అదిలాబాద్

కోదండరాంను విమర్శించడం సరికాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీరాంపూర్ రూరల్, జూన్ 9: తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలను నిలబెట్టుకోవాలని సూచించారే తప్ప ఎవరినీ విమర్శించలేదని టిడిపి తూర్పు జిల్లా అధ్యక్షుడు జక్కుల రాజేశం అన్నారు. శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ కోసం అన్ని వర్గాలను ఒక్క తాటిపైకి తీసుకువచ్చి రాష్ట్ర ఆవిర్భావం కోసం ఎంతగానో కృషి చేసిన ప్రొఫెసర్ కోదండరాంను విమర్శించడం సరికాదన్నారు. ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఉద్యమ కాలంలో ఎక్కడున్నారో చెప్పాలని ప్రశ్నించారు. సమైక్యాంద్ర పాలనలో తెలంగాణ బొందల గడ్డగా మారుస్తున్నారని, స్వరాష్ట్రంలో ఓసిపిలు రద్దు చేసి, భూగర్బ గనులను తీసుకువస్తామన్న కేసీ ఆర్ ఓసిపిలకు అనుమతులు ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. 50 కొత్త భూగర్బ గనులను ప్రారంభించి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పిన కేసీ ఆర్ గడిచిన రెండేళ్లలో ఏ ఒక్క భూగర్బ గనిని కూడా ప్రారంభించలేదన్నారు. కేంద్ర ప్రభుత్వ జీవో ప్రకారం రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ప్రాజెక్టు ముంపు గ్రామాలకు ఎకరాకు రూ.25లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధుల జీతాలను తీసుకుంటున్న ప్రభుత్వం ప్రాజెక్టు కింద భూమి కోల్పోయిన రైతుల పట్టా, అసైన్డ్ భూములకు ఒకే ధర చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికుల వారసత్వ ఉద్యోగాలను వెంటనే పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సింగతి మురళి, బొడ్డు తిరుపతి, తూర్పు జిల్లా కార్యదర్శి జక్కుల కుమార్, మండలాధ్యక్షులు రాజు, టీ ఎన్ ఎస్ ఎఫ్ నాయకులు రాకేష్ పాల్గొన్నారు.