అదిలాబాద్

ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్ మున్సిపాలిటీ, ఫిబ్రవరి 1: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని మహాలక్ష్మీవాడలోని చౌక్ ధరల దుకాణంలో అంగన్వాడీ కేంద్రాలకు ఈపాసు యంత్రాల ద్వారా బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సంధర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ ఈపాసు ద్వారా అంగన్వాడీ కేంద్రాలకు బియ్యం అందించడం ద్వారా ఏలాంటి అవకతవకలు జరగవని అన్నారు. ప్రభుత్వ సరకుల పక్కదారి పట్టకుండా ప్రభుత్వం కొత్త పద్దతులకు శ్రీకారం చుడుతుందన్నారు. అధికారులు సమన్వయంతో ప్రభుత్వ కార్యక్రమాలు విజయవంతం చేయాలని కోరారు. ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని సూచించారు. ఈపాసు యంత్రాల ద్వారా అంగన్వాడీ కేంద్రాలకు బియ్యం సరఫరా చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు అవసరమైన బియ్యాన్ని తీసుకవెళ్ళాలని, అంగన్వాడీ కార్యకర్తలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. చిన్నారులకు సంపూర్ణ పౌష్టికాహారం అందించడంతోపాటు వారికి విద్యనందించడంలో అంగన్వాడీ సెంటర్లు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. కార్యక్రమంలో జెసి సంధ్యారాణి, మున్సిపల్ చైర్‌పర్సన్ మనీషా, డిఎస్‌వో సుదర్శన్, డిడబ్ల్యూవో మిల్క, డిసిసిబి చైర్మెన్ దామోదర్ రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు అడ్డి బోజారెడ్డి, వార్డు కౌన్సిలర్ పుష్ప తదితరులు పాల్గొన్నారు.

కలప స్మగ్లింగ్ మానుకోండి
* జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్

ఇచ్చోడ, ఫిబ్రవరి 1: అడవుల రక్షణతో పాటు కలప స్మగ్లింగ్‌పై రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నందునా కలప స్మగ్లర్లు ఇక నుండి కలప స్మగ్లింగ్‌కు మానుకోవాలని జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ అన్నారు. శుక్రవారం ఇచ్చోడ మండలంలోని కేశవ్‌పట్నం గ్రామంలో జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్, గుండాల గ్రామంలో డిఎస్పీ నర్సింహారెడ్డి, ఉట్నూరు డిఎస్పీ మోహన్‌లు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ కలప స్మగ్లింగ్‌పై పీడీయాక్ట్ కేసులు నమోదవుతున్నాయని, దీని వల్ల కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉన్నందునా స్మగ్లింగ్ చేయడం మానుకున్నట్లయితే ప్రభుత్వం పునరావాసం కల్పించేందుకు సిద్దంగా ఉందన్నారు. ఇటీవల కేశవ్‌పట్నం, గుండాల, సిరిచెల్మ అటవీ ప్రాంతాల్లో జోరుగా కలప రవాణా సాగుతుండడమే కాకుండా అనేక వాహనాలు పట్టుబడుతున్నాయని, దీనికి కొంత మంది ముల్తాని తెగకు చెందిన స్మగ్లర్లే అడవులను నరికివేస్తూ సహకరిస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న అటవీ సంపదను కాపాడుకునేందుకు అనేక చట్టాలు తీసుకవచ్చిందని, దీనిపై స్మగ్లర్లు ఆలోచించుకొని తన స్మగ్లింగ్ పనులను వెంటనే నిలిపివేయాలని సూచించారు. అటవీ శాఖతోపాటు పోలీసు శాఖ అధికారులు ఉమ్మడి తనిఖీలు చేస్తున్నారన్నారు. స్మగ్లింగ్‌కు పాల్పడే వారికి సహాయ సహకారాలు అందించేవారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. జోగిపేట పరిసర ప్రాంతాల్లో అక్రమంగా రవాణా చేసేందుకు సిద్దంగా ఉంచిన సుమారు రూ.4లక్షల విలువగల కలప డంపును స్వాదీనపర్చుకున్నారు. కార్యక్రమంలో స్థానిక ఎస్సై పుల్లయ్యతో పాటు అటవీ శాఖ అధికారి వాహబ్ ఆహ్మాద్ పాటు అటవీ శాఖ సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు.

పల్స్ పోలియోను విజయవంతం చేయాలి
* కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు
ఆసిఫాబాద్, ఫిబ్రవరి 1: మార్చి 10వ తేదీన జిల్లాలో నిర్వహించనున్న పల్స్‌పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో టాస్క్ఫోర్సు కమిటి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాలో 0-5 సంవత్సరాల లోపుచిన్నారులు 54733 మంది ఉన్నారని, వీరందరికీ తప్పని సరిగా పోలియో చుక్కలు వేసేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 646 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పోలియో చుక్కల కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు 2580 మంది సిబ్బందిని నియమించామన్నారు. జనాలు అధికంగా ఉండే బస్టాండ్, రైల్వేస్టేషన్లలో 22 పోలియో కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. మార్చి 10న పోలియో చుక్కల కార్యక్రమం ఉన్నందున అన్ని గ్రామాల్లో ప్రచారం నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. పల్స్ పోలియో రోజున విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఆటంకం తలెత్తకుండా చూడాలన్నారు. అంగన్‌వాడీల సహకారం తీసుకోవాలని సూచించారు. మొదటి రోజు చుక్కలు వేసుకోని చిన్నారుల కోసం ఇంటింటికి వెల్లి పోలియో చుక్కలు వేయాల్సిన బాధ్యత అంగన్‌వాడీ వర్కర్లు, ఎఎన్‌ఎం, ఆశ వర్కర్లపై ఉందన్నారు. టిబి వ్యాది నిర్మూలనలో బాగంగా ప్రతి పిహెచ్‌సిల్లో టిబి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. దగ్గు, జ్వరం, చాతి నొప్పి లక్షణాలు ఉన్న వారు తప్పని సరిగా వైద్య పరీక్షలు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. టిబి నిర్ధారణ అయిన రోగులకు ఉచిత మందులు ఇస్తున్నట్లు తెలిపారు. ఎజెన్సీ ప్రాంతాల వారికి ఖర్చుల కోసం రూ.500, ఆరుమాసాల పాటు ఉచిత వైద్యం అందిస్తామన్నారను. రవాణా చార్జీల కోసం మరో రూ.750 చెల్లిస్తున్నామన్నారు. ఈసమావేశంలో డిప్యుటీ వైద్యాధికారి డాక్టర్ సుధాకర్ నాయక్, సిపిఓ కృష్ణయ్య, డిడబ్ల్యుఓ సావిత్రి, మలేరియా వైద్యాధికారి సీతారాం పాల్గొన్నారు.

హరితలక్ష్యాలను పూర్తి స్థాయిలో అధిగమించాలి
* వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి
* జిల్లా కలెక్టర్ భారతీ హోళీకేరి
మంచిర్యాల, ఫిబ్రవరి 1: జిల్లాలో హరితహార కార్యక్రమాన్ని అన్ని శాఖల సమన్వయం తో హరిత లక్ష్యాలను పూర్తి స్థాయిలో అధిగమించాలని జిల్లా కలెక్టర్ భారతీ హోళీకేరి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో మండల అభివృద్ది అధికారులు, గ్రామీణాభివృద్ది శాఖ, అటవీ శాఖ అధికారులతో బెల్లంపల్లి సబ్ కలెక్టర్ రాహుల్ రాజ్, జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్యతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ హరితహారం లక్ష్యాలను గ్రామ పంచాయతీల వారీగా ప్రతి గ్రామ పంచాయతీకి నర్సరీలలో 40 వేల మొక్కలు పెంచాలని అన్నారు. జిల్లాలో 311 గ్రామ పంచాయతీలలో హరితహారంకోసం ఇంటింటికి వెళ్లి ఏ మొక్కలు కావాలో సర్వే చేసి అవసరమగు మొక్కలతో పాటు పండ్ల మొక్కలు, టేకు, రోడ్డుకు ఇరువైపులా కనీసం ఒక మీటర్ తగ్గకుండా పెరుగుదల ఉండేలా అవసరమగు మొక్కలను నాటాలన్నారు. జూన్, జులై నాటికి మొక్కలు నాటేందుకు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామీణాభివృద్ది, అటవీ శాఖ, సింగరేణి ఇతర శాఖల సమన్వయంతో జిల్లాలో లక్ష్యాలను అధిగమించాలని, జిల్లాలో బహిరంగ మల మూత్ర విసర్జన రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు అధికారులు తగు ప్రణాళికలు చేయాలన్నారు. మరుగుదొడ్ల నిర్మించుకునేలా ప్రజలలో చైతన్యం తీసుకురావాలని, మార్చి 31 నాటికి వందశాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేసి బహిరంగ మల మూత్ర విసర్జన రహిత జిల్లా గా మొదటి స్థానంలో ఉంచేందుకు పనులు వేగవంతం చేయాలన్నారు. ఆసంపూర్తి నిర్మాణాలను పూర్తి చేయాలని ఆదేశించారు. మండలాల వారీగా లక్ష్యాలతో పాటు తగు సూచనలు సలహాలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ది అధికారులు, అటవీ శాఖ, గ్రామీణాభివృద్ది శాఖ అధికారులు తదితరులు ఉన్నారు.

ఈ-పాస్ విధానం ద్వారా అంగన్‌వాడి కేంద్రాలకు బియ్యం
* జిల్లాలో 926 అంగన్‌వాడి కేంద్రాలకు పంపిణీ
* రేషన్ బియ్యం బయట అమ్మితే రేషన్ కార్డులు రద్దు
* రేషన్ సరుకులు పారదర్శకంగా పంపిణీ కోసమే ఈ-పాస్
* కలెక్టర్ ప్రశాంతి
నిర్మల్, ఫిబ్రవరి 1: ఈ-పాస్ విధానం ద్వారా అంగన్‌వాడి కేంద్రాలకు బియ్యం పంపిణీ చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ఎం. ప్రశాంతి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని చింతకుంట వాడలో ఉన్న చౌకధరల దుకాణాములో ఈ-పాస్ విధానం ద్వారా బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ ఏ. భాస్కర్‌రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్‌వాడి సరుకులను ఈ-పాస్ విధానం ద్వారా చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీ చేస్తుందని అన్నారు. ఈ-పాస్ విధానం ద్వారా అంగన్‌వాడి కేంద్రాలకు సరుకులు పారదర్శకంగా పంపిణీ చేయవచ్చన్నారు. జిల్లాలోని 926 అంగన్‌వాడి కేంద్రాలకు 396 చౌకధరల దుకాణాల ద్వారా ప్రతీ నెల 948.06 క్వింటాళ్ల బియ్యం పంపిణీ చేయనునట్లు తెలిపారు. ఈ-పాస్, ఐరిస్ విధానం ద్వారా పంపిణీలో పాదర్శకత పెరుగుతుందని అవినీతి తగ్గిందన్నారు. సమయానికి సరుకులను సక్రమంగా అందించడానికి వీలుకలుగుతుందని అన్నారు. జిల్లాలోని చౌకధరల దుకాణాల ద్వారా పొందిన బియ్యంను అక్రమంగా బయటకు అమ్మినట్లు ఆధికారులు దృష్టికి వస్తే రేషన్ కార్డులను రద్దు చేసి ఆరెస్టు కూడ చేస్తామని అన్నారు. అంగన్‌వాడి కేంద్రాలకు సంబంధించిన బియ్యంను సూపర్‌వైజర్, అంగన్‌వాడి ఆయా, టీచర్, తీసుకొనుటకు వీలుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ భాస్కర్‌రావు, జిల్లా పౌరసంబంధాల ఆధికారి కిరణ్‌కుమార్, జిల్లా మేనేజర్ శ్రీకళ, తహశీల్దార్ అతిక్ ఉద్దిన్, ఎసీడీపీవో శాంతి, డిప్యూటి తహశీల్దార్ రఫీ, అంగన్‌వాడీ సూపర్‌వైజర్, టీచర్లు, తదితరులు పాల్గొన్నారు.

నిర్మల్‌ను ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దాలి
* రోడ్డుపైన చెత్తవేసే వారిపై చర్యలు తీసుకోవాలి
* పట్టణంలో ఆభివృద్ధి పనులను వేగవంతం చేయాలి
* జిల్లా కల్టెక్టర్ ప్రశాంతి
నిర్మల్, ఫిబ్రవరి 1: పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక బద్దంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఎం. ప్రశాంతి అన్నారు. శుక్రవారం నిర్మల్ మున్సిపల్ కార్యాలయును సందర్శించి కొత్తగా నిర్మేంచిన మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించారు. మున్సిపల్ కార్యాలయ అవరణలో చెత్త ఉండటం పట్ల అగ్రహం వ్యక్తం చేశారు. అదనంగా కార్మికులను నియమించి పట్టణమును పరిశుభ్రంగా ఉంచాలని మున్సిపల్ కమిషనర్‌ను అదేశించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ చాంబర్‌లోని నిర్మల్ పట్టణంలో చేపడుతున్న ఆభివృద్ది పనుల పురోగతి, డీపీఆర్ నివేదికలను పరిశీలించారు. పట్టణంలో ఎక్కడ పడితే అక్కడ చెత్త, చెదారం ఉందని వాటిని వెంటనే తొలగించి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలన్నారు. సరిగా పని చేయని కార్మికులను తొలగించాలని తెలిపారు. పర్యావరణానికి నష్టం కలిగిస్తున్న ప్లాస్టిక్ వస్తువులను వినియోగించకుండ ప్రజలను చైతన్యవంతులు చేయాలన్నారు. ఇంటింటికి తిరిగి పేపర్‌లో తయారు చేసిన సంచులను పంపిణీ చేసి ప్రజలు వాడే విధంగా చూడాలని తెలిపారు. టీయూడీఎఫ్‌ఐడీసీ కింద మంజూరైన 15 కోట్ల రూపాయలతో నిర్మల్‌లో చేపట్టిన పనుల పురోగతిని పరిశీలించారు. కోటి రూపాయలతో చేపట్టిన వైఎస్‌ఆర్ ఫంక్షన్ హల్ పునరుద్ధరణ పనుల వివరాలు, 20 లక్షలతో జనరేటర్ ఏర్పాటు, 50లక్షలతో బేల్ బజార్‌లో కాయగురల మార్కెట్‌లో స్టాల్స్, శ్యాంగఢ్‌లో కోటి రూపాయలతే చేపట్టిన పార్క్, ప్లే గ్రౌండ్ ఆభివృద్ది పనులు 198 లక్షలతో చేపట్టిన సెంట్రల్ లైటింగ్ సిస్టం, రూ 90లక్షలతో ప్రధాన ద్వారం వద్ద స్వాగత వంపులు ( ఆర్చిస్) 1 కోటితో ధర్మసాగర్ చెరువు సమీపంలో పార్క్, 133లక్షలతో శ్మశాస వాటికల ఆభివృద్ది, 80 లక్షలతో కంచెరొని చెరువు ఆభివృద్ది ఫెన్సింగ్ పనులు, 40లక్షలతో చీకన్‌చ మాంసం మార్కెట్, 290 లక్షలతో ఎలక్ట్రికల్ టవర్స్ ఏర్పాటు, 1 కోటితో జంక్షన్ మెరుగుపనులు, 30లక్షలతో ఎన్ టీ ఆర్ స్టేడియం పునరుద్దరణ, 25 లక్షలతో ఆర్ అండ్ బీ రోడ్డుకు ఇరువైపుల పుట్‌పాత్‌ల నిర్మాణం, 30లక్షలతో మహలక్ష్మీ దేవస్థానం నుండి డంపింగ్ యార్డు వరకు బీటీ రోడ్డు, 20లక్షలతో వినాయక విగ్రహం పాయింట్ నుండి బతుకమ్మ ఘాట్ వరకు అభివృద్ది, 25లక్షలతో దివ్వనగర్ పార్క్ అంపిథియెటర్ నిర్మాణం, రూ 40లక్షలతో పాదాచారుల కోసం రెయిలింగ్ పనులపై సమీక్షించారు. అనంతరం శ్యాంఘడ్ కోటా సందర్శించారు. కోటలోని పిచ్చి మొక్కలను తొలగించాలని అదేశించారు. పూల మొక్కలు పెట్టాలని, నాటి సౌకర్యం కల్పించాలని, కూర్చోవడానికి బెంచీలు ఏర్పాటు చేయాలని సూచించారు. లైటింగ్ ఏర్పాటు చేసి పార్క్‌గా తీర్చిదిద్దాలన్నారు. కోటను సర్వాంగ సుందరంగా పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని అదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇన్‌చార్జి చైర్మన్ అజీంబిన్ యహియా, మున్సిపల్ కమిషనర్ రవిబాబు, ఇరిగేషన్‌ఖ ఈ ఈ రమేష్, సర్వే అఫ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ దశరత్, మున్సిపల్ డీ ఈ సంతోష్ కుమార్, అర్ అండ్ బీ ఈ ఈ శ్రీనివాస్‌రావు, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

ఇష్టపడి చదివితేనే ఉన్నత స్థాయిలో నిలువ వచ్చు
* జిల్లా కలెక్టర్ భారతీ హోళీకేరి
మంచిర్యాల, ఫిబ్రవరి 1: విద్యార్థులు ఇష్టపడి చదివితే ఉన్నతస్థాయిలో నిలువవచ్చని కలెక్టర్ భారతీ హోళీకేరి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వళన చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల విజయానికి చిరునామాగా మారిందన్నారు. ప్రభుత్వం పేద, మధ్య తరగతి విద్యార్థులు బాగా చదువుకోవాలని ప్రోత్సహిస్తూ రెసిడెన్సీయల్ గురుకులాలను ఏర్పాటు చేసి అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుందన్నారు. విద్యార్థులు ఎలాంటి అవకాశాలు వచ్చిన అందిపుచ్చుకొని ఉన్నతంగా ఎదగాలని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు మార్కుల కోసం కాకుండా జ్ఞానాన్ని పెంచుకునేలా చదవాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు కలిగి ఉండాలని, అర్హత కలిగి ఓటు హక్కు లేని వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షీయల్ ఎడ్యూకేషనల్ ఇనిస్ట్రూషన్ సెక్రటరీ ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో విజయవంతంగా కొనసాగుతున్నాయని ఎంతో మంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తూ స్థిర పడుతున్నారని అన్నారు. అనంతరం కళాశాలలో చదువుతూ వివిధ జిల్లా రాష్ట్ర, జాతీయ స్థాయిలో సంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు, చదువు, వ్యాస రచన, ఉపన్యాస పోటీలలో పాల్గొని ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు, సీల్డ్‌లు అందజేశారు. అనంతరం విద్యార్థినీలు ప్రదర్శించిన నృత్యాలు అందరిని అకట్టుకున్నారు. కార్యక్రమంలో జిల్లా ఖజానా అధికారి సరోజ, జిల్లా కన్వీనర్ చంద్రమోహన్ గౌడ్, జిల్లా కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.