అదిలాబాద్

పత్తి కొనుగోళ్ళకు రంగం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, అక్టోబర్ 11: వర్షాభావం, తెగుళ్ళ బారిన పడి తగ్గిన పత్తి దిగుబడులతో అవస్థలు పడుతున్న అన్నదాతలకు మార్కెట్‌లో పత్తి మద్దతు ధరపై మరింత అందోళన కల్గిస్తోంది. తెలంగాణలోనే అత్యధికంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 5.40లక్షల హెక్టార్లలో పత్తి పంట సాగవుతుండగా ప్రతి ఏటా మార్కెట్‌లో కనీస మద్దతు ధర లభించకా రైతులు ఇబ్బందులు పడుతున్న విషయం విధితమే. మార్కెట్ మాయజాలంలో రైతులు తక్కువ ధరకే పంట ఉత్పత్తులను అమ్ముకొని నష్టపోతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 1.22 లక్షల హెక్టార్లలో పత్తిపంట, 72వేల హెక్టార్లలో సోయా పంటలు సాగవుతున్నాయి. క్వింటాలు పత్తికి కేంద్ర ప్రభుత్వం రూ.5,450 చెల్లిస్తున్నట్లు ప్రకటించగా 12శాతం తేమ మించితే ధర తగ్గిస్తామని ఆంక్షలు విధించడం రైతుల్లో అయోమయం నెలకొంది. ఈనెల 17 నుండి ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్ళు ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని, పత్తి పంటను తేమ లేకుండా ఆరబెట్టి మార్కెట్‌కు తీసుకరావాలని, నిబంధనల మేరకే పత్తికి మద్దతు ధర కల్పిస్తామని ఆదిలాబాద్ మార్కెటింగ్ అధికారి మధుకర్ ఆంధ్రభూమికి తెలిపారు. వ్యాపారుల మాయజాలంతో కొనుగోళ్ళకు ప్రతి ఏటా ఆటంకాలు ఎదురవుతూ మద్దతు ధర లభించకుండా పోతోంది. ఈ ఏడాది ప్రతికులమైన వాతావరణం నెలకొనడంతో పాటు గత ఆగస్టు నెలలో కురిసిన భారీ వర్షాలకు 35శాతంపైనే పత్తిపంట జిల్లాలో దెబ్బతింది. ప్రభుత్వానికి నష్టంపై అంచనా వేసి సర్వే నివేదికలు పంపినా ఇంత వరకు రైతులకు నయా పైసా పరిహారం అందలేదు. పైగా పూత, కాత దశకు ముందే పత్తికి గులాబి తెగులు సోకడంతో మరికొంత నష్టం వాటిళ్లింది. పత్తి ఎకరానికి 8 నుండి 10 క్వింటాళ్ళ దిగుబడి వస్తుందని తొలుత భావించగా 5 నుండి 7 క్వింటాళ్ళ దిగుబడి మాత్రమే వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పత్తి తేమ శాతాన్ని దూదిలో గింజల ప్రమాణికంగా తీసుకొని ధర నిర్ణయించడం ఆనవాయితీగా వస్తోంది. పత్తి ధర నిలకడగా ఉండకపోతే రైతులు మరింత నష్టపోవాల్సి వస్తుంది. ఏ రోజుకు ఆరోజు అంతర్జాతీయ మార్కెట్ బేళ్ళ ధరలను బట్టి మద్దతు ధరను ఖరారు చేస్తారు. పత్తిలో 8 శాతం తేమ ఉంటేనే పూర్తి మద్దతు ధర రూ.5450 ధర చొప్పున కొనుగోలు చేస్తారు. సీసీఐ నిబంధనల ప్రకారం తేమ శాతం ఎక్కువగా ఉంటే ప్రతి ఒక్కశాతానికి ఒక్క కిలో ధర తగ్గించి, అదికూడా 12శాతం తేమలోపు ఉంటే సీసీ ఐ పత్తిని కొనుగోలు చేస్తుంది. అయితే ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్, ఇంద్రవెల్లి, బోథ్, జైనథ్, ఇచ్చోడ, బేలలో పత్తి కొనుగోళ్ళు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. సీసీఐ అధికారులు తేమ శాతం పరిశీలించి కొనుగోలు చేపడితే రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితులు నెలకొన్నాయి. 8నుంచి 12 శాతం తేమ మించితే కొనుగోళ్ళు చేపట్టబోమని సీసీఐ అధికారులు తేల్చిచెబుతున్నారు. గత ఏడాది క్వింటాలు మద్దతు ధర రూ.4320 ఉండగా ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం క్వింటాలు పత్తి ధర రూ.5450 పెంచడం కాస్త రైతుల్లో ఆశలు రేకెత్తించింది. అయితే గత ఏడాదికంటే ఈ ఏడాది క్వింటాలు ధర రూ.1130 పెరిగినా వ్యాపారులు సీసీఐతో ఒప్పందం చేసుకొని కొనుగోలు చేపడితేనే రైతులకు గిట్టుబాటు ధర లభించే అవకాశం ఉంది. సీసీఐ రంగంలో ఉండి వ్యాపారులతో కలిసి పత్తి మార్కెట్ కొనసాగిస్తే రైతులు చివరి వరకు మద్దతు ధర పొందే వీలుకల్గుతుంది. ప్రైవేట్ వ్యాపారులు సిండికేట్‌గా మారకుండా అధికారులు పారదర్శకంగా కొనుగోళ్ళు చేపట్టినట్లయితే రైతులకు లాభం చేకూరే అవకాశం ఉంటుంది.