్పటి నుండి కాల్వలు పగిలిపోయి నీరంతా వృధా అవుతుందని అయినా అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని వారంటున్నారు.
కాల్వ పై వేసిన మట్టిని తొలగించాలి
బంబార చెరువు కింద నిర్మించిన ప్రధాన కాల్వ నిర్మాణ సమయంలో కాంట్రాక్టర్ వేసిన మట్టి కుప్పలను ఐదు సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ తీసివేయలేదని,దీంతో వరద నీటితో తిరిగి ఆ మట్టి కాల్వలోకే పడుతుందని దాంతో నిర్మించిన కాల్వ ఇప్పటికే పై మట్టితో పూడుకొని పోయిందని వారంటున్నారు.అక్కడక్కడ మట్టి చేరి నీటిని పోకుండా ఆపుతుందని వారంటున్నారు.దీంతో దిగువనున్న పొలాలకు నీరు అందడం లేదని వారంటున్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి కాల్వను బాగు చేయాలని కోరుతున్నారు.
మిషన్ కాకాతీయలో లేని బంబరా చెరువు
ఎప్పుడు నీరు నిండి కళకళలాడుతుండే బంబార చెరువుకు ప్రధాన కాల్వ సరిగ్గాలేకపోవడంతో నీరు పోలాలకు చేరడం లేదని, కనీసం మిషన్ కాకతీయలోనైన ఈ కాల్వలను బాగుచేస్తారని ఆశించిన ఈ చెరువును ఆ పథకంలో చేర్చకపోవడంపై ఈ చెరువు ఆయకట్టు గ్రామలు బంబార, ఖైరిట్, గోండ్‌కొసార, బనార్‌కోసార, లంజన్‌వీర గ్రామాల రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ చెరువుతో దాదాపు నాలుగైదు గ్రామాలకు తాగునీటితోపాటు సాగు నీరుకూడా అందుతాయని వారంటున్నారు. ఇప్పటికైన ఈ చెరువును మిషన్ కాకతీయ పథకంలో చేర్చి వెంటనే పనులు చేపట్టాలని వారు కోరుతున్నారు.