అదిలాబాద్

ఎన్నికల విధులు సక్రమంగా నిర్వర్తించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడిహత్నూర్, జనవరి 2: గ్రామ పంచాయతీ ఎన్నికల విధులను రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం సక్రమంగా నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం మండల కేంద్రంలోని ఎంపిడీవో కార్యాలయ సమావేశ మందిరంలో ప్రెసైడింగ్ అధికారులతో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పలు సూచనలు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాలతో ఓటింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఒకే రోజు ఓటింగ్, కౌంటింగ్ ఉంటుందని, ఎన్నికల విధులను బాధ్యతయుతంగా నిర్వర్తించాలన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులకు ఏలాంటి ఇబ్బందులు కల్గకుండా చూసుకోవాలన్నారు. ఎన్నికల్లో ఎవైనా అనుమానాలు ఉంటే స్థానిక ఎడీవోకుగాని, జిల్లా పంచాయతీ అధికారికి గాని, లేనట్లయితే తనను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ఓట్లను ఈసారి ఆన్‌లైన్ ప్రక్రియ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పించడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు. ఒకవేళ ఆన్‌లైన్ సేవలు అందుబాటులో లేకపోతే వాట్సాప్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవచ్చన్నా రు. ఈ సందర్భంగా ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి బ్యాలెట్ పేపర్ వినియోగం, వాటి పనితీరుపై పలు సూచనలు చేశారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ దివ్య ఎంపిడీవో కార్యాలయ సిబ్బందికి దుప్పట్లు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎడీవో పుష్పలత, ఈవోపీఆర్‌డి లింగయ్య, సూపరింటెండెంట్ అరుణ, సిబ్బంది కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

ఆపరేషన్ స్మైల్‌ను పకడ్బందీగా చేపట్టాలి
* పిల్లలను పనిలో పెట్టుకుంటే కేసు
* విద్యార్థినులు వారం రోజులు స్కూళ్లకు రాకుంటే ఇళ్లకు వెళ్లి తీసుకురండి
* కలెక్టర్ ప్రశాంతి
నిర్మల్, జనవరి 2: ఈనెలా ఖరు వరకు చేపట్టిన ఆపరేషన్ స్మైల్-5 కార్యక్రమాన్ని పకడ్భందీగా చేపట్టాలని కలెక్టర్ ఎం.ప్రశాంతి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో మహిళాశిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమశాఖ బాలల పరిరక్షణవిభాగం ఆధ్వర్యంలో పోలీస్, కార్మిక, విద్యాశాఖ, క్రీడలు, వైద్య, స్వచ్ఛంద సంస్థలతో నిర్వహించిన ఆపరేషన్ స్మైల్ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ బాల కార్మికులుగా పెట్టుకున్న యజమానులపై కేసులు నమోదు చేయాలని జిల్లా కార్మికశాఖ అధికారిని ఆదేశించారు. ఆపరేషన్ స్మైల్‌లో రెస్క్యూ చేసిన వారిని ప్రభుత్వ వసతి గృహంలో ప్రవేశం కల్పించి వారి విద్యాభివృద్ధిని పరిశీలించి ప్రతినెలా నివేదికలు ఇవ్వాలన్నారు బడిమానేసిన పిల్లలను గుర్తించి వసతి గృహాల్లో ప్రవేశం కల్పించాలని, ముఖ్యంగా 8,9,10వ తరగతి చదివే విద్యార్థినిలు వారం రోజులు పాఠశాలలకు రాకుంటే వారి ఇళ్లకువెళ్లి బడికితీసుకుని రావాలని, డ్రాపౌట్‌లు లేకుండా చూడాలన్నారు. పిల్లలకు మెడికల్ చెకప్, హెల్త్ ఎడ్యుకేషన్ తెలియజేయాలన్నారు. బాల్య వివాహాలు జరగకుండా చూడాలన్నారు. బాధిత కార్మికులు (బాండెడ్) గుర్తించి వారిని ఆశ్రమ పాఠశాలల్లో ప్రవేశం కల్పించాలన్నారు. ఆపరేషన్ స్మైల్-5లో భాగంగా రెస్క్యూ అయిన పిల్లలను అదేరోజు సిడబ్ల్యుసి ముందు ప్రవేశపెట్టి వారి అనుమతితో వసతి గృహాల్లో ప్రవేశం కల్పించాలన్నారు. సమావేశంలో జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల సంక్షేమ అధికారి ఎ.విజయలక్ష్మీ, డీఎస్పీ ఉపేంధర్‌రెడ్డి, డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ జలపతి నాయక్, జిల్లా కార్మికశాఖ అధికారి శ్రావణి, కో-ఆర్డినేటర్ సునీల్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధి మంజుల, ఇన్‌చార్జి డీసీపివో సగ్గం రాజు తదితరులు పాల్గొన్నారు.

కొత్త పంచాయతీ చట్టం అమలుపై ఎన్నికల సంఘం నజర్
* క్రిమినల్ కేసుల్లో దోషిగా తేలితే పోటీకి అనర్హత
ఆంధ్రభూమి బ్యూరో
ఆదిలాబాద్, జనవరి 2: స్థానిక సంస్థల ఎన్నికల్లో బరిలో నిలిచి గెలవాలని ఆరాటపడుతున్న నేతల ఆశలకు నూతన పంచాయతీ రాజ్ చట్టం నిబంధనలు అడ్డంకిగా మారనున్నాయి. అధిక సంతానం వద్దు.. ఇద్దరే ముద్దు, మేమిద్దరం.. మాకిద్దరూ అన్న సర్కారు నినాదాలు త్వరలో జరిగే పంచాయతీ ఎన్నికల్లో ఆచరణాత్మకంగా అమలుకు నోచుకోనున్నాయి. రిజర్వేషన్లు అనుకూలించి సంబరపడుతున్న ఆయా పార్టీల ద్వితీయ శ్రేణి నేతలకు మూడో సంతానం అడ్డురావడం పలుచోట్ల అందోళన కల్గిస్తున్నాయి. తాజాగా 2018లో ప్రభుత్వం నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి ఎన్నికల్లో పోటీకి పలు నిబంధనలు తెరపైకి తీసుకరావడంతో బరిలో నిలిచే వారి అర్హతలు ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారాయి. పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 19, ఉప సెక్షన్ 6 ప్రకారం 1995 మే 30తర్వాత మూడో సంతానం కలిగిన వారికి స్థానిక సంస్థలకు సంబంధించి సర్పంచ్, వార్డు సభ్యులు, ఎంపిటీసీ, జడ్పీటీసీలుగా పోటీచేయడానికి అనర్హులని నిబంధన విధించడం గమనార్హం. 1994లో అమలుచేసిన పంచాయతీరాజ్ చట్టం ప్రకారమే కొత్త చట్టం సవరణలోనూ మూడో సంతానం నిబంధనలను పకడ్బందీగా అమలుచేసేందుకు ఎన్నికల సంఘం నిర్ణయించింది. రెండో కాన్పులో కవలలు పుడితే మాత్రం ఈ నిబంధన వర్తించదు. తెలంగాణ పంచాయతీరాజ్ నూతన చట్టం ప్రకారం 21 ఉప సెక్షన్ నిబంధన మేరకు ఒక వ్యక్తికి ఇద్దరు పిల్లలకన్నా అధిక సంతానం ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా ప్రకటించనున్నారు. 1995 మే 31కి ముందే ఇద్దరికన్నా ఎక్కువ మంది పిల్లలు కలిగి ఉంటే మాత్రం ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులే. 1995 జూన్ 1 తర్వాత మూడో సంతానం కలిగిన వారు మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ పోటీ చేయడానికి అనర్హులని ఎన్నికల సంఘం స్పష్టం చేస్తోంది. 1995కు ముందు ఒకే సంతానంలో కవలలు పుట్టి, ఆ తర్వాత కవలలు జన్మించినా పోటీకి అర్హులేనని తేల్చిచెప్పింది. ఇక ఎన్నికల్లో పోటీ చేసేందుకు దత్తత విషయంలోనూ చిక్కు ముడులపై సష్టతనిస్తూ 2006లో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం పిల్లలను దత్తత ఇచ్చినా, దత్తత తీసుకున్నా తల్లిదండ్రులను కన్నవారిగానే గుర్తించి పరిగణలోకి తీసుకోనున్నారు. ఒక వ్యక్తి మొదటి భార్యకు ఇద్దరు సంతానం ఉంటే, భార్య చనిపోయి రెండో వివాహం చేసుకొని మరో సంతానానికి జన్మనిచ్చినా పోటీకి అనర్హుడేనని ఎన్నికల సంఘం పేర్కొంటోంది. అయితే ఈ నిబంధనల సవరణలో భాగంగా రెండో భార్యకు అంతకు ముందు పిల్లలు లేకుండా ఒక్కరే సంతానం కలిగి ఉంటే మాత్రం పోటీ చేయడానికి అర్హత కల్పించారు. నామినేషన్ల పరిశీలన రోజు వరకు ప్రసవం కాకుంటే పోటీలో కొనసాగేందుకు అవకాశం ఇవ్వడం గమనార్హం.
క్రిమినల్ కేసుల్లో దోషిగా తేలితే అనర్హత వేటు
సర్పంచ్, వార్డు స్థానాల్లో పోటీచేసే అభ్యర్థులు క్రిమినల్ న్యాయస్థానంలో దోషిగా తేలి శిక్షపడితే ఐదేళ్ళవరకు పోటీలో నిలిచేందుకు అనర్హులే. విచారణ అనంతరం న్యాయస్థానం దోషిగా నిర్దారించినా సదరు వ్యక్తి కోర్టు నుండి స్టే లేదా బెయిల్ పొందినా పోటీచేయడానికి అనర్హుడేనని పంచాయతీరాజ్ చట్టం స్పష్టం చేస్తోంది. ఇదిలా ఉంటే రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ప్రకారం చౌక ధరల దుకాణాల డీలర్లు పోటీకి అర్హత కల్పించారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, సింగరేణి, అంగన్వాడీ సిబ్బంది, నీటి వినియోగదారుల సంఘం సభ్యులు, మత సంస్థల పాలకవర్గాలు ఎన్నికల్లో పోటీచేయడానికి అనర్హత విధించారు.

శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విద్యార్థులు రాణించాలి
* ఎమ్మెల్యే జోగు రామన్న
ఆదిలాబాద్ రూరల్, జనవరి 2: విద్యార్థులు పోటీతత్వాన్ని అలవర్చుకొని సాంకేతిక శాస్త్ర రంగాల్లో రాణించాలని ఆదిలాబాద్ శాసన సభ్యులు జోగు రామన్న పిలుపునిచ్చారు. బుధవారం ఆదిలాబాద్ పట్టణంలోని కలెక్టరేట్ చౌక్‌లో జీనియస్ ఐఐటీ శిక్షణ సంస్థను నూతనంగా స్థాపించగా ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈసందర్భంగా రామన్న మాట్లాడుతూ విద్యార్థులను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్ది ఉపాధి రంగాల్లో స్థిరపడేలా సాంకేతిక విలువలతో శిక్షణ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. విద్యారంగంలో వినూత్న ఒరవడి సృష్టించి పలు శిక్షణ తరగతులను నిర్వహిస్తున్న నిర్వాహకులు షోయబ్‌అల్తాప్‌ను అభినందించారు. సందర్భంగా షోయబ్ అల్తాప్ మాట్లాడుతూ తమ ఇనిస్ట్యూట్‌లో ప్రత్యేకంగా అబాకస్, వేదిక్‌మ్యాథ్స్, స్పోకెన్ ఇంగ్లీష్ తదితర శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రంగినేని మనీషా, వైస్ చైర్మెన్ ఫారుక్ ఆహ్మాద్, జడ్పీటీసీ విజ్జగిరి అశోక్, టీఆర్‌ఎస్ టౌన్ ప్రెసిడెంట్ సాజిదొద్దిన్, ఎంపిపి శుక్లాల్, టీయూడబ్ల్యూజె నాయకులు రమేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.

త్వరలో పీహెచ్‌సీల్లో ఖాళీల భర్తీ
* ప్రాజెక్టు అధికారి కృష్ణ ఆదిత్య
ఉట్నూరు, జనవరి 2: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా భర్తీచేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి కృష్ణ ఆదిత్య అన్నారు. శుక్రవారం ఏజెన్సీ పరిధిలోని 31 పీహెచ్‌సీ వైద్యాధికారులు, సూపర్‌వైజర్లతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 31 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 186 ఉపకేంద్రాల్లో అందుతున్న వైద్యసేవల గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల వైద్య ఆరోగ్య పరీక్షలు ముఖ్యంగా హిమోగ్లోబిన్, బీపీ, షుగర్, ఎత్త, బరువు తదితర ఆరు రకాల పరీక్షలు చేయాలన్నారు. టీబీ వ్యాధిపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. గర్భవ్రతులకు నెలసరి ఇచ్చే టీకాల వివరాలు ఎప్పటికప్పుడు పొందుపర్చాలన్నారు. పీహెచ్‌సీలకు కావాల్సిన లాబొరేటరీ పరికరాలు సైతం సమకూరుస్తామన్నారు. ఆసుపత్రి అభివృద్ధికోసం వచ్చే నిధుల ఖర్చుల వివరాలు తెలుపాలని వైద్యాధికారులను ఆదేశించారు. వైద్యాధికారులు సెలవుపై వెళ్ళినట్లయితే తనకు తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్ప వన్నారు. ఏఎన్‌ఎంల పనితీరు బాగాలేదని, తనకు అనేక ఫిర్యాదులు వస్తున్నందున వారితీరు మార్చుకోవాలని, లేనట్లయితే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ జిల్లా సహాయ వైద్యాధికారి వసంతరావును ఆదేశించారు. సమావేశంలో అడిషనల్ డీఎంఆండ్‌హెచ్‌వో డాక్టర్ చందు, వైద్యులు సాధన, సునీల్, సుధాకర్, సరిత తదితరులు పాల్గొన్నారు.

బర్ధన్ ఆశయ సాధన కోసం పనిచేయాలి
మంచిర్యాల, జనవరి 2: భారత కమ్యూనిస్టు పార్టీ జనరల్ సెక్రటరీగా పని చేసిన ఏబీ వర్థన్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు పనిచేయాలని జిల్లా కార్యదర్శి కలవేన శంకర్ కోరారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో వర్థంతి సభను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయ న మాట్లాడుతూ భారతదేశంలోనే ప్రాచీన రాజకీయ పార్టీ అయిన సీపీఐలో సుభిక్షిత సంకీర్ణ రాజకీయ శకంలో పార్టీనిలో సమర్థవంతంగా నడిపించిన మహా నాయకుడని అన్నారు. కార్మిక నేతగా పలు ఉద్యమాలు చేపట్టారని నాలుగేళ్లకు పైగా జైలు జీవితం గడిపారన్నారు.

స్థానిక ఎన్నికల బరిలో సీపీఐ
* సీపీఐ జిల్లా కార్యదర్శి కలవేన శంకర్
మంచిర్యాల, జనవరి 2: స్థానిక సంస్థల ఎన్నికలలో సీపీఐ బరిలో నిలుస్తుందని జిల్లా కార్యదర్శి కలవేన శంకర్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో బీజేపీయేతర పార్టీలతో కలిసి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టే విధంగా ఈ ఎన్నికలలో ప్రచారం చేపడుతామని అన్నారు. పార్టీ చేపట్టబోయే కార్యక్రమాలు, స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేయబోయే స్థానాలపై జిల్లా కార్యవర్గ సమావేశంలో చర్చించనున్నట్లుగా తెలిపారు. సమావేశంలో ఏఐటీయూసి నాయకులు మేకల దాసు, జోగుల మల్లయ్య, పౌలు, లక్ష్మణ్, చంద్రశేఖర్, కిషన్ రావు, పోచన్న, శంకరయ్య, నర్సింగ్, లచ్చిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

అర్హులైన వారికి ఓటు హక్కు కల్పించాలి
* కలెక్టర్ దివ్యదేవరాజన్
గుడిహత్నూర్, జనవరి 2: 18సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని కలెక్టర్ దివ్యదేవరాజన్ అన్నారు. బుధవారం గుడిహత్నూర్ మండల తహశీల్‌ను సందర్శించారు. కార్యాలయ భవనాలను పరిశీలించారు. అనంతరం రెవెన్యూ సిబ్బందితో సమావేశమై మండలంలో ఉన్న పోలింగ్ కేంద్రాల గురించి అడిగి తెలుసుకున్నారు. కొత్త ఓటర్ల పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేయాలన్నారు. అలాగే ఓటరు జాబితాలో ఎవైన తప్పులు ఉంటే సరిచేయాలని సూచించారు. పార్ట్‌బికి సంబంధించిన రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటికి సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని తహసీల్దార్ సుజాతకు సూచించారు. రెవెన్యూ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ అరీఫా, ఆర్ ఐలు నరేష్, అమ్రపాలి, సీనియర్ అసిస్టెంట్ నాగోరావు తదితరులు పాల్గొన్నారు.

5,6 తేదీల్లో రాష్టస్థ్రాయి ఫుట్‌బాల్ పోటీలు
బెల్లంపల్లి, జనవరి 2: ఈనెల 5,6 తేదీల్లో పట్టణంలోని ఏఎంసీ క్రీడామైదానంలో మాస్టర్స్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్టస్థ్రాయి ఫుట్‌బాల్ పోటీలు నిర్వహిస్తున్నట్లు సంఘం జిల్లా అధ్యక్షుడు పి రవికుమార్ తెలిపారు. బుధవారం ఇక్కడ ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్టస్థ్రాయి ఫుట్ బాల్ పోటీలకు రాష్ట్రంలోని 31 జిల్లాలకు చెందిన 200 మంది క్రీడాకారులు పోటీలకు హాజరు అవుతారని తెలిపారు. 35 సంవత్సరాలు పై బడినవారికి ఫుట్‌బాల్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోటీలు 5వ తేదీన ప్రారంభమవుతాయన్నారు. ఎంపికైనా రాష్ట్ర జట్టు క్రీడాకారులు ఫిబ్రవరి 26 నుండి మార్చి 3 వరకు ఉత్తరఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్‌లో జరిగే జాతీయ మాస్టర్స్ గేమ్స్ పోటీల్లో పాల్గొంటారన్నారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఆవుల సాయిబాబా, జిల్లా నాయకులు యాదండ్ల బలరాం, టి అంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

ఎంఈవోకు కార్మికుల సమ్మె నోటీసు
తాండూర్, జనవరి 2: మండల విద్యాధికారి వాసాల ప్రభాకర్‌కు బుధవారం సీఐటీయూ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులు సమ్మె నోటీసు ఇచ్చారు. ఈసందర్భంగా సీఐటీయూ జల్లా కార్యదర్శి దాగం రాజారాం మాట్లాడుతూ కేంద్ర కార్మిక కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 8,9 తేదిల్లో నిర్వహించనునన దేశవ్యాప్త సమ్మెలో భాగంగా తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మండలంలోని మధ్యాహ్న భోజనం కార్మికులు దేశవ్యాప్త సమ్మెలో పాల్గొంటారనీ ఆయన పేర్కొన్నారు. కార్మికులకు కనీస వేతనం రూ.18వేలు, పింఛన్ రూ.3వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సమ్మెలో మధ్యాహ్న భోజనం కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో కార్మికులు సరోజ, అన్నక్క, మల్లక్క, లక్ష్మీ, అనసూర్య, సీతాబాయి, జంగుబాయి తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల్లో పొరపాట్లు జరగకుండా చూడాలి
* డీపీవో సాయిబాబా
తలమడుగు, జనవరి 2: త్వరలో జరగబోయే పంచాయతీ గ్రామ సర్పంచ్‌ల ఎన్నికల్లో ఏలాంటి పొరపాట్లు జరగకుండా అధికారులు జాగ్రత్త వహించాలని డీపీవో సాయిబాబా అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఎంపిడీవో కార్యాలయంలో నిర్వహించిన ఎన్నికల శిక్షణ తరగతులలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పీవో, ఏపివో స్థాయి అధికారులు ప్రత్యేక శ్రద్ధవహించాలన్నారు. నియోజకవర్గంలో ఎన్నికలు రెండో విడతగా జరగనున్నాయని, ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. రెండో విడతలో బోథ్, బజార్‌హత్నూర్, తలమడుగు, గుడిహత్నూర్ మండలంలోని 149 గ్రామపంచాయతీలతో పాటు 1200 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంవోటి సంజీవరావు, ఎంపిడీవో సునీత, తహశీల్దార్ ఇమ్రాన్‌ఖాన్, మండల విద్యాధికారి కౌసల్య, ఈవోపిఆర్‌డి దిలీప్ కుమార్, పీవో, ఏపీవోలు పాల్గొన్నారు.