అదిలాబాద్

కూటమి పొత్తులు కుదిరేనా...?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచిర్యాల, అక్టోబర్ 11: ముందస్తు ఎన్నికలో భాగంగా టీఆర్‌ఎస్ పార్టీని ఓడించేందుకు కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐలు మహా కూటమిగా ఏర్పడ్డారు. ఈ కూటమిలో పొత్తులు కుదిరేనా అనే సందేహాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలలో భాగంగా అన్ని నియోజక వర్గ అభ్యర్థులను ప్రకటించినప్పటికీ మహా కూటమిలో ఇప్పటి వరకు అభ్యర్థుల కేటాయింపు జరుగలేదు. అభ్యర్థుల ఎంపిక ఇప్పటి వరకు ఖరారు కాకపోవడంతో తీవ్ర ఉత్కంఠ పరిస్థితి నెలకొన్నాయి. కాంగ్రెస్ అధిష్టానం కొంతమంది అభ్యర్థిల పేర్లను ప్రకటించినప్పటికీ కూటమి పొత్తు కారణంగా కొన్ని నియోజక వర్గాలలో సర్దుబాట్లు చేయాల్సి ఉంది. మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి నియోజకవర్గాలతోపాటు ఆసిఫాబాద్ జిల్లాలోని, ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాలలో కూడా అభ్యర్థుల పేర్లను ప్రకటించలేదు. అయితే ఇక్కడ మహాకూటమి నుండి ఆశావాహులు తమకంటే తమకు అవకాశం వస్తుందని నియోజకవర్గాలలో విసృత్తస్థాయి ప్రచారాలు నిర్వహిస్తున్నారు. తమకు అవకాశం ఇవ్వనిపక్షంలో అవసరమైతే పార్టీలను వీడి ప్రత్యామ్నాయం చూసుకుంటామని తెగేసి చెప్పడం పార్టీలకు మింగుడు పడటంలేదు. మహాకూటమిలో అభ్యర్థులను సర్దుబాటు చేయడం కూటమి కమిటికి తలనొప్పిగా మారనుంది. ఇందులో భాగంగా మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల, బెల్లంపల్లి సీట్లను సీపీఐ, టీజేఎస్ కోరుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. మహాకూటమిలో బెల్లంపల్లి నియోజకవర్గంలో సీపీఐకి బలమైన క్యాడర్ ఉండటం, గతంలో ఈ నియోజకవర్గంలో పలుమార్లు సీపీఐ గెలుపొందడంతో ఈ నియోజకవర్గాన్ని సీపీఐకి ఇవ్వాలని ఆ పార్టీ పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా కోల్‌బెల్ట్ ప్రాంతంలోని కార్మిక క్షేత్రం అయిన మంచిర్యాల నియోజకవర్గాన్ని కూడా సీపీఐకి కేటాయించాలని ఆ పార్టీ మహాకూటమి కమిటిపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా టీజేఎస్ వ్యవస్థాపకులు ఈ ప్రాంతానికి చెందిన వాడు కావడంతో మంచిర్యాల నియోజకవర్గాన్ని టీజేఎస్‌కు కేటాయించాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికలలో ఎత్తుకుపై ఎత్తులు, వ్యూహా ప్రతి వ్యూహాల మధ్య రాజకీయ పార్టీలలో ఎన్నికల పొత్తులపై చర్చలు కొనసాగుతున్నప్పటికీ అభ్యర్థులను మాత్రం ఖరారు చేయడంలేదు. గత సాధారణ ఎన్నికలలో సిర్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుండి టికెట్ ఆశించి భంగపడ్డ కోనేరు కోనప్ప బీఎస్పీ నుండి పోటీ చేసి గెలుపొందారు. అదే తరుణంలో మంచిర్యాల జిల్లాలోని కాంగ్రెస్ ఆశావహులంతా బీఎస్పీ నుండి పోటీ చేసేందుకు రంగం సిద్ధ చేసుకుంటున్నారు. ఇదే తరుణంలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో మహాకూటమి అభ్యర్థులను ఖరారు చేయకపోవడంతో ప్రజలు ఆశావహులు ఎటు తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. తెరాస అభ్యర్థులు ప్రచార జోరులో ముందు దూసుకెళ్తున్న తరుణంలో మహాకూటమి తరుపున అభ్యర్థులు ఖరారు కానప్పటికీ కాంగ్రెస్ ఆశావహులు తన ప్రచారాన్ని కొనసాగిస్తు ఓటర్లను ఆకర్శించుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఆశావహుల ప్రయత్నం ఏ మేరకు ఫలిస్తుందో వేచి చూడాల్సిందే.

ధ్యానంతోనే మనిషికి ప్రశాంతత
* మంత్రి జోగు రామన్న
ఆదిలాబాద్ మున్సిపాలిటీ, అక్టోబర్ 11: నేటి యాంత్రీక జీవన విధానంలో ఒత్తిడిని అధిగమించేందుకు ప్రతి వ్యక్తికి ధ్యానం ఎంతో అవసరమని, ధ్యానం వల్లనే మానసిక ప్రశాంతత లభిస్తుందని మంత్రి జోగు రామన్న అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సంధర్భంగా ప్రశాంతత కోసం పరమాత్ముని సన్నిదిలో కొంత సేపు ధ్యానం చేశారు. అనంతరం మంత్రి రామన్న మాట్లాడుతూ పరమాత్ముని సన్నిదిలాంటి ఈ బ్రహ్మకుమారి ఆలయంలో ప్రశాంతత నెలకొనే విధంగా ఉంటుందన్నారు. ప్రపంచం ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలంటే ఈశ్వరుని ఆశీస్సులు ఎళ్ళవేళలా ఉండాలన్నారు. కుల మతాలను మనమే సృష్టించుకున్నామని అన్నారు. పరమాత్ముని సన్నిదిలో అందరు సమానులేనని, యాంత్రీక జీవనంలో ప్రతి ఒక్కరికి ప్రశాంతత ఎంతో అవసరమని, దీని కోసం పరమాత్ముని సన్నిదిలో కొంత సమయాన్ని కేటాయించి ధ్యానం చేసినట్లయితే జీవన విధానంలో ప్రశాంతత లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బోథ్ తాజా మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మెన్ ఆరె రాజన్న, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి బోజారెడ్డి, బ్రహ్మకుమారి రేవతి తదితరులు పాల్గొన్నారు.