అదిలాబాద్

గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్, సెప్టెంబర్ 23: సంప్రదాయబద్ధంగా వస్తున్న గణేష్ నిమజ్జనోత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బుధవార్‌పేట్ నంబర్ 1 గణపతి శోభాయాత్ర ర్యాలీని జిల్లా ఎస్పీ శశిధర్‌రాజుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిమజ్జన ఉత్సవాల సందర్భంగా మత్తు పానియాలకు గణేష్ మండప నిర్వాహకులు దూరంగా ఉండాలన్నారు. యువకులు సంయమనం పాటించాలని, ఎలాంటి అల్లర్లకు తావులేకుండా సజావుగా భక్తిశ్రద్ధలతో నిమజ్జన కార్యక్రమాన్ని ఆనందోత్సాహాల మద్య నిర్వహించుకోవాలన్నారు. నిర్మల్ పట్టణం శాంతికి చిహ్నమని, ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు జరగాలన్నారు. ఎలాంటి ఘర్షణలకు తావివ్వవద్దన్నారు. ఎక్కడ ఏ సమస్య ఎదురైనా వెంటనే పోలీసులకు, అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్ అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారని, ఎక్కడైన సమస్య ఎదురైతే వారి దృష్టికి తీసుకురావాలన్నారు. ఆయాశాఖల అధికారులు నిమజ్జన ఉత్సవాలు ముగిసేవరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు అనుక్షణం వెన్నంటి ఉంటారని, వారి సహకారంతో ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో నిర్వహించాలన్నారు. అనంతరం గణేష్ ఉత్సవ సమితి సభ్యులతో కలిసి మంత్రి గణేష్ విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి, మాజీ మున్సిపల్ కో-ఆప్షన్ మెంబర్ అప్పాల మహేష్, గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు గండ్రత్ ఈశ్వర్, ప్రధాన కార్యదర్శి పతికె రాజేంధర్, దేవర కోట ఆలయ ఛైర్మెన్ ఆమెడ కిషన్, సమితి సభ్యులు ఎడిపెల్లి నరేందర్, గండ్రత్ రమేష్, రవి, మురళీ, కపిల్, శశిధర్‌వర్మ, అల్లాడి వెంకటరమణ, పాకాల రాంచందర్, మంచిర్యాల నాగభూషణం, ఆకోజి కిషణ్, మెడిసెమ్మ రాజు, ముడుసు సత్యనారాయణ, మార్గొండ రాము తదితరులు పాల్గొన్నారు.

కడెం వరదగేటు ఎత్తివేత
కడెం, సెప్టెంబర్ 23: జిల్లాలోని కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల మూలంగా వేలాది క్యూసెక్కుల వరదనీరు జలాశయంలోకి వచ్చి చేరుతుండడంతో నీటి మట్టం పెరుగుతూ వస్తుంది. గత రెండు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాల మూలంగా జలాశయంలో వేలాది క్యూసెక్కుల నీరు వచ్చి చేరడంతో ఆదివారం నీటి పారుదల శాఖ అధికారులు అప్రమత్తమై కడెం ప్రాజెక్టుకు చెందిన 11వ నంబర్ వరదగేటు ఎత్తి వేసి గోదావరిలోకి 4 వేల 500 క్యూసెక్కుల నీటి గోదావరిలోకి వదిలారు. కాగా, ప్రస్తుతం ప్రాజెక్టు జలాశయంలో 3200 ఇన్‌ఫ్లో వరదనీరు వచ్చిచేరుతుందని, ప్రస్తుతం నీటిమట్టం 699.500 అడుగులకు ఉందని అధికారులు తెలిపారు. కడెం ప్రాజెక్టు ఆయకట్టు కింద పంటపొలాలకు సరఫరా అవుతున్న సాగునీరు ప్రధాన ఎడమ కాలువకు 922 క్యూసెక్కులు, కుడి కాలువకు 30 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు.