అదిలాబాద్

ప్రజావాణి దరఖాస్తులపై ప్రత్యేక దృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, మే 9: డయల్ యువర్ కలెక్టర్, ప్రజావాణి ద్వారా అందిన ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచకుండా సత్వర పరిష్కారం కోసం అధికారులు ప్రత్యేక దృష్టిసారించాలని జిల్లా కలెక్టర్ జగన్మోహన్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం ఏర్పాటు చేయగా కలెక్టర్ హాజరై ఆర్జీదారుల నుండి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సంధర్భంగా జిల్లా నలుమూలల నుండి వచ్చిన ఆర్జీదారులు కలెక్టర్‌కు తమ సమస్యలను వివరిస్తూ దరఖాస్తులు సమర్పించారు. కాగా ముందుగా డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం నిర్వహించగా జిల్లాలో పలు ప్రాంతాల నుండి ఆర్జీదారులు ఫోన్‌ద్వారా కలెక్టర్‌కు సమస్యలను వివరించారు. అనంతరం కలెక్టర్ జగన్మోహన్ మాట్లాడుతూ ప్రజావాణి, డయల్‌యువర్ కలెక్టర్ కార్యక్రమాల ద్వారా అందిన ఫిర్యాదులపై అధికారులు ప్రత్యేక దృష్టిసారించి, సత్వర పరిష్కారం కోసం కృషిచేయాలని, ఆర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించే అధికారులకు షోకాజు నోటీసులు జారీ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. అధికారులు పారదర్శకంగా జవాబుదారితనంతో ప్రజల సమస్యలు పరిష్కరించినట్లయితే ప్రజల్లో అధికారులపై నమ్మకం పెరుగుతుందని అన్నారు. ఈ సంధర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి శాఖల వారీగా గత వారం నాటికి అందిన ఫిర్యాదుల్లో ఇప్పటి వరకు పరిష్కరించబడినవి, పెండింగ్‌లో ఉన్న ఆర్జీలపై సంబంధిత శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్‌లో ఉన్నవాటిని వచ్చే వారం నాటికి పూర్తిచేయాలని, లేనట్లయితే శాఖపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి సంజీవరెడ్డి, సిపివో కేశవ్‌రావు, జిల్లా పరిషత్ సిఈవో జితేందర్ రెడ్డి, దళిత శాఖ డిడి జెమ్స్ కల్వల, జిల్లా పంచాయతీ అధికారి పోచయ్య, డ్వామా పిడి శ్రీనివాస్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ మల్లేష్‌గౌడ్, కలెక్టరేట్ ఏవో అరవిందకుమార్, అధికారులు పాల్గొన్నారు.
కమ్యూనిటీహాల్‌కు
భూమి పూజ చేసిన ఎమ్మెల్యే
ఇచ్చోడ, మే 9: మండలంలోని పొన్న గ్రామపంచాయతీ పరిధిలో గల రాయిగూడ గ్రామంలో సోమవారం కమ్యూనిటిహాల్‌కు బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు భూమి పూజ చేశారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కమ్యూనిటిహాల్ నిర్మాణానికి రూ.5లక్షల నిధులు మంజూరి చేయడం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ది కార్యక్రమాలతో పాటు ప్రజా సంక్షేమానికి కూడా పెద్దపీట వేస్తోందని ఆయన అన్నారు. మారుమూల గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యంతో పాటు వైద్య, ఆరోగ్యం, గిరిజనుల సంక్షేమానికి ఎన్నో అభివృద్ది కార్యక్రమాలను చేపడుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలను చూసి ఇతర పార్టీ నాయకులు తెరాస పార్టీ వైపు మొగ్గుచూపుతున్నారని అన్నారు. మిషన్ కాకతీయతో పాటు వాటర్‌గ్రీడ్, గిరిజనులకు కళ్యాణలక్ష్మి, ఆయా పాఠశాలల విద్యార్థులకు సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. రానున్న రోజుల్లో భూమి లేని గిరిజనులకు మూడెకరాల చొప్పున భూమిని కొనుగోలు చేసి పంపిణీ చేయడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. దీంతో పాటు డబుల్‌బెడ్‌రూం ఇండ్లను కూడా మంజూరి చేస్తోందని ఆయన అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్దికి పెద్దపీట వేయడమే కాకుండా ప్రత్యేకంగా గిరిజనుల కోసం అనేక కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గాడ్గె సుభాష్, పార్టీ నాయకులు మేరాజ్ ఆహ్మాద్, శ్రీనివాస్ రెడ్డి, అబ్దుల్ రషీద్, శంకర్, పొన్న గ్రామ సర్పంచ్ కిషన్ తదితరులు పాల్గొన్నారు.