అదిలాబాద్

బడి గంట మోగింది... మారని ప్రభుత్వాల తీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచిర్యాల అర్బన్, జూన్ 13: వేసవి సెలవులు సరదాగా గడిపిన విద్యార్థులు సోమవారం నుంచి బడి బాట పట్టారు. ప్రతీ యేటా మాదిరిగానే ఈ విద్యా సంవత్సరమూ ప్రభుత్వ పాఠశాలలు సమస్యలతో స్వాగతం పలుకుతున్నాయి. పాఠ్య పుస్తకాలు పూర్తి స్థాయిలో మండలానికి చేరలేదు. ఇప్పటికీ ఉపాద్యాయులు ఖాళీలు అలాగే ఉన్నాయి. విద్యార్థులకు సరిపడా టాయ్‌లెట్స్ ఉన్నా అవి శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్వచ్చ భారత్‌లో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మించాలని గత యేడాది నిధులు మంజూరైనా ఇంకా 70శాతం నిర్మాణాలు పెండింగ్‌లో ఉన్నాయి. పూర్తయిన చోట నీటి సౌకర్యం లేక వినియోగించడం లేదు. ఇలా తరగతి గదులు, ఉపాద్యాయులు వంటివి సరిపడా అందించలేక విద్యార్థుల చదువులు కుంటు పడుతున్నాయి. యేటా లాగే ఈ యేడు కూడా సమస్యల మద్యే విద్యార్థుల చదువులు కొనసాగనున్నాయి. కొన్ని పాఠశాలల్లో బెంచీలు కూడా లేవు. ప్రాథమిక పాఠశాల భవనాలు శిథిలావస్థలకు చేరుకొని పలు చోట్ల కొత్త నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయి. కాంపౌండ్ వాల్స్ లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సంవత్సరమైనా అన్ని వసతులు కల్పిస్తారన్న సంతోషంతో విద్యార్థులు పాఠశాలకు చేరుకునే సరికి అంతా పాత వాతావరణమే కనబడుతోంది. సోమవారం నుంచి పాఠశాలలు తెరుచుకున్నాయి. మళ్లీ విద్యార్థులు సమస్యల చదువుకునేందుకు సిద్దమయ్యారు. యంత్రాంగం కూడా నిమ్మకు నీరెత్తినట్లుగానే వ్యవహరిస్తోందని విద్యార్థులు, తల్లిదండ్రులు అభిప్రాయ పడుతున్నారు. భావిభారత పౌరులుగా ఎదుగాల్సిన విద్యార్థులకు పునాది వంటి బడి చదువులు మంచిగా మారాల్సిన అవసరం ఉంది. సమస్యలు పరిష్కరించాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రభుత్వ పాఠశాల పనితీరుపై విద్యా శాఖ చిన్న చూపు చూస్తోంది. యేటా ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులకు సమస్యలతో స్వాగతం పలుకుతూనే ఉన్నాయి. కొన్ని పాఠశాలల్లో ఇప్పటికీ కనీస వసతులు లేక అద్దె భవనాల్లోనే నడిపిస్తున్నాయి.