అదిలాబాద్

టీఆర్‌ఎస్‌లోకి ఆత్రం సక్కు..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచిర్యాల, డిసెంబర్ 14: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఆసిఫాబాద్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికైన ఆత్రం సక్కు తెరాసలో చేరనున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే పది నియోజక వర్గాలలో తొమ్మిది నియోజకవర్గాలలో టీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలుపొందగా, ఆసిఫాబాద్ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకోవడం తెలిసిందే. తెరాస అభ్యర్థి కోవ లక్ష్మిపై కేవలం 171 ఓట్ల మెజార్టీతో సక్కు గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ నుండి ఒకే ఒక్కడిగా నిలిచిన సక్కు టీఆర్‌ఎస్ పార్టీలో చేరేందుకు వెలమ సామాజికవర్గానికి చెందిన ఉన్నతస్థాయి వ్యక్తులతో జోరుగా మంతనాలు జరుపుతున్నట్లుగా సమాచారం. ఆదివాసీ, లంబాడిల మధ్య జరిగిన ఉద్యమంలో ఆదివాసీలకు ముఖ్య నాయకుడిగా ఉన్న సక్కు అప్పట్లో కీలకపాత్ర పోషించారు. నాటి నుండి నేటి వరకు ఆదివాసీల వెన్నుంటూ వస్తున్న నాయకుడిని పార్టీలో చేరితే ఆదివాసీ, లంబాడిల మధ్య ఉన్న గొడవలు సద్దుమణిగే అవకాశాలు ఉన్నందున పార్టీలో చేర్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ తరఫున పోటీపడిన ఇద్దరూ ఒకే వర్గానికి చెందిన నాయకులు కావడంతో.. అత్రం సక్కు ఆదివాసీల పాత్రలో ముఖ్య భూమిక పోషించడంతో ఆదివాసీలు సక్కును ఎన్నుకున్నారు. అధికార పార్టీలోకి వెళ్లితే ఆదివాసీలకు అభివృద్ధి ఫలాలు అందించేలా ఉంటాయని గిరిజనుల మధ్య గొడవలు తలెత్తే అవకాశాలు ఉండవనే ఆలోచనతో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆ నియోజకవర్గంలోని సక్కు అనుచరవర్గంతో పాటు పలువురు నేతలు టీఆర్‌ఎస్ అధికార పార్టీలోకి చేరాలనే ఒత్తిడి తీసుకొస్తున్నట్లుగా తెలుస్తుంది. మూడు రోజులుగా అధికార పార్టీలోకి చేరేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం. కాగా, ఆ నియోజకవర్గంలోని అధికార పార్టీ నాయకులు ఎమ్మెల్యే అత్రం సక్కు చేరికను అడ్డుకునే్న ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

పత్తి ధరపై రైతన్న దిగులు
వాంకిడి, డిసెంబర్ 14: కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోనే పత్తి పండించడంలో మొదటి స్ధానంలో ఉన్న వాంకిడి మండలంలోని పత్తి ఈ సారి ధరలేకపోవడంతో మండల రైతులు దిగులుచెందుతున్నారు.ఈ సారి క్వింటల్ పత్తికి కనీసం 6వేలైన ధర ఉంటుందని భావించిన మండల రైతులకు చుక్కెదురవుతుంది. ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, వాంకిడి పత్తి మార్కెట్‌లల్లో ఇప్పటి వరకు క్వింటల్ పత్తి ధర 4700 నుండి 5600 రూపాయలు మాత్రమే పలికింది. గురువారం వాంకిడి మండల కేంద్రంలో మొట్ట మొదటిసారి క్వింటల్ పత్తి ధర 5500 పలకడంతో పాటు వాతారణంలో మార్పు వచ్చి తేమగా ఉండడంతో ఇండ్లలో ఉన్న పత్తిని మండల పత్తి రైతులు అమ్మకానికి బారులు తీరారు. ఈ ధర మరో రెండు,మూడు రోజులు కొనసాగుతుందని కొంత మంది కొనుగోలుదారులు తెలపడంతో ఇటీవల పత్తిని రైతులు విక్రయించడానికే మొగ్గు చూపుతున్నారు. దీనికితోడు వారంరోజులుగా వాతావరణం మబ్బుగా ఉండడంతోపాటటు బుధ, గురువారాల్లో మండలంలో భారీ వర్షం కురిసింది.దీంతో మండల రైతులు పత్తి అమ్మడానికి ఆశపడుతున్నా మార్కెట్‌లో పత్తి ధర లేకపోవడం వారిని కుంగదీస్తుంది.
పత్తికి నష్టం కలిగించిన అకాల వర్షం
వాంకిడి మండలంలో బుధవారం నుండి కురుస్తున్న వర్షం మండల పత్తి రైతులకు అపార నష్టం కలిగిచిందని వారంటున్నారు. పత్తి పంట ఏరుతున్న సమయంలో ఇలా ఒకేసారి వర్షం రావడం ఇదే మొదటిసారని వారంటున్నారు. దీంతో పత్తి ఏరివేత నిలిచిపోయిందని, రెండు రోజుల్లో పత్తి ఏరివేత సాగినా అది మందకోడిగా సాగుతుందని వారంటున్నారు. వర్షానికి పత్తి చెట్లపైనే తడిసి ముద్దగా మారింది. ఇది ఏరితే తూకంలో బరవు తూగడంతోపాటు, మార్కెట్‌లో దీన్ని కొనడానికి ఎవరు ముందుకు రావడంలేదని వారంటున్నారు. ఏరివేత భారంగా మారిందని బాధపడుతున్న సమయంలోనే వర్షం రావడంతో ఇదికాస్తా మరింత భారంగా మారడం రైతులు జీర్ణించుకోవడంలేదు. నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని మండల రైతులు కోరుతున్నారు.

రహదారి పనులకు జోగు శంకుస్థాపన
ఆదిలాబాద్ టౌన్, డిసెంబర్ 14: రూ.44కోట్లతో చేపట్టనున్న ఆదిలాబాద్ రహదారి విస్తరణ పనులను శుక్రవారం తాజా మాజీ మంత్రి జోగు రామన్న భూమి పూజ చేసి ప్రారంభించారు. ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించిన అనంతరం హైదరాబాద్ నుండి ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకున్న జోగురామన్నకు టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఆదిలాబాద్ పట్టణ సుందరీకరణలో భాగంగా దస్నాపూర్ బ్రిడ్జి నుండి కలెక్టర్ చౌరస్తా, ఎన్టీ ఆర్ చౌరస్తా, బస్టాండ్ మీదుగా పంజాబ్ చౌక్, తిర్పెల్లి పెట్రోల్ బంక్ వరకు ఉన్న రహదారిని 6 వరసలుగా మారుస్తూ చేపట్టే పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. అదేవిధంగా రహదారి పొడవునా నగరాలను తలదనే్నలా డివైడర్‌లు, సెంట్రల్ లైటింగ్ సిస్టంల ఏర్పాట్లకు పనులు ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ ఎన్నికల సమయంలోనే రాజకీయాలు ఉంటాయని, ఎన్నికల అనంతరం అందరం ఒక్కటేనని, అన్ని పార్టీలు, అన్ని వర్గాల వారు అభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు. రాగద్వేషాలను విడనాడి నిస్పక్షపాతంగా సమగ్ర అభివృద్దికి పాటుపడుతానని స్పష్టం చేశారు. రానున్న ఐదు ఏళ్ళలో ఆదిలాబాద్ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ది చేస్తామని అన్నారు. తనను మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రతి ఒక్క ఓటరుకు రుణపడి ఉంటానని, ఈ సంధర్భంగా వారికి కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపల్ చైర్‌పర్సన్ మనీషా మాట్లాడుతూ ఆదిలాబాద్ పట్టణ అభివృద్దికి విశేష కృషి చేస్తున్న జోగు రామన్న మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందడం ఆనందంగా ఉందని, పట్టణాన్ని మరింత అభివృద్దిపర్చేందుకు తామంతా కలిసికట్టుగా ముందుకెళ్తామని అన్నారు. కార్యక్రమంలో డిసిసిబి చైర్మెన్ దామోదర్ రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ రంగినేని మనీషా, జడ్పీటీసీ అశోక్, ఐసిడిఎస్ ఆర్గనైజర్ కస్తాల ప్రేమల, మార్కెట్ కమిటీ చైర్మెన్ ఆరె రాజన్న, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు అడ్డి బోజారెడ్డి, ఆర్‌అండ్‌బి ఎస్‌సి మహమ్మద్ నసిర్ ఆహ్మాద్, డిఈ సురేష్, ఈఈ వెంకట్ రెడ్డి, ఏఈ నరేష్‌లతో పాటు వార్డు కౌన్సిలర్లు, టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం
* కలెక్టర్ భారతీ హోళీకేరి
మంచిర్యాల, డిసెంబర్ 14: ఆకాల వర్షంతో తడిసి ముద్దైన ధాన్యాన్ని కొనుగోలులో రైతులకు ఎలాంటి సమస్యలు రాకుండా ఆఖరి గింజ వరకు కొనుగోలు చేస్తామని కలెక్టర్ భారతీ హోళీకేరి అన్నారు. ఆకాలవర్షంతో దెబ్బతిన్న పంటలపై శుక్రవారం కలెక్టరేట్‌లో సంబంధితశాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. దెబ్బతిన్న పంటలపై తగుచర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలను ఆదేశించారు. నాలుగు రోజులుగా జిల్లాలో కురిసిన వర్షంతో తడిసిన ధాన్యం కొనుగోలు సమయంలో జిల్లాకు 13వేల టార్పాలిన్‌లు వ్యవసాయ శాఖ ద్వారా మండలాల వారీగా పంపిణి చేయడం జరిగిందన్నారు. వ్యవసాయశాఖ ద్వారా వరి నాటు యంత్రాలు 19 ( పెద్దవి), 18 ( చిన్నవి) పంట కోయు యంత్రాలు 6 (ఆర్వేస్టర్‌లు) మంజూరు అయ్యాయని తెలిపారు. అర్హతగల వ్యవసాయ రైతులను గుర్తించి 50 శాతం రాయితీతో అందజేయడం జరుగుతుందన్నారు. ధాన్యం కొనుగోలులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని సంక్లిప్త నివేధిక అందించాలని డీఎంసీఎస్సీ జిల్లా సహాకార అధికారి గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ అధికారి, జిల్లా పౌర సరఫరాల అధికారి, జిల్లా పౌరసరఫరాల మేనేజర్‌లను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వీరయ్య, మార్కెటింగ్ ఏడి గజానంద్, జిల్లా సహకార శాఖ అధికారి సంజీవ రెడ్డి, ముఖ్య ప్రణాలిక అధికారి సత్యనారాయణ రెడ్డి, గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ శంకర్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

కొంపముంచిన కోల్ బెల్ట్
* అంతర్మథనంలో కాంగ్రెస్ అభ్యర్థులు
మంచిర్యాల, డిసెంబర్ 14: జిల్లాలోని చెన్నూర్, మంచిర్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థుల ఓటమిపై నాయకులు అంతర్మథనంలో పడ్డారు. కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇచ్చేముందు పలురకాల సర్వేలు చేపట్టింది. పైరవీలకు తావులేకుండా క్షేత్ర స్థాయిలో చేపట్టిన సర్వేల ద్వారానే గెలుపు గుర్రాలను నిర్ణయించి టికేట్‌లు కేటాయించినప్పటికీ పార్టీ అధిష్టానం కఠిన నిర్ణయాలనే తీసుకొని అభ్యర్థులను ప్రకటించింది. అభ్యర్థుల ప్రకటన ఆలస్యమే ఓటమికి కారణం అని అంఛనాలు వేస్తున్నట్లుగా తెలుస్తుంది. మంచిర్యాల నియోజకవర్గంలో లక్సెట్టిపేట, దండేపల్లి, మండలాల్లో టీఆర్‌ఎస్ పార్టీకి దీటుగా ఓట్లు సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి కొక్కిరాల ప్రేమ్ సాగర్‌రావుకు నస్పూర్ మండలంలోని కోల్ బెల్ట్ ప్రాంతంలోని కార్మికుల ఓట్లే ప్రతికూలంగా మారింది. ఈ ప్రాంతంలో కార్మికులంతా టీఆర్‌ఎస్ వైపు మొగ్గు చూపారు. సింగరేణి కార్మికులకు కారుణ్య నియామకంతోపాటు నివాస స్థలాలకు పట్టాలు ఇస్తామని కేసీఆర్ హామీలు ఈ ఎన్నికలలో పని చేశాయి. కోల్ బెల్ట్ ప్రాంతంలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పూర్తి స్థాయిలో పనిచేయక పోవడంతోనే ఓటమి చెందామని ఆ కార్యకర్తలతో మాట్లాడి ఓటింగ్ శాతాన్ని పరిశీలించినట్లుగా తెలుస్తుంది. ఏఏ గ్రామాల్లోని ఏఏ బూత్‌లలో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయనే వాటిపై కూడా చర్చించుకుంటున్నారు. ప్రేమ్ సాగర్ రావు మూడేళ్లుగా నియోజక వర్గంలో పలు సేవ కార్యక్రమాలు చేపడుతున్నారు. రఘుపతిరావు చారిట్రబుల్ ట్రస్ట్ పేరిట ప్రతి ఏటా ట్యాంకర్ల ద్వారా మంచి నీటి సరఫరా, ఆడ పడుచులకు చీరల పంపిణి లాంటి కార్యక్రమాలు చేయడంతోపాటు ఆపదలో ఉన్న వారిని కూడా ఆదుకున్నారు. కానీ, ఎన్నికలలో మాత్రం 4848 ఓట్ల తేడాతో ఓడిపోయారు. చెన్నూర్ నియోజక వర్గంలో బొర్లకుంట వెంకటేష్ నేత ప్రభుత్వ అధికారిగా విధులు నిర్వహించి 18 నెలల సర్వీస్ ఉన్న ఉద్యోగానికి రాజీనామా చేసి పోటీలో దిగారు. చెన్నూర్ నియోజక వర్గంలోని ప్రజలతో సత్సబంధాలు అంతం తా మాత్రంగానే ఉన్నప్పటికీ మాజీ మంత్రి బోడ జనార్థన్‌ను కాదని టికేట్ వెంకటేష్‌కు కేటాయించడంతో ఓటమి చవి చూశారు. బెల్లంపల్లి నియోజక వర్గంలో మహాకూటమి అభ్యర్థిగా సిపి ఐ గుండా మల్లేష్ బరిలో నిలిచినప్పటికీ ఘోర పరాజయం పాలయ్యారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపోందిన గుండా మల్లేష్ ఈ ఎన్నికలలో తమ నియోజక వర్గం నుండి 3869 ఓట్లు మాత్రమే సాధించి డిపాజిట్లు కూడా దక్కించుకోలేని పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ నాయకులు టి ఆర్ ఎస్ పార్టీకి ధీటుగా ప్రచారం చేపట్టిన ఓటర్లకు కోట్లు ఖర్చు పెట్టిన ఓటమి చవి చూడాల్సి వచ్చిందని అనుకుంటున్నారు.