అదిలాబాద్

మావోయిస్టు పార్టీ కదలికలను ఎప్పటికప్పుడు చేరవేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచిర్యాల, అక్టోబర్ 14: మావోయిస్టు పార్టీ కదలికలను ఎప్పటికప్పుడు పోలీసులకు అందజేయాలని రామగుండంపోలీస్ కమీషనర్ సత్యనారాయణ పేర్కొన్నారు. ఆదివారం రామగుండం కమీషనరేట్ పరిధిలోని మంచిర్యాల జిల్లా జైపూర్ సబ్ డివిజన్ చెన్నూర్ రూరల్ కోటపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాణహిత పరివాహాక ప్రాంతాలలోని గ్రామాలలో మావోయిస్టుప్రభావిత గ్రామాలు అయిన అహేరి, అల్లంపేట, కోటపల్లి మండలంలోని అర్జున గుట్ట, వేంచపల్లి, వేమనపల్లి, గోదుంపల్లి, కళ్లెంపల్లి, గ్రామాలోని ఫెర్రీ పాయింట్స్ ను సందర్శించారు. ఈ సందర్బంగా ఆయనమాట్లాడుతూ గ్రామస్తులతో పడవ నడిపే వారితో మాట్లాడి ప్రస్తుతం పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఫెర్రీ పాయింట్స్‌లలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసి మావోయిస్టుల అలజడిపై నిఘా పెడుతామని తెలిపారు. పోలీస్ అధికారులు ప్రజలతో ఏ విధంగా ఉంటున్నారు అని వారిని అడిగి తెలుసుకున్నారు. గ్రామాలలో ఏమైనా సమస్యలుంటే నేరుగా పోలీసులకు, సంబంధిత అధికారులకు తెలియజేయాలని అన్నారు. ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చూడాలని అన్నారు. సంఘ విద్రోహా శక్తులకు సహాకరించవద్దని డిస్ట్రిక్ గాడ్స్ స్పెషల్ పార్టీస్ గ్రే హౌండ్స్‌ను ఉపయోగించుకోని అరకు లాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. సరిహద్దు ప్రాంతాలలో గ్రే హౌండ్స్ స్పెషల్ పార్టీని పెట్టి అడ్వాన్స్ ఇంటలిజెన్స్ ఇన్‌ఫర్మేషన్ తీసుకోవడం వల్ల మావోయిస్టు సానుభూతి పరుల ఇన్‌ఫార్మేషన్ తీసుకొని వారినిబైండోవర్ చేయాలని అన్నారు. మావోయిస్టుల పేరుతో సామాన్య ప్రజలకు ఎలాంటి వేధింపులు ఉండవని పోలీసులు రెవెన్యూ ప్రజాస్వామ్య యుతంగా ఎలక్షన్ కమీషన్ ఆదేశానుసారం ఎన్నికలు నిర్వహించే బాధ్యత ఉందన్నారు. చెన్నూర్, మంథని, ఏరియాలలో 14 ఫెర్రీ పాయింట్స్ కలవని అన్నింటిలో సిసి కెమెరాలు పెట్టడం జరుగుతుందన్నారు. క్రిమినల్స్ పట్ల పిడి యాక్ట్ , కార్డెన్ సెర్చ్ లు నిర్వహించి వారి పట్ల కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని తెలిపారు. కమీషనరేట్ పరిధిలోని 1500 పోలీంగ్ కేంద్రాలు ఉన్నాయని దానిలో 115 మావోయిస్ట ఎఫెక్ట్ ప్రాంతాలు ఉన్నాయని ప్రతి గ్రామానికి సిసి కెమెరాలు ఏర్పాటు అయ్యేలా ప్రయత్నం చేస్తామని కమీషనరేట్‌లో సమర్థవంతమైన సేవలు నిర్వహిస్తామన్నారు. వేమనపల్లిలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకున్నందుకు ప్రజలను ఆయన అభినందించారు. పోలీసులు ప్రజలలో మమ్మేకం అయి మంచి సంబంధాలు కొనసాగిస్తున్న నీల్వాయి ఎస్సై భూమేష్ ను అభినందిస్తు రూ.10 వేలు రివార్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డిసిపి వేణుగోపాల్ రావు, అడిషనల్ డిసిపి లా అండ్ ఆర్డర్ రవికుమార్, ఏ ఆర్ అడిషనల్ డిసిపి సంజీవ్, ఏ ఆర్ ఏసిపి రామకృష్ణ, మహారాష్ట్ర ఆహేరీ డిసిపి బజ్రంగ్ దేశాయ్, సిరోంచా ఏస్ డిపి రాకేష్‌జాదా, సి ఎస్పీ ఎసిపి రమేష్ బాబు, జైపూర్ ఏసిపి వెంకట్ రెడ్డి, చెన్నూర్ సి ఐ ప్రమోద్ రావు, ఎస్సైలు జగదీశ్, వెంకన్న, భూమేష్, స్పెషల్ పార్టీ క్యాట్ టీం, ప్రత్యేక బలగాలు పాల్గొన్నారు.

4వేల కోట్లతో ఆదిలాబాద్ నియోజకవర్గ అభివృద్ధి
* మంత్రి జోగు రామన్న
ఆదిలాబాద్ మున్సిపాలిటీ, అక్టోబర్ 14: నియోజకవర్గాన్ని నాలుగున్నరేళ్ళ పాలనలో 4వేలకోట్ల నిధులతో అభివృద్ధిపర్చామని, రానున్న ఎన్నికల్లో తిరిగి టీఆర్‌ఎస్‌కు ప్రజలు పట్టంకట్టడం ఖాయమని మంత్రి జోగు రామన్న అన్నారు. ఆదివారం పట్టణంలోని గాంధీనగర్‌లో స్థానిక నాయకుడైనా మహేందర్ నేతృత్వంలో వందమందికి పైగా కాలనీ వాసులు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి రామన్న మాట్లాడుతూ ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజల కోసం తాను శ్రామికుడిగా పనిచేస్తున్నానన్నారు. ఎన్నడులేని విధంగా ఆదిలాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి 4,332 కోట్ల నిధులను తీసుకువచ్చి వివధ అభివృద్ధి చేపట్టడం జరిగిందన్నారు. నాలుగేళ్ళ కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ముందుకు సాగుతున్నామన్నారు. టీఆర్‌ఎస్ మెనిఫెస్టోలో లేని పథకాలను సైతం కేసీఆర్ అన్నివర్గాల ప్రజల సంక్షేమాన్ని కోరుతూ ఫలాలు అందించారన్నారు. దేశంలోనే బిజెపి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి సంక్షేమ పథకాలు పేదల కోసం ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో అమలవుతున్న అనేక పథకాలను ఇతర రాష్ట్రాలకు చెందిన మంత్రులు అభినందిస్తుంటే తెలంగాణకు చెందిన ప్రతిపక్ష పార్టీల నాయకులు కళ్ళుండిచూడలేని ప్రబోదులుగా మారారని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలను దగా చేసిన చంద్రబాబుతో జతకట్టిన మహాకూటమి నేతలకు తగిన బుద్దిచెప్పాలని పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డులను అభివృద్దిపర్చేందుకు ఎన్నడులేని విధంగా కోట్లాది నిధులను వెచ్చించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో డీసీసీ చైర్మెన్ దామోదర్ రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ మనీషా, ఐసిడి ఎస్ ఆర్గనైజర్ కస్తాల ప్రేమల, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అడ్డి బోజారెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు యూనిస్ అక్బాని, సాజిద్‌ఖాన్, సిరాజ్‌ఖాద్రి, ఖయ్యూం, సుఖేందర్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.