క్రైమ్/లీగల్

వీడిన మొగలి అస్థిపంజరం మిస్టరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముధోల్, నవంబర్ 15: తానూర్ మండలంలోని మొగలి గ్రామంలో గత ఐదురోజుల క్రితం లభించిన ఆస్థిపంజరం మిస్టరీ వీడిందని భైంసా డీ ఎస్పీ రాజేశ్‌బల్లా అన్నారు. గురువా రం నియోజకవర్గ కేంద్రంలోని సర్కి ల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఈనెల 10న తానూర్ మండలంలోని మొగలి గ్రామంలోని శివారులో రేశమ్యా పొలం ఒడ్డున మానవునికి సంబంధించిన బొక్కల ను పశువుల కాపరి అయిన ముత్తన్న కు కనిపించాయన్నారు. ముత్తన్న స్థానిక వీఆర్‌వోకు సమాచారం అం దించడంతో తానూర్ పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. వ్య క్తి అనుమానస్పదంగా మరణించిన ట్లు కేసు నమోదుచేసి దర్యాప్తు చేశామన్నారు. మృతుడు మహరాష్టల్రోని నాంధేడ్ జిల్లాలోని బిలోలి తాలుకాలోని కుమ్మర్ గావ్ గ్రామానికి చెందిన సంగెన్‌వార్ సంతోష్ (35)గా గుర్తించినట్లు పేర్కొన్నారు. మృతుడికి మొగలి గ్రామానికి చెందిన రుక్మిణితో గత పది సంవత్సరాల క్రితం వివాహమైందని అన్నారు. గత కొన్ని నెలల నుండి అత్తగారి ఇంటి వద్దనే నివాసం ఉంటున్నారని వివరించారు. మండలంలోని మసల్గతండాకు చెందిన జాదవ్ కైలా స్, జాదవ్ రాందాస్‌వద్ద కూలీ పనుల కోసం రావడంలో వారు పనిలో పెట్టుకున్నారని తెలిపారు. మృతుడు కూలీ ఆవును మేపుతుండగా దాహం వేయడంతో సమీపంలో బావిలోకి నీళ్లు తాగివస్తానని యజమానికి చెప్పినట్లు పేర్కొన్నారు. బావికి ప్రహరిగోడ లేకపోవడంతో ప్రమాదవశాత్తు బావిలోకి జారిపడినట్లు తెలిపారు. విషయం గమనించిన కేలాస్‌జాదవ్ తనతండ్రి తో చెప్పడంతో గ్రామంతోపాటు పోలీసులకు తెలిస్తే నష్టం జరుగుతుందని, కేసు నమోదు అవుతుందని భావించారన్నారు. బావికి ప్రహరి లేకపోవడ ంతో తమకు ఇబ్బందులు తప్పవని ఎ లాగేన సాక్షాన్ని కప్పిపుచ్చడానికి మృతదేహన్ని బయటకు తీసి గోనె సంచిలో కట్టి మసల్గతండాలోని చెరువులో పడివేశారన్నారు. తరువాతి రోజు చెరువులో వేసిన శవాన్ని చూ డగా నీళ్లు తగ్గి దాదాపు మూడు నెల లు శవం నీటిలో ఉందని, శవానికి క్రి ములు కిటకాలు తిన్నందున బొక్కలు మాత్రమే కనిపించాయని తెలిపారు. బొక్కలను ఎవరైన చూస్తే ఇబ్బందులు తప్పవని ఒక సంచిలో వేసి మొగలి శివారులోని రేశమ్యా పొలం సమీపంలో గుంతను తవ్వి పూడ్చినట్లు వెల్లడించారు. మృతునికి చెందిన దారాలతో పాటు ఎలాస్టిక్ పట్టి బయట పడడంతో పాటు మూడు నెలల నుండి కనిపించక పోవడంతో పాటు కొన్ని రోజుల పాటు కైలాస్ జాదవ్, జాదవ్ రాందాస్ వద్ద పని చేసాడని మృతుని భార్య అనుమానం వ్యక్తం చేసిందని అన్నారు. దీంతో తండ్రి కొడకు కేసు నమోదు కావడంలో పారిపోయినట్లు తెలిపారు. ముధోల్ సీ ఐ శ్రీనివాస్ నిందుతులను ఆరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు. ఈ విలేఖరుల సమావేశంలో ముధోల్ సీ ఐ శ్రీనివాస్, తానూర్ ఎస్సై, తదితరులు పాల్గొన్నారు.