అదిలాబాద్

భైంసా హత్యలకు పాల్పడ్డ నింధితులను త్వరలోనే పట్టుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్, మే 13: ఇటీవల భైంసా పట్టణంలో జరిగిన ఐదురుగు హత్యలకు సంబంధించిన సంఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని దీనికి కారకులైన నింధితులను త్వరలోనే పట్టుకుంటామని జిల్లా ఎస్పీ తరుణ్‌జోషి తెలిపారు. శుక్రవారం నిర్మల్ పట్టణ పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ పలు రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేశారు. అనంతరం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిర్మల్ డి ఎస్పీ మనోహర్‌రెడ్డి ఆధ్వర్యంలో గత కొంత కాలంగా నిర్మల్ పరిధిలో నేరాలు తగ్గుముఖం పట్టాయన్నారు. నేర ప్రవృత్తికి సంబంధించిన కేసుల్లో బాధితులతోపాటు సంఘటనకు కారకులైన వారికి ప్రత్యేకంగా కౌన్సిలింగ్ నిర్వహిస్తామన్నారు. కేవలం అరగంటలో ఐదుగురిని హత్యచేయడం వెనుక గల కారణాలను క్షుణ్ణంగా అనే్వషిస్తున్నామన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పకడ్భందీ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. హత్యల వెనుక అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశామని, ఆస్తి గొడవల వల్లే ఈ హత్యలు జరిగినట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చామన్నారు. నేరాలను తగ్గించేందుకు అన్నివిధాలుగా ప్రయత్నిస్తున్నామని, ఒకసారి తప్పుచేసిన వ్యక్తి మళ్లీ అదే తప్పును చేయకుండా సమాజంలో సత్ప్రవర్తనతో మెలిగేలా అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో డిఎస్పీ మనోహర్‌రెడ్డి, పట్టణ, గ్రామీణ సి ఐలు జీవన్‌రెడ్డి, పురుషోత్తమచారి, ఎస్సైలు సునీల్‌కుమార్, మల్లయ్య, చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు.