అదిలాబాద్

రాహుల్ గాంధీ పర్యటనను విజయవంతం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్ మున్సిపాలిటీ, అక్టోబర్ 14: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈనెల 20న తెలంగాణలోనే మొదటి బహిరంగ సభకు వస్తున్న ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటనను విజయవంతం చేయాలని, అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా కాంగ్రెస్ గెలుపుకు కృషి చేస్తామని మైనార్టీ ఎడీసీసీ చైర్మెన్ సాజిద్‌ఖాన్ అన్నారు. ఆదివారం శాంతినగర్‌లోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సాజిద్‌ఖాన్ మాట్లాడారు. మూడు రోజుల క్రితం ఆదిలాబాద్ జిల్లాలోని నేరడిగొండ మండలంలో రాహుల్‌గాంధీ బహిరంగ సభ నిర్వహించేందుకు కాంగ్రెస్ నాయకులు ఏర్పాట్లు చేసినప్పటికీ కేంద్ర ఇంటలీజెన్సి వర్గాలు ఆ ప్రాంతాన్ని అనుమతించనందుకు గాను రాహుల్‌గాంధీ పర్యటనను ఆదిలాబాద్ లేదంటే భైంసా పట్టణంలో ఉండేలా అధిష్ఠానం ఏర్పాట్లపై కసరత్తు చేస్తుందన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాహుల్‌గాంధీ బహిరంగ సభ ఎక్కడ జరిగినా జిల్లాలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. టీఆర్‌ఎస్ సిట్టింగ్ మంత్రుల నుండి ఎమ్మెల్యేల వరకు గ్రామాల్లో పర్యటించే సంధర్భాల్లో ప్రజల నుండి వ్యతిరేకత వస్తుందని గుర్తుచేశారు. మంత్రి జోగురామన్నకు జైనథ్ మండలంలోని సాంగ్వి, భోరజ్ గ్రామాల్లో ప్రజల నుండి వ్యతిరేకత వచ్చిందని, ఏ మోహం పెట్టుకొని ప్రచారం చేస్తున్నారో ప్రజలకు వివరించాలని సూచించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ముస్లీంలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తానని చెప్పి మోసం చేసిందన్నారు. రైతులకు లక్ష రుణమాఫీ, దళిత బస్తీ కింద భూములు ఇస్తామని మోసం చేసిందన్నారు. నాలుగేళ్ళలో ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా సక్రమంగా పూర్తిచేయకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిన ముఖ్యమంత్రి కెసి ఆర్‌కు ఈసారి ప్రజలు బుద్దిచెప్పడం ఖాయమన్నారు. జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ మెనిఫెస్టోను రాహుల్ గాంధీ ఆదిలాబాద్ పర్యటనలో ప్రకటిస్తారన్నారు. రెండు లక్షల రుణమాఫీ, రూ.5లక్షలతో ఇందిరమ్మ ఇండ్లు, 58 సంవత్సరాల వారికి పెన్షన్ సౌకర్యం, కుటుంబానికి ఆరు ఉచిత సిలిండర్ల పంపిణీ, ఒకొక్కరికి ఏడు కిలోల బియ్యం అందజేస్తుందన్నారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు డాక్టర్ దత్తు, మనసూర్, ఖయ్యూం, మనీష్, నర్సింగ్, షకీల్, ఖలీం, కాంబ్లే గురుజీ, శివాజీ, నూర్‌ఖాన్, ఎండి జావిద్ తదితరులు పాల్గొన్నారు.

కేసీఆర్ నాకు అన్యాయం చేయోద్దు
* మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య
కాగజ్‌నగర్, అక్టోబర్ 14: తెలంగాణ ఉద్యమంలో మొదటి నుండి ఉన్న తమను టికేట్ కేటాయించే విషయంలో అన్యాయం చేయవద్దని మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య అన్నారు. ఆదివారం స్థానిక వినయ్ గార్డెన్‌లో ఏర్పాటుచేసిన తెలంగాణ ఉద్యమ కారుల ఆత్మగౌరవ సభ కార్యక్రమంలో తాలుకా నుండి తరలి వచ్చిన తెలంగాణ ఉద్యమకారులు, టీఆర్‌ఎస్ కార్యకర్తలను ఉద్దేశ్యించి సమ్మయ్య మాట్లాడారు. ఉద్యమంలో తాము మొదటి నుండి ఉన్నామని, ఉద్యమ సమయంలో తనపై ఎన్నో కేసులు బణాయించారని అన్నింటికి ఓర్చుకున్నామని, రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనా తాను ఒక్కసారి తెలంగాణ కోసం రాజీనామా సైతం చేశానన్నారు. బీసీలు అయిన తనను కాదని స్థానికేతరుడు అయిన మరొకరికి టికేట్ ఇవ్వడం తనను బాధించిందని తనకు టికేట్ కేటాయించకుంటే ఖచ్చితంగా టిఆర్‌ఎస్ రెబల్ అభ్యర్థిగా పోటీలో ఉంటానన్నారు. టికేట్ ఇవ్వకుండా మోసం చేయవద్దని పేర్కొన్నానని పల్లెపల్లెకు తిరిగి, ఇంటింటికి తిరిగి బిసికి జరిగే అన్యాయాన్ని వివరిస్తానని బిసిలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గంలో బిసిలకే టికెట్ కేటాయించాలని కోరుతున్నామన్నారు. కార్యక్రమంలో తాలుకాలోని వివిధ మండలాలకు చెందిన తెలంగాణ ఉద్యమ కారులు టిఆర్‌ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.