అదిలాబాద్

ఆరో రోజూ.. అదే జోరు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, అక్టోబర్ 10: ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె రోజు రోజుకు జోరందుకుంటోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, న్యాయపరమైన 26 డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గత ఆరు రోజులుగా కొనసాగుతున్న సమ్మెకు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో పాటు రాజకీయ పార్టీల నేతలు మద్దతు పలికారు. గురువారం ఆదిలాబాద్‌లో డిపో నుండి బస్టాండ్ మీదుగా జెఏసి అధ్వర్యంలో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత మద్దతు పలికి ప్రభుత్వం వెంటనే కార్మిక సంఘాల నేతలను చర్చలకు పిలిచి పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ మొండి వైఖరి విడనాడాలని సూచించారు. బిజెపి రాష్ట్ర నాయకురాలు చిట్యాల సుహాసిని సైతం ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు ప్రకటిస్తూ అందోళనకు సంఘీభావం తెలిపారు. ముఖ్యమంత్రి నియంత్రృత్వ విధానాల వల్లే ఆర్టీసీలో ప్రతిష్టంభన నెలకొందని, పండగ వేళ ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇదిలా ఉంటే నిర్మల్‌లో కార్మిక జె ఏసి అధ్వర్యంలో ఆర్టీసీ డిపో నుండి బస్టాండ్ వరకు సాగిన నిరసన ర్యాలీ ఉద్రిక్తలకు దారితీసింది. ముఖ్యమంత్రి కెసిఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రహదారిపై అందోళన చేయడంతో కార్మిక సంఘాల నేతలతో పాటు బిజెపి జిల్లా నాయకులు రావుల రాంనాథ్, అయ్యన్నగారి భూమయ్యలతో పాటు జె ఏసి నేతలను పోలీసులు అరెస్ట్ చేసి సాయంత్రం వదిలిపెట్టారు. జె ఏసి కార్మిక సంఘాలకు మద్దతుగా భైంసాలో కార్మికుల నిరసన ర్యాలీ కొనసాగింది. ఇందుకు కాంగ్రెస్ నాయకులు మద్దతు పలకగా వారిని పోలీసులు అరెస్ట్ చేసి వదిలిపెట్టారు. మరోవైపు ఆసిఫాబాద్ డివిజన్ కేంద్రంలో జరిగిన అందోళన కార్యక్రమంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు, కార్మిక సంఘాల ట్రేడ్ యూనియన్ నేతలు మద్దతు ప్రకటించారు. ఇదిలా ఉంటే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని ఆదిలాబాద్, నిర్మల్, భైంసా, ఉట్నూర్, మంచిర్యాల, ఆసిఫాబాద్ డిపోల పరిధిలో ప్రయాణికులపై చార్జీల భారం మోపుతూ రెట్టింపు చార్జీలను వసూలు చేస్తుండడం చర్చనీయంశంగా మారింది. బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేయాలని ఆసిఫాబాద్ ఎస్పీ సూచించడంతో పలు చోట్ల తనిఖీలు ముమ్మరం చేశారు. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్ల ఆగడాలను నియంత్రించేందుకు ప్రత్యేకంగా కంట్రోల్ మిషన్లను ఏర్పాటు చేశామని, బస్సులలో ధర సూచికలను కూడా ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ ఆర్‌ఎం విజయ భాస్కర్ ఆంధ్రభూమికి వివరించారు. రీజియన్ పరిధిలో గురువారం ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్, ఉట్నూరు డిపోల పరిధిలో 148 బస్సులకు గాను 91 బస్సులు రోడ్డెక్కగా భైంసా డిపోలో 82 బస్సులకు గాను 56 బస్సులు, నిర్మల్ డిపోలో 135 బస్సులకు గాను 94 బస్సులు, ఆసిఫాబాద్ డిపోలో 66 బస్సులకు గాను 37 బస్సులు, మంచిర్యాల డిపో పరిధిలో 127 బస్సులకు గాను 82 బస్సులు నడిచినట్లు ఆర్ ఎం విజయభాస్కర్ వివరించారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని ఆర్టీసీ రీజియన్ వ్యాప్తంగా గురువారం 559 బస్సులకు గాను 360 బస్సులు అంటే 60 శాతంపైనే బస్సులు వివిధ రూట్లలో నడిచాయని, ఇప్పటి వరకు సమ్మె ప్రశాంతంగానే సాగుతుందని, ప్రయాణికులకు ఇబ్బందులు కల్గకుండా చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు.

ఆర్టీసీ కార్మికుల వినూత్న నిరసనలు
ఉట్నూరు,అక్టోబర్ 10: ఆర్టీసీ కార్మికుల సమ్మె గురువారం నాటికి 6వ రోజుకు చేరుకోగా వినూత్నంగా నిరసనలు తెలిపారు. ఆర్టీసీ కార్మికులతో కలిసి ప్రజా సంఘాల నాయకులు, వివిధ ఉపధ్యాయ, ఉద్యోగ సంఘాల నాయకులు మద్దతు పలకగా ఐబి చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించి నిరసనలు తెలిపారు. అదే విధంగా బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సంధర్భంగా పలువురు మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రకారం అధికారంలోకి వచ్చిన కెసిఆర్‌కు కనువిప్పు కలిగేలా చూడాలంటూ అంబేద్కర్ విగ్రహానికి విన్నవించుకున్నారు. అదే విధంగా న్యాయపరమైన హక్కుల కోసం ప్రబుత్వానికి విజ్ఞప్తి చేయగా నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడంతో పాటు ముఖ్యమంత్రి కెసిఆర్ హిట్లర్‌లా ప్రవర్తిస్తున్నారని అన్నారు. ఆర్టీసీ కార్మికులను డిస్మిస్ చేసినట్లయితే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు. వీరికి పిఆర్‌టియూ సంఘం నాయకులు మద్దతు పలికారు.

కార్మిక హక్కులను కాలరాస్తున్న కేసీఆర్
రాష్టవ్య్రాప్త ఆందోళనకు ఏఐవైఎఫ్ పిలుపు.. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో సర్కార్ దిష్టిబొమ్మ దగ్ధం
ఆదిలాబాద్ టౌన్, అక్టోబర్ 10: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఆర్టీసీ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కార్మికుల హక్కులను కాలరాస్తుందని ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్ అన్నారు. గురువారం అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) ఆదిలాబాద్ జిల్లా 2వ నిర్మాణ మహాసభలు స్థానిక కార్మిక భవన్‌లో చిర్రా దేవెందర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ మాట్లాడుతూ ఆర్టీసీ నష్టాలకు యాజమాన్యాలే కారణమంటూ ప్రభుత్వం చేతులు దులుపుకుంటుందని, కార్మికుల వౌలిక సమస్యలు పట్టించుకోకుండా నిర్లక్ష్యవైఖరిని అవలంభిస్తుందని అన్నారు. కార్మికులకు ఉద్యోగ భధ్రత కల్పించాలని, ఆర్టీసీకి పూర్తిస్థాయి మేనేజింగ్ డైరెక్టర్‌ను నియమించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా పలు న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా అందోళనలు చేపడుతామని హెచ్చరించారు. నష్టాల నుండి ఆర్టీసీని కాపాడేందుకు తక్షణమే ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలన్నారు. ఈ సమావేశంలో జాషువా శ్రీకర్, ప్రసాద్ శ్రీను, రాజు, మహేష్, దేవెందర్, రాజు తదితరులు పాల్గొన్నారు.
మద్దతుగా సర్కారు దిష్టిబొమ్మ దగ్ధం
ఆర్టీసీ కార్మికుల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ గురువారం ఆదిలాబాద్‌లోని తెలంగాణ చౌక్‌లో స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ) అధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్దం చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు ఆత్రం నగేష్ మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మెకు ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ జిల్లా కమిటీ పూర్తి మద్దతు తెలుపుతుందన్నారు. కార్మికులు సమ్మె చేస్తున్నప్పటికీ పట్టించుకోకపోవడం సి ఎం కెసి ఆర్ నిరంకుష పాలనకు అద్దం పడుతుందని అన్నారు. ఆర్టీసీ కార్మికులను తొలగిస్తామని బెదిరించడం రాజ్యాంగ విరుద్దమని, ఇది మరో నక్సలిజం పరిపాలనకు దారితీస్తుందన్నారు. కార్మికులు న్యాయపరమైన డిమాండ్లను అడగడంలో తప్పేముందని ప్రశ్నించారు. కండక్టర్లు, డ్రైవర్లకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ పట్టణ కార్యదర్శి కపిల్, డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు దిలీప్, డివైఎఫ్‌ఐ కార్యదర్శి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా సీపీఐ ధర్నా
శ్రీరాంపూర్ రూరల్ అక్టోబర్ 10: తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా గురువారం సిపిఐ దాని అనుబంధ సంఘాలైన ఏఐటీయూసీ, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో సీసీసీ కార్నర్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. దాదాపు గంట పాటు జాతీయ రహాదారిపై రాస్తారోకో నిర్వహించి వాహానాలను స్థంభింపజేశారు. ఈ సందర్భంగా సిపి ఐ జిల్లా కార్యదర్శి కలవేణి శంకర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారంకోసం పోరాడే హక్కు కార్మికులు ఉంటుందని వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వలపై ఉందన్నారు. సమ్మెను అణి వేస్తామని పాలకులు బహిరంగంగా ప్రకటించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ నియంతృత్వ ధోరణి మానుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తెలంగాణ ఉధ్యమంలో కీలక పాత్ర పొసించారని,సింగరేణి,ఆర్టీసీ కార్మికులు తెలంగాణ కళ సఫలం కావాడానికి కారణమన్నారు.నేడు స్వరాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల న్యాయమైన పోరాటాన్ని ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించి 48000 మంది కార్మికుల జీవితాలతో చెలగాటముడుతూ నిరుద్యోగు యువతకు ఆశలు కల్పిస్తూ తాత్కాలిక ఉద్యోగులు నియమిస్తూ కార్మి జే ఏ సి సమ్మెను విచ్చిన్నం చేస్తుందని సింగరేణిలో పని చేస్తున్న ఉద్యోగులను డిపిటేషన్‌పై తీసుకు వచ్చి పని చేయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.ఆర్టీసీ కార్మికులకు బదులుగా సింగరేణి ఉద్యోగులును పంపించడంపై అన్ని కార్మిక,ప్రజా సంఘాలు ఐక్యంగా మరో సకల జనుల సమ్మె సిద్దం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి జోగుల మల్లయ్య, సహాయ కార్యదర్శి రేగుంట చంద్రశేఖర్,ఏ ఐటీయూసీ కేంద్ర కార్యదర్శి ముస్కె సమ్మయ్య, డిప్యూటీ కార్యదర్శి ఎస్‌కే బాజీ సైదా,బ్రాంచి కార్యదర్శి ల్యాగల శ్రీనివాస్, కొట్టె కిషన్‌రావు, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి లింగం రవి, జిల్లా సమితి సభ్యులు రాజేశ్వర్‌రావు, జిల్లా నాయకులు నర్సింగ్, ఏ ఐవై ఎప్ మండల కార్యదర్శి రాగిడి రాజు, పూలక్క, బత్తుల మల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.