అదిలాబాద్

మంచిర్యాల జిల్లాలో గులాబీ మయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచిర్యాల, డిసెంబర్ 11: శాసన సభ నియోజక వర్గంలో వెలువడిన ఎన్నికల ఫలితాల్లో మంచిర్యాల జిల్లా అంతా గులాబీమయం అయింది. మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి నియోజకవర్గంలో టిఆర్‌ఎస్ జెండా ఎగుర వేశారు. చెన్నూర్ నియోజకవర్గంలో టిఆర్‌ఎస్ అభ్యర్థి బాల్క సుమన్‌కు 71980 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి బొర్లకుంట వెంకటేష్ నేతకు 43848 ఓట్లు రాగా, 28032 ఓట్ల మేజార్టీతో బాల్క సుమన్ గెలుపొందారు. మంచిర్యాల నియోజక వర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి దివాకర్ రావుకు 75,360 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి కొక్కిరాల ప్రేమ్ సాగర్‌రావుకు 70,512 ఓట్లు పోలవడంతో 4848 ఓట్ల మెజార్టీతో దివాకర్ రావు గెలుపొందారు. మొదటి నుండి దివాకర్ రావు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుల మధ్య ఉత్కంఠ పోరు కొనసాగింది. మొదటగా కాంగ్రెస్ అభ్యర్థి ప్రేమ్ సాగర్ రావు అధిక్యతతో ఉన్నప్పటికీ 7వ రౌండ్ నుండి దివాకర్ రావు అధిక్యత కొనసాగుతూ వచ్చింది. బెల్లంపల్లి నియోజక వర్గంలో టి ఆర్ ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్య 50325 ఓట్లు రాగా, బీ ఎస్పీ అభ్యర్థి గడ్డం వినోద్‌కు 40218 ఓట్లు పోలు కాగా, 11107 ఓట్ల మేజార్టీతో దుర్గం చిన్నయ్య గెలుపోందారు. మొదటి నుండి చిన్నయ్య అధిక్యతతోనే కొనసాగితూ వచ్చి విజయ కేతనం ఎగుర వేశారు.
ప్రజల ఆశయాన్ని ఒమ్ము చేయను... దుర్గం చిన్నయ్య
ఈ ఎన్నికలలో ప్రజలు ఆదరించి గెలిపించారని వారి ఆశయాన్ని ఒమ్ము చేయకుండా నియోజక వర్గ అభివృద్దికి కృషి చేస్తానని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసి ఆర్ చేపట్టిన అభివృద్ది పథకాలతోనే నియోజక వర్గాలలో చేసిన అభివృద్దితోనే గెలుపోందామని అన్నారు. ప్రజలు ఆశీర్వాదించి గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
నియోజక వర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చి దిద్దుతా.. బాల్క సుమన్...
ఎన్నికల ప్రచారంలో చెన్నూర్ నియోజక వర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను నేరవేరుస్తు నియోజక వర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చి దిద్దుతానని అన్నారు. చెన్నూర్ నియోజక వర్గ ప్రజలంతా ఆదరించి అధిక మేజార్టీతో గెలిపించారని వారి నమ్మకాన్ని నిలబెట్టే విధంగా సిరిసిల్ల, సిద్దిపేట లాగా అభివృద్ది చేస్తానని అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల ప్రాంతాన్ని విస్మరించారని ఈ పాలనలో మంచిర్యాల జిల్లా అభివృద్దికి కృషి చేస్తానని తెలిపారు.
కేసి ఆర్ పథకాలే గెలిపించాయి.. దివాకర్‌రావు...
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసి ఆర్ గత ప్రభుత్వ పాలనలో చేపట్టిన అభివృద్ది సంక్షేమ పథకాలే ఈ ఎన్నికలలో గెలిపించాయని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు అన్నారు. ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాలలోకి ప్రవేశించానని 15 ఏళ్లుగా ప్రజలకు సేవ చేస్తున్నానని సేవను గుర్తించి ఈ ఎన్నికలలో నియోజక వర్గ ప్రజలంతా ఎన్నుకున్నారని అన్నారు. ప్రజలందరి సహాకారంతోనే గెలుపోందానని చట్టాలను చుట్టాలుగా మార్చుకోకుండా ప్రజా పాలనను అందించే విధంగా కృషి చేస్తానని తెలిపారు. నియోజక వర్గ ప్రజలంతా భూ కబ్జా దారులను, రౌడీలను ఎన్నుకోకుండా మంచి పాలన అందించే నాయకుడిని ఎన్నుకున్నందుకు వారికి రుణ పడి ఉంటానని అన్నారు.

ఉత్కంఠగా మంచిర్యాల ఎన్నికల కౌంటింగ్
* కాంగ్రెస్, టీఆర్‌ఎస్ మధ్య హోరాహోరీ పోరు * టీఆర్‌ఎస్ అభ్యర్థి దివాకర్ రావు గెలుపు
మంచిర్యాల, డిసెంబర్ 11: మంచిర్యాల నియోజకవర్గ ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ మధ్య పోరు ఉత్కంఠగా కొనసాగింది. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ అభ్యర్థుల మధ్య మొదటి నుండి లెక్కింపులో హోరాహరీగానే కొనసాగింది. మొదటగా కాంగ్రెస్ అభ్యర్థి ప్రేమ్ సాగర్ రావు 301 అధిక్యతతో ఉండగా, 7వ రౌండ్ వచ్చే సరికి 124 అధిక్యతతో ఉన్నప్పటికీ 8వ రౌండ్‌లో టి ఆర్ ఎస్ అభ్యర్థి దివాకర్ రావు 230 అధిక్యతతో ఉండగా, 20వరౌండ్ వరకు 4662 ఓట్ల మేజార్టీతో గెలుపోందారు. కాంగ్రెస్ అభ్యర్థి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుకు 68340 ఓట్లు పోలు కాగా, దివాకర్ రావుకు 73002 ఓట్లు పోలవడంతో 4662 ఓట్ల మేజార్టీతో విజయం సాధించారు. ఇద్దరి మధ్య ఉత్కంఠ పోరు కొనసాగినప్పటికీ కాంగ్రెస్, టి ఆర్ ఎస్ కార్యకర్తలు ఆయా పార్టీల గెలుపుకోసం ఉత్కంఠగా ఎదురుచూసినప్పటికీ కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు నిరాశే మిగిలింది. మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేసిన ఆ నాయకులు ప్రజలు ఇచ్చిన తీర్పుతో కౌంటింగ్ కేంద్రం నుండి వెనుదిరిగి వెళ్లి పోయ్యారు. టి ఆర్ ఎస్ అభ్యర్ధి దివాకర్ రావు, నాయకులంతా మొదట గా అధిక్యతలో ఉన్న కాంగ్రెస్‌ను చూసి గెలుస్తుందేమోనన్న తపనతో ఉన్నప్పటికీ హాజీపూర్ మండలంలోని పోలీంగ్ కేంద్రాలలో ప్రజలు టి ఆర్ ఎస్ పార్టీకి అధిక్యం పెంచగా వారిలో ఉత్సహాం నెలకొంది. చివరి వరకు టి ఆర్ ఎస్ పార్టీ అభ్యిర్థి దివాకర్ రావుకు అధిక్యం తగ్గక పోవడంతో 15వ రౌండ్‌లోనే విజయం సాధించామని టి ఆర్ ఎస్ కార్యకర్తలు బాణా సంచాలు పేలుస్తు సంబరాలు జరుపుకున్నారు. 3 వేల పైచిలుకు అధిక్యత 18వ రౌండ్‌లో కొనసాగగా, దివాకర్ రావు విజయం నాదే అంటూ విజయ పతాకాన్ని ఎగుర వేశారు. చివరి వరకు టి ఆర్ ఎస్సే అధిక్యత కొనసాగింది. మంచిర్యాల నియోజక వర్గం ఎన్నికల ఫలితాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ భరితంగానే చూశారు. మొదటి నుండి ఫలితాలను బయటకు వెలువడక పోవడంతో టివిల ముందు కూర్చోన్ని ఉన్న వారంతా ఎదురు చూస్తునే ఉన్నారు. చివరి వరకు ఎవరు గెలుస్తారో అనేదే ప్రతి ఒక్కరిలో ఉన్నప్పటికీ టి ఆర్ ఎస్ గెలవడంతో కార్యకర్తలలో ఉత్సహాం నెలకొని సంబరాలలో మునిగి తేలారు.
ఫలితాల వివరాలు....
మంచిర్యాల నియోజక వర్గంలో మంగళవారం ఉదయం నుండి ప్రారంభం అయిన కౌంటింగ్ కేంద్రాలలోని ఫలితాలు వివరాలు ఇలా ఉన్నాయి...
మొదటి రౌండ్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుకు 3761 ఓట్లు పోలు కాగా , టి ఆర్ ఎస్ అభ్యర్ధి దివాకర్ రావుకు 3461 ఓట్లు పోలవడంతో 301 ఓట్ల అధిక్యతతో కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నారు. 2వ రౌండ్‌లో కాంగ్రెస్ 3381, టి ఆర్ ఎస్ 3084 ఓట్లు రాగా, కాంగ్రెస్ 297 అధిక్యతతో ఉంది. 3వ రౌండ్‌లో కాంగ్రెస్ 4147, టి ఆర్ ఎస్‌కు 4017 ఓట్లు రాగా, 726 అధిక్యతతో కాంగ్రెస్ ఉంది. 4వ రౌండ్‌లో కాంగ్రెస్‌కు 4703, టి ఆర్ ఎస్‌కు 4805 ఓట్లు రాగా, ఈ రౌండ్‌లో టి ఆర్ ఎస్‌కు 100 ఓట్లు ఎక్కువగా వచ్చినప్పటికీ 624 అధిక్యతతో కాంగ్రెస్ ముందంజాలో ఉంది. 5వ రౌండ్‌లో కాంగ్రెస్‌కు 4297 రాగా, టి ఆర్ ఎస్‌కు 4031 ఓట్లు రావడంతో 890 అధిక్యతతో కాంగ్రెస్ పార్టీ అధిక్యంలో ఉంది. 6వ రౌండ్‌లో కాంగ్రెస్‌కు 3719 ఓట్లు రాగా, టి ఆర్ ఎస్‌కు 3871 వచ్చినప్పటికీ ఈ రౌండ్‌లో టి ఆర్ ఎస్ 152 ఓట్లు టి ఆర్ ఎస్‌కు వచ్చినప్పటికీ 738 ఓట్ల అధిక్యంతో కాంగ్రెస్ ముందంజాలో ఉంది. 7వ రౌండ్‌లో కాంగ్రెస్‌కు 3420 ఓట్లు రాగా, టి ఆర్ ఎస్‌కు 4034 ఓట్లు వచ్చినప్పటికీ టి ఆర్ ఎస్ ఈరౌండ్ లో 614 అధిక్యత టి ఆర్ ఎస్‌కు వచ్చిన్నప్పటికీ 124 ఓట్ల అధిక్యతతో కాంగ్రెస్ ముందంజాలో కొనసాగింది. 8వ రౌండ్‌లోకాంగ్రెస్‌కు 4062 ఓట్లు , టి ఆర్ ఎస్‌కు 4416 ఓట్లు రాగా టి ఆర్ ఎస్ కు 230 అధిక్యంలోకి వచ్చింది. 9వ రౌండ్‌లో కాంగ్రెస్‌కు 3163 ఓట్లు రాగా, టి ఆర్ ఎస్‌కు 4156 ఓట్లు వచ్చిన్నప్పటికీ 1223 అధిక్యతతో ముందంజాలో ఉన్నారు. 10వ రౌండ్‌లో కాంగ్రెస్‌కు 3553, టి ఆర్ ఎస్‌కు 3510 ఓట్లు వచ్చిన్నప్పటికీ కాంగ్రెస్ 43 ఓట్లు అధికంగా ఉండగా, టి ఆర్ ఎస్ 1180 ఓట్ల అధిక్యతతో ఉన్నారు. 11వ రౌండ్‌లో కాంగ్రెస్‌కు 3466, టి ఆర్ ఎస్ కు 3284 ఓట్లు రాగా, టి ఆర్ ఎస్ 998 ఓట్ల అధిక్యతతో ఉన్నారు. 12 వ రౌండ్‌లో కాంగ్రెస్ 3575, టి ఆర్ ఎస్‌కు 4262 ఓట్లు రాగా 1685 ఓట్ల అధిక్యతతో కొనసాగుతున్నారు. 13వ రౌండ్‌లో కాంగ్రెస్‌కు 3911 ఓట్లు రాగా, టి ఆర్ ఎస్‌కు 3912 ఓట్లు పోలైనప్పటికీ 1686 ఓట్ల అధిక్యతతో ఉన్నారు. 14వ రౌండ్‌లోకాంగ్రెస్‌కు 4487, టి ఆర్ ఎస్‌కు 4883 ఓట్లు రాగా టి ఆర్ ఎస్ 2082 ఓట్ల అధిక్యతతో ఉన్నారు. 15వ రౌండ్‌లో కాంగ్రెస్‌కు 3667, టి ఆర్ ఎస్‌కు 3614 వచ్చిన్నప్పటికీ టి ఆర్ ఎస్సే 2029 ఓట్లతో ముందుండగా , 16వ రౌండ్‌లో కాంగ్రెస్‌కు 2728, టి ఆర్ ఎస్‌కు 3198 ఓట్లు రాగా, 2499 ఓట్ల అధిక్యంలో ముందున్నారు. 17వ రౌండ్‌లో కాంగ్రెస్‌కు 2600, టి ఆర్ ఎస్‌కు 3179 ఓట్లు రాగా 3078 ఓట్ల అధిక్యతతో ఉన్నారు. 18 వ రౌండ్‌లో కాంగ్రెస్‌కు 3061, టి ఆర్ ఎస్‌కు 3664 ఓట్లు రాగా 3681 ఓట్ల అధిక్యతతో కొనసాగారు. 19వ రౌండ్‌లో కాంగ్రెస్‌కు 2639, టి ఆర్ ఎస్‌కు 3620 ఓట్లు రాగా టి ఆర్ ఎస్ 4662 ఓట్ల మేజార్టీతో ముందున్నారు. 20వ రౌండ్‌లో కాంగ్రెస్‌కు 1349, టి ఆర్ ఎస్‌కు 1783 ఓట్లు రాగా, 5906 ఓట్లు వచ్చాయి. పోస్టల్ బ్యాలెట్‌లో కాంగ్రెస్‌కు అధిక్యత ఉన్నప్పటికీ టి ఆర్ ఎస్ అభ్యర్ధి దివాకర్ రావు 4662 ఓట్ల మేజార్టీతో గెలుపోందారు. 8 వ రౌండ్ నుండి అధిక్యతతో ఉన్న టి ఆర్ ఎస్ చివరి వరకు అధిక్యత పెరుగుతూ రావడంతో విజయ ఢంకా మోగించారు.

ఉత్కంఠ రేపిన బోథ్ ఫలితాలు
*రెండోసారి టీఆర్‌ఎస్ అభ్యర్థి రాథోడ్ బాపురావు విజయం
ఇచ్చోడ, డిసెంబర్ 11: బోథ్ అసెంబ్లీ ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి రాథోడ్ బాపురావు 6,796 ఓట్ల ఆధిక్యతతో విజయకేతనం ఎగరవేశారు. చివరి రౌండ్ వరకు ఉత్కంఠను రేపిన ఫలితాల్లో తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి సోయం బాపురావుపై విజయం సాధించడంతో తెరాస శ్రేణుల్లో సంబరాలు మిన్నంటాయి. మొదటి రౌండు నుండి స్వల్ప ఆధిక్యతతో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి రాథోడ్ బాపురావు కొనసాగగా చివరి రౌండ్ వరకు కూడా అదే ఆధిక్యతను కనబర్చి రెండోసారి విజయదుందుబిని మోగించారు. బోథ్ నియోజకవర్గం నుండి మొత్తం 7 మంది అభ్యర్థులు పోటీచేయగా నియోజకవర్గంలో మొత్తం 1,82,997 ఓట్లకు గాను 1,56,073 ఓట్లు నమోదయ్యాయి. ఇందులో టీఆర్‌ఎస్ అభ్యర్థి రాథోడ్ బాపురావుకు 61,125 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సోయం బాపురావుకు 54,639 ఓట్లు పడగా కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థి అనిల్ జాదవ్ 28,206 ఓట్లు సాధించారు. అదే విధంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మడావి రాజు 5,041 ఓట్లు, బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి ఆడె గజానంద్‌కు 2,650 ఓట్లు, నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుమురం కోటేశ్వర్‌కు 1,915 ఓట్లు పోలయ్యాయి. కాగా నోటాకు 2,271, పోస్టల్ బ్యాలెట్ ద్వారా 4 ఓట్లు పోలుకావడం గమనార్హం. అయితే ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా, తొలి రౌండ్‌లో టీఆర్‌ఎస్ ఆధిక్యత కనబర్చగా మరో రెండు రౌండ్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఆధిక్యతను తెచ్చిపెట్టింది. ఆ తర్వాత 10వ రౌండ్ వరకు టీఆర్‌ఎస్ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు పోలుకాగా 11 నుండి 15వ రౌండ్ వరకు కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థి అనిల్ జాదవ్ తన ఆధిక్యతను చాటారు. అనంతరం స్వల్ప మెజార్టీతో మిగితా రౌండ్లలో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థికి ఆధిక్యత లభించగా గెలుపు ఎవరిని వరిస్తుందోనన్న ఆసక్తి క్షణం క్షణం ఇరు పార్టీల కార్యకర్తల్లో ఉత్కంఠతను రేపింది. మిగితా రౌండ్లలో స్వల్ప మెజార్టీతో టీఆర్‌ఎస్ అభ్యర్థి గట్టెక్కడంతో మొత్తం 20 రౌండ్లను కలుపుకొని 6,796 ఓట్ల ఆధిక్యతతో రాథోడ్ బాపురావు విజయాన్ని కైవసం చేసుకున్నారు.