అదిలాబాద్

ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన విక్రమ్ జిత్ దుగ్గల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, మే 27: జిల్లా నూతన ఎస్పీగా విక్రమ్ జిత్ దుగ్గల్ శుక్రవారం లాంఛనంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. జిల్లా ఎస్పీగా 18 నెలల పాటు పనిచేసిన తరుణ్ జోషి గ్రేహాండ్స్ గ్రూప్ కమాండెంట్‌గా ఇటీవలే బదిలీకావడంతో కొత్తగా వచ్చిన ఎస్పీ విక్రమ్ జిత్ దుగ్గల్ ఉదయం 8 గంటలకు జిల్లా పోలీసు కార్యాలయంలో తరుణ్ జోషి నుండి పదవీ బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు సాయుధపోలీసుల గౌరవ వందనం స్వీకరించగా పాత ఎస్పీ జోషి జిల్లాలో శాంతిభద్రతలు, మావోయిస్టుల కదలికలు, సామాజిక పరిస్థితుల గురించి కొత్త ఎస్పీకి వివరించారు. ఈ సందర్భంగా ఎస్పీ దుగ్గల్‌కు జిల్లా పోలీసు అధికారులు ఘనంగా స్వాగతం పలికి పాత ఎస్పీగా పనిచేసిన జోషికి పుష్పగుచ్చాలతో వీడ్కోలు పలికారు. 2007 ఐపిఎస్ బ్యాచ్‌కు చెందిన విక్రమ్‌జిత్ దుగ్గల్ నల్గొండ ఎస్పీగా 13 నెలలు పనిచేసి ఇటీవల మాస్ బదిలీల్లో భాగంగా జిల్లాకు పోస్టింగ్‌పై వచ్చారు. కలెక్టర్‌ను కలిసిన కొత్త ఎస్పీ విక్రమ్ జిత్ దుగ్గల్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో వివిధ విభాగాలను, ఆయా సెక్షన్లను పరిశీలించి పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం నేరుగా కలెక్టర్ కార్యాలయం వెళ్ళి జిల్లా కలెక్టర్ జగన్మోహన్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకొని జిల్లా పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. జిల్లా పాలనయంత్రాంగం తరపున పూర్తి సహకారం అందిస్తామని కలెక్టర్ జగన్మోహన్ అన్నారు. కొత్త ఎస్పీకి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత అదనపు ఎస్పీ పి.పనసారెడ్డి, డిఎస్పీ లక్ష్మీనారాయణ, మనోహర్ రెడ్డి, రమణారెడ్డి, గుమ్మి చక్రవర్తి, అందె రాములు సీతారాములు, ఎస్‌బి ఇన్స్‌పెక్టర్ ప్రవీణ్, పోలీసు అసోసియేషన్ అధ్యక్షుడు బొర్లకుంట పోచలింగం, ప్రధాన కార్యదర్శి పోతారం శ్రీనివాస్, ఉపాధ్యక్షులు దేవిదాస్, ప్రతినిధులు తాజోద్దిన్, ఏంఏ కరీం, పెంచాల వెంకటేశ్వర్లు, ఏ ఎం రెహ్మాన్ నూతన ఎస్పీని మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పగుచ్చాలతో అభినందనలు తెలిపారు.