అదిలాబాద్

బీజేపీలో 16 మంది న్యాయవాదుల చేరిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, నవంబర్ 15: భారతీయజనతాపార్టీ అభ్యర్థి పాయల శ ంకర్‌కు మద్దతుగా గురువారం సా యంత్రం ఆదిలాబాద్ బార్ అసోసియేషన్‌కు చెందిన 16 మంది న్యాయవాదులు, గుమస్తాసంఘం ప్రతినిధు లు బిజెపిలో చేరారు. శాంతినగర్‌లో ని పార్టీ కార్యాలయంలో జరిగిన కార యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు, అభ్యర్థి పాయల శంకర్, పార్టీ లీగల్ సెల్ జిల్లా కన్వీనర్ చంద్రకాంత్ చౌద రి, జిల్లా కార్యదర్శి, న్యాయవాది ఎన్రా ల నగేష్ సమక్షంలో 16 మంది నా యయవాదులు కమలంపార్టీ తీర్థం పు చ్చుకున్నారు. పార్టీలో చేరినవారిలో న్యాయవాదులు డిఎస్పీ శర్మ, టి.బ్ర హ్మయ్య, కె.రవీందర్, రమన్‌దేశ్‌ము ఖ్, ఆకుల వసంత్, చంద్రమోహన్, సిహెచ్.దేవేందర్, అర్గుల ఆశోక్, జె. అజయ్‌కుమార్, పి.అఖిలేష్, సుదీర్, తావుడే శ్రీనివాస్, మదన్‌సింగ్, ప్రదీప్‌సర్కార్‌లు ఉన్నారు. కోర్టు న్యాయవాదులవద్ద పనిచేసే గుమస్తాల సంఘం అధ్యక్షులు గణేష్‌రెడ్డి, కార్యదర్శి ఊ శన్న, ప్రతినిధులు ఎస్‌కె ఖాదీర్, కిషన్, ప్రభాకర్, సురెందర్, శ్రీకాంత్, ప్రదీప్ తదితరులు బిజెపి పార్టీలో చే రారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, అభ్యర్థి పాయల శంకర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదులు ఎ ంతో కృషిచేశారని, టీఆర్‌ఎస్ ప్రభుత్వ ం రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను పక్కనపెట్టి రాష్ట్రాన్ని అదోగతిగా మార్చేసిందన్నారు. నాలుగున్నరేళ్ళ పాలనలో నియోజకవర్గ అభివృద్ది అడుగంటి పోయిందని, మేధావులు, న్యాయవాదులు అన్ని ఆలోచించి నరేంద్రమోది ప్రభుత్వానికి అండగా నిలువడం అభినందనీయమన్నారు. వారి సలహా సూచనల మేరకే తాను గెలిస్తే అభివృద్దికి పట్టం కట్టి నియోజకవర్గ రూపురేఖలు మారుస్తానన్నారు. పేదల జీవన ప్రమాణాలు పూర్తిగా మెరుగుపరుస్తానని, పనిచేసే నాయకులను ఎన్నుకోవాలని ఆయన కోరారు. భారీఎత్తున న్యాయవాదులు పార్టీలో చేరి తన వి జయానికి మద్దతు పలకడంపట్ల పా యల శంకర్ కృతజ్ఞతలు తెలిపారు. లీగల్ సెల్ కన్వీనర్ చంద్రకాంత్ మా ట్లాడుతూ గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చవిచూసిన బిజెపి ఈసారి అందరి మద్దతుతో ఘన వి జయం సాధించడం ఖాయమని, శం కర్ గెలుపు కోసం తామంతా కృషి చేస్తామన్నారు.

దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు
- జిల్లా జాయింట్ కలెక్టర్ సంధ్యారాణి
ఉట్నూరు, నవంబర్ 15: పంటలు పండించిన రైతులు వాటిని విక్రయించడానికి దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని ఆదిలాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్ సంధ్యారాణి అన్నారు. గురువారం స్థానిక ఎంపిడీవో కార్యాలయ ప్రాంగణ ంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. జెసి మాట్లాడుతూ రైతులను ఆదుకునేందుకే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించిన రైతులకు గిట్టుబా టు ధరలు సైతం చెల్లించడం జరుగుతుందన్నారు. మహిళా సంఘాల అధ్వర్యం లో ఉట్నూరు, దంతన్‌పెల్లి, ఇంద్రవెల్లి, గాధిగూడ తదితర ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మొదటిరకం ధాన్యానికి క్వింటాలుకు రూ. 1770, రెండో రకానికి రూ. 1750 మద్దతు ధర చెల్లించడం జరుగుతుందనా నరు. ధాన్యం విక్రయించడానికి వచ్చే రైతులు ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతా, వి ఆర్‌ఏ ధృవీకరణ పత్రాలు తీసుకొనిరావాలన్నారు. అనంతరం ధాన్యాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి సుదర్శన్, డిప్యూటీ తహసీల్దార్ ప్రహ్లాద్, గిరిదవార్ భీర్షా, ఐకెపి ఏపిఎం అనిల్, మహిళా సంఘాల ప్రతినిధులు సరస్వతి, రాణి, నాగమ్మ, రాజవ్వ, లక్ష్మి, కళావతి తదితరులు పాల్గొన్నారు.