అదిలాబాద్

జిల్లాను కరవు ప్రాంతంగా ప్రకటించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్ టౌన్, మే 20: ఆదిలాబాద్ జిల్లాను కరవు ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఎఐఎంకెఎస్, సిపిఐఎంఎల్ అధ్వర్యంలో ఈనెల 25న హైదరాబాద్‌లోని ఇందిరా పార్కువద్ద చేపట్టే ధర్నాను విజయవంతం చేయాలని అఖిల భారతీయ రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు నంది రామయ్య అన్నారు. శుక్రవారం స్థానిక ప్రింట్‌మీడియా ప్రెస్‌క్లబ్‌లో ధర్నాకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో తీవ్ర కరవు నెలకొనప్పటికీ ప్రభుత్వం జిల్లాను కరవు ప్రాంతంగా ప్రకటించకపోవడం సరికాదన్నారు. ఇప్పటికే ఎందరో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, వారి కుటుంబాలను సైతం ప్రభుత్వం ఆదుకోలేదన్నారు. వెంటనే కరవు నివారణకై జిల్లాకు 5వేల కోట్ల నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పశుగ్రాసంతో పాటు చౌకధరల దుకాణాల్లో 50కిలోల చొప్పున బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేయాలన్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతన్నను ఆదుకోవడానికి తక్షణమే ప్రభుత్వం పూర్తిస్థాయిలో రుణమాఫీ చేసి ఖరీఫ్ సాగుకు ముందే కొత్త రుణాలను మంజూరు చేయాలన్నారు. అప్పుల బాధలతో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.6లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలన్నారు. ఉపాధి హామీ కింద ప్రతి గ్రామంలో కూలీలకు ప్రతిరోజు పనికల్పించడంతోపాటు రోజుకు రూ.200 చొప్పున వేతనం ఇవ్వాలన్నారు. ఈ డిమాండ్ల సాధనకై ఈనెల 25న చేపట్టే మహాధర్నాకు రైతులు, మేధావులు, రైతు సంఘం సభ్యులు, పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో ఏఐకెఎంఎస్ జిల్లా సహాయ కార్యదర్శి కె.సర్దార్, పార్టీ పట్టణ నాయకులు బి.వెంకట్, కుంజారాం, విజయ్ పాల్గొన్నారు.