అదిలాబాద్

ఆసిఫాబాబాద్ ‘హస్త’గతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆసిఫాబాద్, డిసెంబర్ 11: ఆసిఫాబాద్ నియోజక వర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సక్కు విజయం సాధించాడు. చివరి రౌండ్ వరకు హోరాహోరీగా సాగిన ఓట్ల లెక్కింపులో సమీప టిఆర్‌ఎస్ అభ్యర్థి తాజామాజీ ఎమ్మెల్యే కోవలక్ష్మిపై కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సక్కు ఘన విజయం సాధించాడు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాల్లో తొమ్మిదింటిని అధికార టిఆర్‌ఎస్ పార్టీ తిరిగి చేజిక్కించుకోగా, నాటకీయ పరిణామాల మధ్య గిరిజన నియోజక వర్గమైన ఆసిఫాబాద్ స్థానాన్ని ఆత్రం సక్కు కైవసం చేసుకున్నాడు. ఈనెల 7వ తేదీన జరిగిన ఎన్నికలో 1,60,116 ఓట్లు పోల్ అయ్యాయి. ఈ ఓట్లలో కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సక్కుకు 65788 ఓట్లు రాగా, సమీప ప్రత్యర్థి తెరాస అభ్యర్థైన కోవలక్ష్మికి 65,617 ఓట్లు వచ్చాయి. అదే విధంగా బిఎస్‌పి అభ్యర్థి అజ్మీరారామ్ నాయక్‌కు 3628, బిజెపి అభ్యర్థి ఆత్మారామ్ నాయక్‌కు 6711, భారతీయ బహుజన్ క్రాంతి దళ్ అభ్యర్థి ఆదెబాలాజీకి 3039, నవ ప్రజారాజ్యం పార్టీ అభ్యర్ధి కుర్సెంగ వసంత్‌రావుకు 1721, టిజెఎస్ అభ్యర్థి కోట్నాక విజయ్‌కు 6183, బహుజన్ రాజ్యం పార్టీ అభ్యర్థి భానోత్ జగన్‌కు 1240, అంబేద్కర్ రైట్ పార్టీ అభ్యర్థి ముకాడె విష్ణు 2972, ఇండిపెండెంట్ అభ్యర్థి బూక్యా ఇందల్ రావు 1175 ఓట్లు సాధించారు. అదే విధంగా 2715 ఓట్లు నోటాకు పోల్ అయ్యాయి.
చివరి వరకు హైడ్రామా
* ‘రీ’ కౌంటింగ్‌కు తెరాస అభ్యర్థి డిమాండ్ * ఎన్నికల ఫలితం వెల్లడించడంలో జాప్యం..
ఆసిఫాబాద్ శాసన సభ ఎన్నికల ఫలితం వెల్లడించడంలో చివరి వరకు హైడ్రామా కొనసాగింది. ఉదయం 8 గంటలకు స్థానిక సాంఘీక సంక్షేమ గురుకుల కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో ఆసిఫాబాద్, సిర్పూర్ కాగజ్‌నగర్ ఎన్నికల ఓట్ల లెక్కింపుప్రారంభమైంది. తొలి రౌండ్ నుండే సిర్పూర్ అభ్యర్ధి కోనేరు కోనప్ప ప్రత్యర్థులకు అందకుండా ప్రతి రౌండ్లో భారీ మెజారిటీ సాధిస్తూ వచ్చాడు. ఆసిఫాబాద్ నియోజక వర్గ ఎన్నికల ఫలితాలు మాత్రం చివరి వరకు ఉత్కంఠంగా సాగాయి. మొదటి ఏడు రౌండ్లు పూర్తయ్యే సరికి తెరాస అభ్యర్థి కోవలక్ష్మి 4894 ఓట్ల ఆధిక్యంలో కొనసాగింది. ఆ తరువాత అనూహ్యంగా పుంజుకున్న ఆత్రం సక్కు 9 రౌండు చేరే సరికి 409 ఓట్ల ఆధిక్యానికి చేరుకున్నారు. ఆ తరువాత ప్రతి రౌండ్లో తెరాస, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య పోరు నువ్వా, నేనా అన్నట్లు సాగింది. ఈపరిస్థితుల్లో చివరి వరకు ఎవరు గెలుస్తారో చెప్పకుండా మారింది. అయితే ఆఖరు రౌండు పూర్తయ్యే సరికి కాంగ్రెస్ అభ్యర్థి సక్కు 171 ఓట్ల ఆధిక్యం కనబరిచారు. సక్కు గెలిచాడని భావిస్తున్న తరుణంలో నిబంధనల మేరకు 214 బూత్‌ను ఐచ్చికంగా ఎంపిక చేసుకొని వివి ప్యాట్‌లో ఉన్న చీటీలను లెక్కించారు. ఇవి ఎంలో పోలైన వాటికి వివి ప్యాట్‌లో ఉన్న ఓట్లలో 11 తేడా రావడంతో తెరాస అభ్యర్ధి నాయకులు రీ కౌటింగ్‌కు డిమాండ్ చేశారు. దీంతో జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, ఎన్నికల పరిశీలకురాలు కృష్ణగోహెన్ రాష్ట్ర ఎన్నికల అధికారికి ఈవిషయాన్ని తెలిపారు. దీంతో రెండు గంటల పాటు ఫలితం వెల్లడి కావడంలో జాప్యం చోటు చేసుకొంది. చివరకు 214 బూత్‌లోని చీటీలను లెక్కించిన తరువాత ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు ఆత్రం సక్కు విజయం సాధించినట్లు రిటర్నింగ్ అధికారి సిడాం దత్తు ప్రకటించారు. ఈరెండు గంటల పాటు లోన ఏమి జరిగింది తెలియక పోవడంతో కాంగ్రెస్, టిఆర్‌ఎస్ అభిమానుల్లో టెన్షన్ వాతావరణం కనిపించింది.

ఈవీఎంలపై తీవ్ర స్థాయిలో అవకతవకలు జరిగాయి
* సీపీఐ అభ్యర్థి గుండా మల్లేష్
బెల్లంపల్లి, డిసెంబర్ 11: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో మంగళవారం జరిగిన ఎన్నికల కౌంటింగ్ లో ఈ వీ ఎం యంత్రాలు , వీవీ ప్యాట్‌లపై అవకతవకలు జరిగాయని సిపి ఐఅభ్యర్థి గుండా మల్లేష్ ఆరోపించారు. ఎన్నికల కౌంటింగ్‌కు హాజరైన గుండా మల్లేష్ విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా మంగళవారం ఎన్నికల కమీషన్ ఎన్నికల కౌంటింగ్‌ను ప్రారంభించిందని తెలిపారు. ఈవీ ఎం యంత్రాలు , వీవీ ప్యాట్‌లపై వందశాతం కాగితాలను లెక్కింపు చేయాలని ఎన్నికల కమీషన్ డిమాండ్ చేశారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ వీ ఎం యంత్రాలు అవకతవకలు జరిగాయని, అభ్యర్థుల ఫలితాలు తారుమారు అవుతున్నాయని అవేధన వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల కౌంటింగ్‌పై ఎన్నికల రిటర్నింగ్ అధికారి బెల్లంపల్లి సబ్ కలెక్టర్ రాహుల్ రాజ్‌కు వినతి పత్రం అందజేసినట్లు ఆయన తెలిపారు. వెంటనే సంబంధిత ఎలక్షన్ అధికారులు ఎన్నికల కౌంటింగ్‌పై సమగ్రమైన దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు.

అధికార పార్టీకి తగ్గిన పోస్టల్ బ్యాలెట్లు
ఆదిలాబాద్ మున్సిపాలిటీ,డిసెంబర్ 10: ఆదిలాబాద్ నియోజకవర్గంలో వెలువడ్డ 2018 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అధికార పార్టీకంటే ఇతరులకే ఎక్కువ పోలయ్యాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపును పరిశీలిస్తే.. బిఎస్పీ అభ్యర్థి ఈర్ల సత్యంకు 6 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి గండ్రత్ సుజాతకు 578 ఓట్లు, టీఆర్‌ఎస్ అభ్యర్థి జోగురామన్నకు 465 ఓట్లు, ఎన్‌సిపి అభ్యర్థి ఎల్చాల దత్తాత్రికి ఒక ఓటు పోలుకాగా బిజెపి అభ్యర్థి పాయల శంకర్‌కు 290 ఓట్లు, శివసేన అభ్యర్థి యతేంద్రనాథ్ యాదవ్‌కు 3 ఓట్లు పోలయ్యాయి. రాజ్యాధికార పార్టీ అభ్యర్థి కొత్తపెల్లి నారాయణకు ఒక ఓటు రాగా ఏపి ఐ పార్టీ అభ్యర్థి సందీప్‌కు 2 ఓట్లు, ఆమ్ ఆద్మి పార్టీ అభ్యర్థి వై.సంజీవ్ రెడ్డికి ఒక ఓటు రాగా స్వతంత్ర అభ్యర్థి కస్తాల అరుణ్‌కుమార్‌కు ఒక ఓటు, స్వతంత్ర అభ్యర్థి తొగరి రాములుకు రెండు ఓట్లు, నోటాకు 5 ఓట్లు పోలయ్యాయి.
స్వతంత్రుల పాత్ర నామమాత్రమే..
అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో ఓటింగ్ ఫలితాల అనంతరం ఆదిలాబాద్ నియోజకవర్గంలో స్వతంత్రులు, బిఎస్పీ, ఎన్‌సిపి, రాజ్యాధికార పార్టీ, ఆమ్ ఆద్మీ, శివసేన పార్టీల అభ్యర్థులకు డిపాసిట్లు సైతం దక్కపోవడం గమనార్హం. వీరికి వచ్చిన ఓటింగ్ శాతాన్ని పరిశీలిస్తే స్వతంత్ర అభ్యర్థులు అన్నం దేవెందర్‌కు 800 ఓట్లు, కస్తాల అరుణ్ కుమార్‌కు 953 ఓట్లు, తొగరి రాములుకు 551 ఓట్లు సాధించగా, బిఎస్పీ అభ్యర్థి ఈర్ల సత్యంకు 1346 ఓట్లు, ఎన్‌సిపి అభ్యర్థి దత్తాత్రికి 658 ఓట్లు, శివసేన అభ్యర్థి యతేంద్రనాథ్ యాదవ్‌కు 613 ఓట్లు రాగా ఎన్‌పి ఆర్‌పి అభ్యర్థి కాంబ్లే భగవాన్‌కు 454 ఓట్లు, రాజ్యాధికార పార్టీ అభ్యర్థి కొత్తపల్లి నారాయణకు 4,124 ఓట్లు, ఏపిఐ పార్టీ అభ్యర్థి సందీప్‌కు 571 ఓట్లు, సంజీవ్ రెడ్డికి 489 ఓట్లు, జిజిపి అభ్యర్థి పెందూర్ మనోహర్‌కు 336 ఓట్లు పోలయ్యాయి.