అదిలాబాద్

ఎస్‌బిహెచ్ ఉద్యోగుల నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్ టౌన్, మే 20: ఎస్‌బిహెచ్ బ్యాంక్‌ను ఎస్‌బిఐలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ ఒక రోజు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా శుక్రవారం ఆదిలాబాద్ ఎస్‌బిహెచ్ బ్యాంకు ఎదుట ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ బ్యాంకుల విలీనాన్ని తాము తప్పు పట్టడం లేదని, ఉద్యోగులు, కస్టమర్లకు ఎలాంటి ప్రకటన ఇవ్వకుండా బోర్డు ఆఫ్ మీటింగ్‌లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించడం సరికాదన్నారు. ఉద్యోగులను భాగస్వాములను చేయడంతో పాటు అందరి అభిప్రాయాల మేరకు విలీనం చేయాలి తప్పా బోర్డు సమావేశం ఏర్పాటు చేసి విలీనం చేస్తున్నామని చెప్పడం సమంజసం కాదన్నారు. నిరసన కార్యక్రమంలో ధర్మేందర్ సాహెబ్, అబ్దుల్, స్వరాజ్, గణపతి, భాష పాల్గొన్నారు.