అదిలాబాద్

హామీలను నెరవేర్చేందుకు పక్కా ప్రణాళిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, డిసెంబర్ 14: తెలంగాణలో సంస్థాగత రాజకీయ భవిష్యత్తు కోసమే కెటిఆర్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలను అప్పగించడం జరిగిందని, ఈ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను పక్కాగా నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ కార్యాచరణ సిద్దం చేశారని తాజా మాజీ మంత్రి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. శుక్రవారం ఫారెస్ట్ విశ్రాంతి భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ తెలంగాణలో టీఆర్‌ఎస్ పార్టీకి తిరుగులేని మెజార్టీ సాధించి రాజకీయాల్లో చరిత్ర సృష్టించామని, ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ప్రభుత్వపరంగా చేపట్టాల్సిన అనేక అంశాలు ముందు ఉండడం, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యతలు ఉన్న దృష్ట్యా సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు ప్రభుత్వం పనిచేస్తుందని, ప్రజల ఆశీర్వాదం ఉంటే ప్రధాన మంత్రిగా కెసిఆర్, ముఖ్యమంత్రిగా కెటిఆర్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి టీఆర్‌ఎస్ మాత్రమే శ్రీరామ రక్ష అని ప్రజలు ముక్తకంఠంతో ఏకీభవించారని, అందులో భాగంగానే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు అఖండ మెజార్టీతో విజయాన్ని అందించారని జోగు రామన్న పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కెటిఆర్ పనితీరు, నిబద్దత, నాయకత్వ లక్షణాలు పార్టీని సుస్థిరంగా, సుభిక్షంగా నిలుపుతాయని రామన్న విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్‌పర్సన్ రంగినేని మనీషా, మార్కెట్ కమిటీ చైర్మెన్ ఆరె రాజన్న, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు అడ్డి బోజారెడ్డి, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు సాజిదొద్దిన్, టీఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.