అదిలాబాద్

కార్గిల్ అమరవీరులకు ఘనంగా నివాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్ టౌన్, డిసెంబర్ 28: కార్గిల్ యుద్ధంలో దేశ మాత రుణం తీర్చుకునేందుకు జవానులు పాకిస్తాన్‌పై విరోచితంగా పోరాడి అమరులయ్యారని, వారి త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచి ఉంటాయని కలెక్టర్ జగన్మోహన్ అన్నారు. ఈ సంధర్భంగా కలెక్టర్ జగన్మోహన్ మాట్లాడుతూ దేశ రక్షణలో భారత దేశ సైనికులు నిరంతరం సరిహద్దులో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ వారి కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ దేశప్రజలను ఎళ్లవేళల కాపాడుతున్నారన్నారు. అలాంటి సైనికుల కుటుంబాలకు ఎన్‌సిసి క్యాడెట్లు, ప్రజలు, యువతీ యువకులు ముందుండి దేశ సమగ్రతకు సహకారాన్ని అందించాలన్నారు. నలందా కళాశాల యాజమాన్యం ద్వారా ఎన్‌సిసి క్యాడెట్లుగా తీర్చిదిద్దుతున్న కళాశాల అధ్యక్ష, ఉపాధ్యక్షులను కలెక్టర్ అభినందించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆర్మీ కల్నల్ రవిచరణ్ మాట్లాడుతూ భారతదేశ సైనికులు వరుసగా నాలుగు యుద్ధాల్లో పాల్గొని విజయం సాధించారన్నారు. దేశరక్షణ కోసం ఆహర్నిశలు కష్టపడుతూ 1999లో పాకిస్తాన్, భారతదేశానికి జరిగిన కార్గిల్ యుద్దంలో భారత దేశం విజయం సాధించినప్పటికీ 520 మంది సైనికులు వీరమరణం పొందారన్నారు. వారి ఆత్మలకు శాంతి చేకూర్చడానికి వారిని గుర్తుచేసుకుంటూ ప్రతి సంవత్సరం డిసెంబర్ 28న ఘన నివాళులు అర్పించడం విజయ దివాస్ ప్రధాన ఉద్దేశమన్నారు. కార్యక్రమంలో ఎన్‌సిసి 32వ బెటాలియన్ కమాండెంట్ బల్వీందర్ సింగ్, నలందా కళాశాల అధ్యక్షులు పి.కిష్టు, ఉపాధ్యక్షుడు ఎ.విజయగోపాల్, ప్రిన్సిపాల్ కె.పున్నారావు, ఎన్‌సిసి క్యాడెట్లు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

పార్టీ బలోపేతానికి కృషి చేయాలి
బిజెపి జిల్లా ఇన్‌చార్జి మురళీధర్ గౌడ్

మంచిర్యాల, డిసెంబర్ 28: భారతీయ జనతా పార్టీ బలోపేతానికి ప్రతీ కార్యకర్త కృషి చేయాలని పార్టీ జిల్లా ఇంచార్జి మురళీధర్ గౌడ్ అన్నారు. సోమవారం పార్టీ కార్యలయంలో నిర్వహించిన జిల్లా సమావేశంలో అయన పాల్గొని మాట్లాడారు. జిల్లాలోని తూర్పు, పశ్చిమ జిల్లాలోని బూత్ కమిటిలను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలోని అన్ని నిమోజిక వర్గంలోని మండలాలో బూత్ కమిటిలు వేయనున్నట్లు తెలిపారు. ఈనెల 31లోగా బూత్ కమిటీలను పూర్తి చేసుకోని జనవరి 1,2016న జిల్లా అధ్యక్షుని ఏన్నుకోవడం జరుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం తీరు ఎండగడుతూ గత పాలనలో కాంగ్రెస్ పార్టీ కుటిల నైతిక రాజకీయలను ఎండగడుతూ ముందుకు సాగుతామన్నారు. దేశంలో బిజెపి చేస్తున్న అభివృద్ధి పనులను ఓర్వలేక పార్టీ పై లేనిపోని అరోపణలు చేస్తున్నారు. ప్రధాని మోదీ శత్రు దేశాన్ని మిత్రదేశంగా మలుచుకోని పాలనను అందిస్తున్నారిని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమాలోచన కమిటీ ఉపాధ్యక్షులు గోనే శ్యాంసుందర్‌రావు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మల్లారెడ్డి పట్టణ అధ్యక్షులు పూసాల వెంకన్న, నాయకులు అమిరిశెట్టి మల్లేష్, మధు, వెంకటేశ్‌గౌడ్, శశి, తదితరులు పాల్గొన్నారు.