అదిలాబాద్

ఎన్నికల్లో సెక్టోరియల్ పాత్ర కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, మార్చి 13: పార్లమెంట్ ఎన్నికల్లో ఈవీఎంలు, వీవీ ప్యాడ్‌లను పోలింగ్ కేంద్రాల్లో సమకూర్చి విద్యుత్, తాగునీరు, వౌలిక సదుపాయాలు కల్పించాల్సిన కీలక బాధ్యత సెక్టోరియల్ అధికారులపై ఉందని ఆదిలాబాద్ జిల్లా రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ దివ్య అన్నారు. బుధవారం లోక్‌సభ ఎన్నికల నిర్వహణలో సెక్టోరియల్ అధికారుల పాత్ర, వారి విధి విధానాలపై దివ్య సమీక్షించారు. పోలింగ్ కేంద్రాలను సందర్శించి ప్రతి పోలింగ్ కేంద్రంలో తప్పనిసరిగా నెంబర్లు వేసి విద్యుత్ సరఫరా సమకూర్చాలన్నారు.
నీటి సరఫరా లేకపోతే వెంటనే పునరుద్ధరించాలని ఆదేశించారు. నిర్ణీత ప్రొఫార్మలో పోలింగ్ కేంద్రాల సమస్యల గురించి తనకు వెంటనే నివేదించాలని సూచించారు. ఆయా పోలింగ్ కేంద్రాల పరిధిలో గతంలో జరిగిన సంఘటనలు, బైండోవర్ వివరాలను స్థానిక పోలీసు అధికారులను సంప్రదించి తెలుసుకోవాలన్నారు. ప్రతి ఒక్క అంశాన్ని వౌలిక సదుపాయాల ప్రో ఫార్మతో పాటు ఫోటోలు సేకరించాలని సూచించారు. ఎన్నికల సమయంలో ఈవీఎం, వీవీ ప్యాడ్, బ్యాలెట్ సామాగ్రి, కంట్రోల్ యూనిట్లకు సంబంధించి పోలీసు సిబ్బందికి అవగాహన కల్పించేలా సెక్టోరియల్ అధికారులు కీలక పాత్ర పోషించాలని అన్నారు. ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి కృష్ణ ఆదిత్య మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాలపై సిబ్బంది క్షేత్ర పరిశీలన చేయాల్సిన అవసరం ఉందన్నారు.
వేసవి కాలంలో అనేక సమస్యలు వెంటాడే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో నెంబరింగ్ జరిగిందా లేదా అన్న విషయాలపై సంబంధిత అధికారులతో చర్చించుకోవాలన్నారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ సంధ్యారాణి మాట్లాడుతూ ఈవీ ఎం, వీవీ ప్యాడ్‌ల వినియోగంలో అప్రమత్తంగా ఉండేలా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించాలన్నారు. ఇందుకోసం మెరుగైన శిక్షణ త్వరలో ఇస్తామని అన్నారు. ఈ సమావేశంలో ఆర్డీవో సూర్యనారాయణ, డీఈవో రవీందర్ రెడ్డి, ఏఆర్‌వోలు పాల్గొన్నారు.

వేడెక్కిన మండలి సంగ్రామం
* ఉమ్మడి జిల్లాలో అభ్యర్థుల హోరాహోరీగా ప్రచారం
* విందులు, తాయిలాలతో ఓటర్లకు గాలం
ఆంధ్రభూమి బ్యూరో
ఆదిలాబాద్, మార్చి 13: లోక్‌సభ ఎన్నికలకు ముందే మండలి పోరు తెరపైకి రావడంతో ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారపర్వంతో హోరెత్తిస్తున్నారు. నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగియడంతోనే బరిలో నిలిచిన అభ్యర్థులు ఎమ్మెల్సీ విజయమే లక్ష్యంగా వ్యూహత్మకంగా ముందుకు సాగుతూ సుడిగాలి ప్రచారాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈనెల 22న జరిగే శాసన మండలి ఎన్నికల్లో భాగంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బరిలో ఏడుగురు పోటీ చేస్తుండగా మరోవైపు పట్ట్భద్రుల నియోజకవర్గం నుండి 17 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కరీంనగర్ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల పరిధిలో 37,333 మంది పట్ట్భద్రుల ఓటర్లు ఉండగా ఉపాధ్యాయుల నియోజకవర్గంలో 5134 మంది ఓటర్లు ఉన్నారు. పట్ట్భద్రుల బరిలో 17 మంది పోటీ చేస్తున్న నేపథ్యంలో ప్రచారం రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతుంది. సామాజిక అంశాలు, నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన, ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం, పదోన్నతులు తదితర అంశాలను ప్రస్తావిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. అధికార టీ ఆర్ ఎస్ పార్టీ పట్ట్భద్రుల శాసన మండలి బరిలో నిలిచిన చంద్రశేఖర్ గౌడ్‌కు మద్దతు ఇవ్వడంతో ప్రచారానికి రాజకీయ రంగు పులుముకుంది. బుధవారం చంద్రశేఖర్ గౌడ్ నిర్మల్ జిల్లాలో విస్తృతంగా పర్యటించి టీఆర్‌ఎస్ నేతల మద్దతు కూడగట్టుకుంటూ ప్రచారం నిర్వహించారు. అనంతరం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కలిసి మద్దతు కోరారు. మరోవైపు కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి టి.జీవన్ రెడ్డి ఇది వరకే ఉమ్మడి జిల్లాలో రెండు సార్లు పర్యటించి మండలిలో ప్రశ్నించే గొంతుక కోసం, సమస్యల పరిష్కారం కోసం విద్యావంతుడిగా రాజకీయ అనుభవం ఉన్న తనకు ఓటేసి గెలిపించాలని సభలు, సమావేశాలు పెడుతూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నేతల మద్దతుతో జీవన్ రెడ్డి (మిగతా 3వ పేజీలో)

మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగాలి

ముధోల్, మార్చి 13: స్వయం సహాయక సంఘాల సభ్యులు ప్రస్తుతం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రుణాలను సద్వినియోగం చేసుకుని వ్యాపారవేత్తలుగా ఎదగాలని డీఆర్‌డీవో వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం నియోజకవర్గ కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో స్వయం సహయ సంఘాల సభ్యులు తయారుచేసిన నిర్మల్ ఫీనాయిల్ విక్రయ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ స్వయం సంఘాల నుండి ఎంపికచేసిన సభ్యులకు హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ఫీనాయిల్ తయారీపై శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. స్వయం సహయక సంఘాల సభ్యులు రమాదేవి, ఫాతిమా, మమత శిక్షణ అనంతరం స్థానికంగా ఫీనాయిల్‌ను తయారు చేశారన్నా రు. సంఘాలకు స్ర్తినిధి, సంఘాల నుండి తక్కువ వడ్డీకి రుణాలు పంపిణీ చేశామన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం చేయూత అందిస్తుందన్నారు. మహిళలు రుణాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మహిళ సంఘాల సభ్యులు తయారు చేసిన ఫీనాయిల్ రూ.45కు విక్రయిస్తారన్నారు. మహిళలు సంఘాల నుండి తీసుకున్న రుణాలతో పేపర్ బ్యాగ్‌లు, ఆకులతో ఇస్తరిలు, కుట్టుమీషన్‌ల ద్వారా ఉపాధి పొందుతూ ఇతరులకు పని కల్పించే దిశగా అడుగులు వేయాలని అన్నారు. వాతావరణ కాలుష్యనికి ప్రమాదకరిగా మారిని ప్లాస్టిక్ నివారణలో భాగంగా జిల్లా కలెక్టర్ పేపర్ బ్యాగుల తయారిని ప్రోత్సహించాలని అదేశించినట్లు పేర్కొన్నారు. జిల్లాలోని స్వయం సహయక సంఘాల సభ్యులు ప్రస్తుతం 200కోట్ల రుణాల రూపంలో (మిగతా 3వ పేజీలో)

అంగరంగ వైభవంగా
శనీశ్వరుని విగ్రహ ప్రతిష్ఠ
* భీంపూర్‌లో ఉప్పొంగిన భక్తిపారవశ్యం
* పాల్గొన్న ఎంపీ నగేష్, ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు
నార్నూర్, మార్చి 13: మండలంలోని భీంపూర్ గ్రామంలో శనీశ్వరుని విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవ కార్యక్రమం బుధవారం భక్తిశ్రద్ధల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. మూడు రోజుల పాటు పురోహితులు ప్రత్యేక పూజలు, యజ్ఞ కార్యక్రమాలు చేపట్టగా బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించి శాస్త్రోక్తంగా శనీశ్వరుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి మండలంలోని ఆయా గ్రామాల నుండి భక్తులు పెద్దసంఖ్యలో ఆలయానికి తరలివచ్చి శనిదేవున్ని దర్శించుకున్నారు. ఎంపి గెడం నగేష్, మాజీ ఎంపీ రాథోడ్ రమేష్, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, మాజీ ఎమ్మెల్యే కోవలక్ష్మితోపాటు పలువురు ప్రముఖులు విగ్రహా ప్రతిష్ఠాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమర్‌ఘడ్ పీఠాధిపతి శ్రీ సంత్ శివ చరణ్ మహారాజ్ భక్తులనుద్దేశించి ప్రసంగిస్తూ మారుమూల గిరిజన గ్రామాల్లో ఆధ్యాత్మిక చింతన పెంపొందిందచే దిశగా (మిగతా 3వ పేజీలో)
అపరిశుభ్రంగా బాసర గోదావరి ఘాట్లు
* పుణ్యస్నానాలకు భక్తుల ఇక్కట్లు
* పట్టించుకోని అధికారులు
బాసర, మార్చి 13: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర గోదావరి తీరం ఘాట్లు వేసవికి ముందే అపరిశుభ్రంగా మారాయి. ఆలయ అధికారుల నిర్లక్ష్యం భక్తులకు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. రాష్ట్రంలోని సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు మొదటగా గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం అమ్మవారి దర్శనానికి, అక్షరాభ్యాస పూజలకు బయలుదేరుతారు. కానీ బాసర గోదావరి తీరం వద్ద ఘాట్ల పరిసరాలలో అందుబాటులో నీరు లేకపోవడంతో భక్తులు పుణ్య స్నానాలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
* అపరిశుభ్రంగా గోదావరి ఘాట్లు
గోదావరి తీరం మొదటి ఘాట్ వద్ద పుణ్యస్నానాలకు వెళ్లే భక్తులకు మురుగునీరే స్వాగతం పలుకుతుంది. మొదటి ఘాట్ వద్ద అపరిశుభ్రమైన నీటిలోనే భక్తులు పుణ్యస్నానాలు చేస్తున్నారు. దీంతో పలువురు భక్తులు మాట్లాడుతూ పుణ్యస్నానాలకు వెళ్తే రోగాలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ఆలయ అధికారులు స్పందించి 1వ ఘాట్ వద్ద పరిసర ప్రాంతాలు శుభ్రపర్చేలా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. గోదావరి ఘాట్లు చెత్తా చెదారంతో అపరిశుభ్రంగా మారాయి. పుణ్యస్నానాలకు వెళ్లే వారికి గుడ్డలు, చెత్తచెదారం దర్శనమిస్తున్నాయి.
* షెవర్ జల్లులు ఏర్పాటుచేయాలి
వేసవి ఎండలను దృష్టిలో ఉంచుకుని గోదావరి మొదటి ఘాట్ పరిసరాలలో షెవర్ జల్లులు ఏర్పాటుచేస్తే భక్తులకు ఇబ్బందులు తొలిగే అవకాశం ఉంటుంది. మహిళలు, వృద్దులు పుణ్యస్నానాలు ఆచరించాలంటే గోదావరి నది గర్భంలోకి వెళ్లి పుణ్యస్నానాలు ఆచరించాల్సి వస్తుంది. అధఙకారులు ముందస్తు చర్యలు తీసుకుని సజ్జనులు ఏర్పాటుచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
బాధ్యతలు స్వీకరించిన డీఎస్పీ డేవిడ్
ఉట్నూరు, మార్చి 13: ఉట్నూరు సబ్ డివిజన్ పోలీసు అధికారిగా డేవిడ్ ఏసుదాస్ బుధవారం బదిలీపై వెళ్తున్న డీఎస్పీ వెంకటేష్ నుండి బాధ్యతలు స్వీకరించారు. ఈ సంధర్భంగా పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం డేవిడ్ ఏసుదాస్ మాట్లాడుతూ ఉట్నూరు సబ్ డివిజన్ పరిధిలో శాంతిభద్రతలు కాపాడేందుకు సంఘ వ్యతిరేక శక్తులపై కఠినంగా వ్యవహరిస్తామని ఆయన తెలిపారు.
1991వ బ్యాచ్‌కు చెందిన తాను ఎస్సైగా ఉట్నూరు పోలీసు స్టేషన్‌లోనే విధుల్లో చేరానని, ఏజెన్సీలో వాతావరణంపై పూర్తి అవగాహన ఉందన్నారు. చెన్నూరు రూరల్ సిఐగా, కరీంనగర్ సిఐగా పనిచేశానన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పనిచేసిన అనుభవం తనకు ఉండడంతో ఈ ప్రాంతంలోని సమస్యలు తనకు తెలుసని, వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో సిఐ వినోద్ కుమార్, ఉట్నూరు, ఇంద్రవెల్లి ఎస్సైలు అనిల్‌కుమార్, గంగారం, జగన్మోహన్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ప్రమాదవశాత్తు కారు దగ్ధం
ఇచ్చోడ, మార్చి 13: నేరడిగొండ మండలంలోని బోరిగామ గ్రామ సమీపంలో 44వ జాతీయ రహదారిపై నిర్మల్ నుండి ఆదిలాబాద్ వైపు వెళ్తున్న కారుకు ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని దగ్ధమైంది. ఏపి 15ఏకె 0456 నెంబర్ గల కారు నిర్మల్ నుండి ఆదిలాబాద్ వెళ్తుండగా ఆకస్మాత్తుగా కారు నుండి మంటలు చెలరేగడంతో డ్రైవర్ ఇజాజ్ కారులో ప్రయాణిస్తున్న కుటుంబ సభ్యులను వెంటనే దింపి వేయడంతో భారీ ప్రమాదం త్రుటిలో తప్పింది. డ్రైవర్ 100కు సమాచారం అందించగా అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్ళి మంటలను ఆర్పివేశారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.

జిల్లాలో పెరిగిన పోలింగ్ బూత్‌లు

ఆసిఫాబాద్, మార్చి 13: ఎప్రిల్ 11న జరిగే పార్లమెంటు ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సర్వసన్నద్ధమైంది. ఎన్నికలను అత్యంత పకడ్బందీగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు నేతృత్వంలో ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో చోటు చేసుకున్న చిన్న చిన్న పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందుకోసం జిల్లా లో అదనంగా మరో 51 పోలింగ్ బూత్‌లను అదనంగా ఈ ఎన్నికల్లో ఏర్పాటు చేస్తున్నట్లు ఇటీవల కలెక్టర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో చాలా గ్రామాల ఓటర్లకు దూరభారం తగ్గినకాలంలో ఓటు హక్కు వినియోగించుకునే వీలుంది. జిల్లాలోని ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గంలో 4.01.106 ఓటర్లు, ఆసిఫాబాద్‌లో 1.98.526మంది, సిర్పూర్ నియోజక వర్గంలో 2.02.580మంది ఓటర్లు ఉండ గా, మహిళ ఓటర్లు 100.471, పురుష ఓటర్లు 1.02.106మంది, ఇతరులు ముగ్గురు ఉన్నారు. జిల్లాలో 583 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నా రు. ఆసిఫాబాద్ నియోజక వర్గం లో 283, సిర్పూర్‌లో 300పోలింగ్ కేంద్రా లు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
సమస్యాత్మక కేంద్రాలపై దృష్టి
జిల్లాలోని సమస్యాత్మ, మావోయిస్టు ప్రభావిత కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించారు. అడువుల ప్రాంతమైన కుమరంభీం జిల్లా మొదటి నుండి మావోయిస్టు కార్యకలాపాలకు పెట్టింది పేరు. ఇటీవలిలో మావోయిస్టులు ఉనికి కోల్పోయినప్పటికి పొరుగున ఉన్న మహారాష్టల్రో ఇంకా ఈ సంస్థ కార్య కలాపాలు ముమ్మరంగా సాగుతున్నా యి. మావోలు ఉనికిని చాటుకునేందుకుయత్నించే అవకాశాలుండ వచ్చనే ముందస్తు జాగ్రత్తలో పోలీసులు జిల్లాలో 73 మావోయిస్టు సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పా ట్లు చేస్తున్నారు. 120 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపైనా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈకేంద్రాల్లో పోలింగ్ సజావుగా నిర్వహించడంతోపాటు, ఇవిఎం మిషన్లు సకాలంలో కేంద్రాలకు చేర్చడం, ఎన్నికల అనంతరం తిరిగి వీటిని క్షేమంగా స్ట్రాంగ్ రూంలకు తరలించాల్సి ఉంది.