అదిలాబాద్

ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖానాపూర్ రూరల్, మే 30: మినీ మహానాడు కావడంతో ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పంటించి ధ్వంసం చేయడం మండలంలో సంచలనంగా మారింది. మండలంలోని బాదన్‌కుర్తి రహదారిపై సుర్జాపూర్ శివారులోని మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కాంస్య విగ్రహానికి గుర్తు తెలియని దుండగులు ఆదివారం రాత్రి నిప్పంటించారు. సోమవారం విషయం తెలుసుకున్న టిడిపి నాయకులు విగ్రహం వద్ద గల రహదారిపై బైఠాయించి దుండగులను వెంటనే అరెస్ట్‌చేయాలని అన్నారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయని, దీనిపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో ఆంధ్ర ముఖ్యమంత్రిగా ఉండి చీకటిలో ఉన్న ప్రజలకు వెలుగుచూపిన ఎన్టీ ఆర్ విగ్రహాన్ని అవమానపర్చడం చాలా హేయమైన చర్యయని, వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. వారి జ్ఞాపకాలను గుర్తుచేసుకుని అభివృద్ది పథంలో నడవాల్సిందిపోయి దేశద్రోహులుగా మారుతున్నారని అన్నారు. దుండగులను వెంటనే అరెస్ట్‌చేయలేని పక్షంలో జిల్లావ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. సంఘటన స్థలానికి వెళ్లి ఎస్సై అజయ్‌బాబు వారిని రాస్తారోకో నుండి విరమింపచేసి దుండగులపై కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, ఉప సర్పంచ్ కారింగుల సుమన్, మిట్ట రవి, నయిం, కన్నయ్య, ప్రదీప్, 50 మంది తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు.