అదిలాబాద్

ఉద్యమ ఆకాంక్షల సాధనే టీజేఎస్ లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచిర్యాల, అక్టోబర్ 14: ఉద్యమ కారుల ఆకాంక్ష సాధనే ధ్యేయంగా తెలంగాణ జనసమితి పనిచేస్తుందని ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఆదివారం మంచిర్యాలకు వచ్చిన సందర్భంగా స్థానిక ఎఫ్‌సీఏ ఫంక్షన్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా వివిధ పార్టీల నుండి టిజేఎస్‌లో చేరిన వారికి పార్టీ కండువాలతో కోదండ రాం స్వాగతం పలికారు. తులా మధుసూధన్ రావు, రేగుంట నారాయణ ల ఆధ్వర్యంలో సుమారు 100 మంది కిపైగా కార్యకర్తలు టి జే ఎస్‌లో చేరారు. అనంతరం కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో అధికారంలోకి వచ్చిన టి ఆర్ ఎస్ పార్టీ ఉద్యమ కారులు ఆకాంక్షలను విస్మరించిందని స్వార్థ పూరిత పాలన సాధించిందన్నారు. ఎందరో ఉద్యమ కారులు ప్రాణత్యాగాలతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని అధికారంలోకి వచ్చిన సి ఎం కేసి ఆర్ నిరంకుశ పాలనతో ప్రజా దోపిడికి పాల్పడుతున్నారని ఆరోపించారు. టి ఆర్ ఎస్ పాలనను అంతమోందించి ప్రజా స్వామిక పాలన పునరుద్దరణే లక్ష్యంగా టి జే ఎస్ కృషి చేస్తుందన్నారు. ప్రజా కూటమి పొత్తులలో ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని త్వరలోనే సీట్ల సర్దుబాటు అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టి జే ఎస్ నాయకులు గురిజాల రవీందర్, పోడేటి సంజీవ్, రాంచందర్ రెడ్డి, రవికుమార్, మనోహార్ భీం రావు, వెంకటేష్, బాబాన్న, జగ్గా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

అమెరికాలో బతుకమ్మ సంబరాలు
నిర్మల్, అక్టోబర్ 14: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో గల గల్లాస్ పట్టణంలో బతుకమ్మ వేడుకలను అక్కడి తెలుగువారు ఘనంగా జరుపుకున్నారు. నిర్మల్‌కు చెందిన గొట్టుముక్కల మనీషారావు, ఆరెపెల్లి శైలజ, వీక్ష, పొట్లూరి సరళలతోపాటు వారి కుటుంబ సభ్యులు, బంధువులు ఈ సంబరాల్లో పాల్గొన్నారు. తెలంగాణ సాంప్రదాయ పండుగైన బతుకమ్మను తెలుగు వారందరితో కలిసి అమెరికాలో కూడా జరుపుకోవడం పట్ల ఆనందంగా ఉందని మనీషారావు ఫోన్ ద్వారా తన అనుభూతిని ఆంధ్రభూమితో పంచుకున్నారు. మన పండుగలను, సాంప్రదాయాలను ఇక్కడి వారు ఎంతో గౌరవిస్తారని ఆమె తెలిపారు.