అదిలాబాద్

తుమ్మిడిహెట్టిపై అమాత్యులు మాటేమిటి..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కౌటాల, మే 15: అత్యంత భారీ ప్రాజెక్టుగా మొలకెత్తి ఆదిలోనే అంతరించిపోయే పరిస్థితుల్లో ఉన్న తుమ్మిడిహెట్టి (బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవేళ్ల సుజల స్రవంతి) ప్రాజెక్టు పరిస్థితి ఏంటన్న ప్రశ్నకు ప్రభుత్వమే సమాదానం చెప్పాల్సి ఉంది. గత యేడాది కాలంగా అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటూ ప్రాజెక్టు రీడిజైనింగ్‌లో కనీస ప్రాధాన్యం కూడా లభించని తుమ్మిడిహెట్టి ప్రాణహిత ప్రాజెక్టుకు సంబంధించి సోమవారం నియోజకవర్గంలో పర్యటించనున్న భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ నుండైనా సమాదానం లభిస్తుందా అన్నది నియోజకవర్గంలోని రైతులు గంపడాశలతో ఎదురు చూస్తున్న ప్రశ్నగా చెప్పవచ్చు. 2008లో బీ ఆర్ అంబేద్కర్ పేరిట సమైక్య రాష్ట్రంలోని తెలంగాణ పది జిల్లాలకు 16లక్షల ఎకరాల సాగునీరు, 130 గ్రామాలకు తాగునీరు, సికింద్రాబాద్, హైదరాబాద్ జంట నగరాలకు పారిశ్రామిక అవసరాల కోసం 10టీ ఎంసీల నీటి వినియోగం కోసం ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకోగా, మారిన పరిస్థితుల్లో అటు రాష్ట్రంలో రీ డిజైనింగ్ ముఖ్యమంత్రి చేపట్టారు. జిల్లాలో అన్ని విధాలా మేలు చేసేలా 2లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు సిద్దంగా ఉన్నామని పేర్కొంటున్నప్పటికీ దీనికి సరైన కార్యచరణ మాత్రం ప్రభుత్వం ఇప్పటికీ ప్రకటించకపోవడం తుమ్మిడి ప్రాజెక్టుపై మరిన్ని నీలిమేఘాలు కమ్ముకునేలా చేస్తోంది. గత సంవత్సరం జూలై 7వ తేదీన జిల్లా పర్యటనలో భాగంగా గూడెం ఎత్తిపోతలపథకం ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి కేసీ ఆర్ జిల్లా ప్రజలకు, రైతులకు మేలు చేసేలా గతంలో ప్రతిపాదించిన 56వేల ఎకరాలతోపాటు అదనంగా 1.50లక్షల ఎకరాలు అందిస్తామని పేర్కొనగా, ఇప్పటికీ ఆ దిశగా ప్రయత్నాలు సాగలేదు. తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం చర్చల్లో భాగంగా ఆ ప్రభు త్వం కోరినట్లు ఎటువంటి ఇబ్బంది లేకుండా 148మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మిస్తామని మన ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే వాస్తవానికి పరిస్థితిని గమనిస్తే గతంలో ప్రతిపాదించిన 152మీటర్లను కుదించి 148మీటర్లలో బ్యారేజీ నిర్మిస్తే కనీస నీటి తరలింపు అన్నది కూడా ఇబ్బందేనన్నది నిపుణుల వాధన.రెండున్నరేళ్లుగా కనీసం అడుగు ముందుకుపడని తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు పరిస్థితిపై భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న తన్నీరు హరీష్ రావు నేడు కాగజ్‌నగర్ సమీపంలో పర్యటిస్తున్న వేళ తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు పై ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయడంతో పాటు ఇదీ తుమ్మిడిహెట్టి పరిస్థితి అని చెప్పడంతో పాటు కనీసం రీడిజైనింగ్‌కోసం సర్వేలకోసమైనా ఆదేశాలివ్వకపోతారా అని స్థానిక రైతులు, ప్రజలు గంపెడాశలతో ఎదురు చూస్తున్నారు.