అదిలాబాద్

ఎట్టకేలకు మార్కెట్ కమిటీ చైర్మన్ల నియామకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్, జూన్ 3: కొన్ని నెలలుగా మార్కెట్ కమిటీ చైర్మన్ నియామకంపై నెలకొన్న ఉత్కంఠ తొలగిపోయింది. ఖరీఫ్ సీజన్ ముంచుకొస్తున్న తరుణంలో వ్యవసాయ మార్కెట్ కమిటీలను నియమిస్తూ గురువారం సాయంత్రం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నిర్మల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా దిలావర్‌పూర్ మండలం గుండంపెల్లికి చెందిన కొమ్ముల దేవేందర్‌రెడ్డిని నియమించగా, వైస్ చైర్మన్‌గా కొప్పుల శ్రీ్ధర్‌ను నియమించింది. అలాగే డైరెక్టర్లుగా ఎం.డి వౌలానా, సాద వనిత, టి.బలిరాం, కట్ల ప్రభాకర్‌రెడ్డి, ధనె నర్సయ్య, బర్మ నర్సయ్య, మంత్రి రాజ్‌గోపాల్, చిటికేశి కాశీనాథ్‌లను నియమించారు. కాగా, సారంగాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా సారంగాపూర్‌కు చెందిన సీనియర్ నాయకులు రాజ్ మహ్మద్‌ను నియమించగా వైస్ చైర్మన్‌గా నాగుల రాంరెడ్డిని నియమించారు. డైరెక్టర్లుగా ఎం.లక్ష్మి, డి.శ్రీనివాస్, జి.శ్రీనివాస్‌యాదవ్, ఎం.శేఖర్‌రెడ్డి, టి.జంగు, బి.విద్యాసాగర్‌రావు, పడిగెల కేదరినాథ్, టి.ముత్యంరెడ్డిలను నియమించారు. ఈ సందర్భంగా నిర్మల్, సారంగాపూర్ మార్కెట్ కమిటి ఛైర్మెన్‌లు దేవేందర్‌రెడ్డి, రాజ్‌మహ్మద్ మాట్లాడుతూ తమపై నమ్మకంతో పదవులను కల్పించిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మార్కెట్ కమిటీల ద్వారా ప్రభుత్వం రైతులకు కల్పిస్తున్న సదుపాయాలను వారికి అందేలా కృషిచేస్తామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.