అదిలాబాద్

చెక్ డ్యాం నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాసర, మే 13: భారీ నీటిపారుదలశాఖ మంత్రి టి.హరీష్‌రావు బాసర పర్యటనను దృష్టిలో ఉంచుకుని శుక్రవారం ముధోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి ఇరిగేషన్ అధికారులతో కలిసి బాసర గోదావరి నది తీరం వద్ద 26 కోట్ల 70 లక్షల రూపాయలతో చేపట్టే చెక్‌డ్యాం నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు, సలహాలను అందజేశారు. 350 మీటర్ల పొడవు, 5 మీటర్ల ఎత్తుతో 0.24 టి ఎంసి నీటి నిల్వ సామర్థ్యంతో చెక్‌డ్యాంను నిర్మాణం చేస్తున్నట్లు ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి పేర్కొన్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు, ట్రిపుల్ ఐటి యూనివర్సిటికి గ్రామస్తులకు అందుబాటులో ఉండే విధంగా భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఈ చెక్‌డ్యాం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెరాసా నాయకులు ఎన్.రామారావు, ఎంపిటిసి పోతన్న, ఇరిగేషన్ ఈ ఈ రామారావు, ఎస్ ఆర్ ఎస్పీ ఎస్ ఈ సత్యనారాయణ, ఎస్ ఆర్ ఎస్పీ సి ఈ నరేష్, ఎ ఈలు, బాసర రైతులు పాల్గొన్నారు.