అదిలాబాద్

అల్లోలకు బ్రహ్మరథం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్, నవంబర్ 15: సారంగాపూర్ మండలంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి గురువారం పలు గ్రా మాల్లో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మండలంలోని పొట్యా, బండిరేవుతాండ, సిర్పల్లి, దుబ్యతాండ, ఆదివాసిగూడ, అందల్‌వాయితాండ, లక్ష్మీనగర్ తండా, రాంసింగ్ తాండ, కుప్టితాండ, కుప్టి, పెండల్‌దరి, ఇప్పచెల్మ, లింగాపూర్‌తాండ, లింగాపూర్, తదితర గ్రామాల్లో అల్లోల ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో మంత్రికి డప్పు చప్పుళ్లతో గ్రామస్థులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు అమలుజరుగుతున్నాయన్నారు. 60 ఏళ్ల చరిత్రలో ఎప్పుడూలేనివిధంగా తండాలను గ్రామపంచాయతీలుగా చేసిన ఘనత సి ఎం కేసీ ఆర్‌కే దక్కిందన్నారు. దీంతో గిరిజన తండాలు, గూడాలు, త్వరితగతిన అభివృద్ది చెందే అవకాశం ఉందన్నారు. తండాల అభివృద్దికి నిధు లు ఎక్కువ వస్తాయన్నారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌తోపాటు రాష్ట్రం లో 35 లక్షల మంది రైతులకు భీమా చేసిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. రాష్ట్రం మరింత అభివృద్ది చెందాలంటే టీఆర్‌ఎస్ ప్రభుత్వమే తిరిగి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ది చెందుతుందని, వచ్చే ఎన్నికల్లో వందకుపైగా ఎమ్మెల్యే సీట్లను గెలుపొంది కేసీ ఆర్ ముఖ్యమంత్రి పీఠం అధిష్టిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు వెంకట్‌రాంరెడ్డి, పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, అల్లోల మురళీధర్‌రెడ్డి, డాక్టర్ మల్లికార్జున్‌రెడ్డి, సారంగాపూర్ మార్కెట్ చైర్మెన్ రాజ్ మహ్మద్, అడెల్లి చైర్మెన్ శ్రీనివాస్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
టీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతున్నా...
తాను కాంగ్రెస్‌పార్టీలో చేరలేదని, టీఆర్‌ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నానని లక్ష్మణచాంద మండలంలోని కనకాపూర్ మాజీ గ్రామ సర్పంచ్ సుంకు ముత్తన్న తెలిపారు. తమను మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి బలవంతంగా కాంగ్రెస్ కండువాకప్పి పార్టీలో చేరినట్లు ప్రకటించారని తెలిపారు. ఈమేరకు ఆయన గురువారం మంత్రి అల్లోలను కలిసి టీ ఆర్ ఎస్‌లోనే కొనసాగుతానని స్పష్టంచేశారు. ఆయనవెంట కనకాపూర్ సర్పంచ్ మేకల రాజేంధర్ యాదవ్, తదితరులు ఉన్నారు.