అదిలాబాద్

కోర్టుకు హాజరైన మంత్రి రామన్న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, మే3: 2014 అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెడుతూ డబ్బులు పంపిణీ చేశారన్న అభియోగాలపై అప్పటి టీఆర్‌ఎస్ అభ్యర్థి, మంత్రి జోగురామన్న మంగళవారం కోర్టు విచారణలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా సెషన్‌కోర్టుకు హాజరయ్యారు. 2014 అసెంబ్లీ ఎన్నికల సంధర్భంగా ఆదిలాబాద్ పట్టణంలోని తన నివాస గృహం ఎదుట అనుచరులు రూ.3లక్షల డబ్బులను పంపిణీ చేస్తున్నట్లు ప్రత్యర్థి పార్టీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎన్నికల కమిషన్ కేసు నమోదు చేసింది. అంతేగాక స్థానిక లోకల్ సిటికేబుల్‌లో ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించి, ప్రచార గడవు ముగిసిన తర్వాత ఓటర్లకు హామీలు గుప్పించి ప్రత్యర్థిపార్టీ నాయకులపై విమర్శలు చేయడంపై కూడా కేసు నమోదైంది. ఎన్నికల వ్యవహారాల అభియోగాలు, రాజకీయ పార్టీల నేతలపై కేసులను జిల్లా సెషన్‌కోర్టు ద్వారా విచారణ చేపట్టాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఈమేరకు మంగళవారం ఉదయం 10 గంటలకు మంత్రి రామన్న తన అనుచరులతో కలిసి జిల్లా కోర్టుకు హాజరయ్యారు. కేసు తదుపరి విచారణను జూన్ 7వ తేదీకి వాయిదావేస్తున్నట్లు జిల్లా సెషన్ జడ్జి ఉదయగౌరి వెల్లడించారు. ఇదిలా ఉంటే ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులో సోమవారం ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ కూడా జిల్లాకోర్టుకు హాజరై వెళ్లడం గమనార్హం.