అదిలాబాద్

నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉట్నూరు, సెప్టెంబర్ 23: తనపై అదేపనిగా చవకబారు ఆరోపణలు చేస్తూ ఇష్టమొచ్చినట్లు నిందించడం మానుకోవాలని, నిరాధారణంగా ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని మాజీ ఎంపి రాథోడ్ రమేష్ ధ్వజమెత్తారు. తాజా మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్‌నుద్దేశించి ఆదివారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ తనకు హైదరాబాద్, మహారాష్టల్రో ఆస్తులు ఉన్నాయని ఆరోపణలు చేస్తున్న వారు బహిరంగ చర్చకు రావాలని, లేదంటే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తాను లోకల్ కాదని అనడం సరికాదని, ఎవరు నాన్ లోకల్ అనేది ప్రజలకు తెలుసన్నారు. ఆరోపణలు చేసేవారు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. నోరు ఉందికదా అని ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదని ఆయన గుర్తుచేశారు. పదవీలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీ వారిని సైతం ఆపదలో ఆదుకున్నానని, తాను బేదాభిప్రాయాలు ఎక్కడ చూయించలేదన్నారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరినందునా ఆ పార్టీ సీనియర్ నాయకులు సైతం గౌరవిస్తున్నారని, రాహుల్ గాంధీ, ఉత్తమ్‌కుమార్ రెడ్డి నాయకత్వంలో పనికి చేయడానికి సిద్దంగా ఉన్నానని అన్నారు. స్థానికేతరులు వచ్చి తనపై ఆరోపణలు చేస్తున్నప్పుడు వారేమిటో తెలుసుకోవాలన్నారు. ప్రజాసమస్యలను పరిష్కరించిన వారినే ఆదరిస్తారని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎంపిపి దన్‌లాల్, జడ్పీటీసీ సాడ్గె గంగన్న, మాజీ మార్కెట్ కమిటీ చైర్మెన్ షేక్ ఆహ్మాద్ తదితరులు పాల్గొన్నారు.

శాంతిభత్రలకు సహకరించాలి
* జిల్లా ఎస్పీ శశిధర్‌రాజు
దివ్యనగర్, సెప్టెంబర్ 23: యువకులు శాంతిభద్రతలకు పోలీసులకు సహకరించాలని నిర్మల్ జిల్లా ఎస్పీ శశిధర్‌రాజు తెలిపారు. ఆదివారం నిర్మల్ పట్టణంలోని బంగల్‌పేట్ గణేష్ విగ్రహం వద్ద పూజలు నిర్వహించి నిర్వాహకులతో మాట్లాడారు. గణేష్ నిమజ్జన ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలన్నారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా పోలీసుల దృష్టికి తీసుకురావాలన్నారు. ఉత్సవ సమితి సభ్యులు సంయమనంతో అక్కడికక్కడే సమస్యలు పరిష్కరించి శోభాయాత్ర సజావుగా జరిగేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు. శాంతిభద్రతల్లో భాగంగా పట్టణంలో శోభయాత్ర జరిగే ప్రధానకూడళ్ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి, వార్డు కౌన్సిలర్ పాతర్ల చంద్రకళ గణేష్, గణేష్ మండప నిర్వాహకులు పెండం శ్రీనివాస్, శ్రీకాంత్, గంగాధర్, రాకేష్, నరేష్, వెంకట్, రాము తదితరులు పాల్గొన్నారు.

మంత్రి అల్లోల సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరిన గంగపుత్రులు
దివ్యనగర్, సెప్టెంబర్ 23: నిర్మల్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌లోకి వలసల పర్వం కొనసాగుతుంది. ఆదివారం రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి సమక్షంలో వడ్యాల్, కొండాపూర్ గ్రామాలకు చెందిన గంగపుత్రులు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గంగపుత్రుల కోసం కేసీఆర్ తెచ్చిన నీలి విప్లవం, వారి జీవితాలను సమూలంగా మార్చివేసిందన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ ఒక్కటే తెలంగాణ అస్థిత్వాన్ని నిలబెట్టగలదన్నారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు వెంకట్‌రాం రెడ్డి, పీఎసీఎస్ చైర్మెన్ రామేశ్వర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.