అదిలాబాద్

కెసిఆర్‌వి గాలి మాటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచిర్యాల, జూన్ 16: ముఖ్యమంత్రి ప్రజలకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని చెబుతూ వస్తున్నారే తప్ప ఇప్పటి వరకు చేసిందేమీ లేదని తెలుగుదేశం పార్టీ తూర్పు జిల్లా అధ్యక్షుడు బోడ జనార్దన్ ఆరోపించారు. గురువారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం సాదించుకున్న ప్రజలు ఎన్నికల్లో తెరాస పార్టీకి పట్టం కట్టి రెండేళ్లు గడుస్తున్నా కెసిఆర్ పురోగతి సాదించిందేమీ లేదన్నారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించడానికి ఇతర పార్టీల నాయకులను తెరాసలో చేర్చుకుంటూ అభివృద్ధికి దూరం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీల నాయకులను తమ పార్టీల్లో కలుపుకొని ప్రజలను మభ్యపెట్టే విధంగా యత్నిస్తున్నారన్నారు. ప్రజల గొంతు వినకుండా అభివృద్ధిని ఆకాంక్షించడం లేదన్నారు. ప్రభుత్వ పాలన రెండేళ్లు పూర్తయినప్పటికీ ప్రజా సంక్షేమం గాలిలో కలిసే విధంగా పాలన ఉందని విమర్శించారు. పేద ప్రజలకు డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు కట్టిస్తామని గొప్పలు చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం స్థల సేకరణ కూడా చేపట్టకపోవడమే కాక ఇప్పటివరకు కూడా అర్హులను గుర్తించాల్సి ఉండగా, రెండు పకడల గదుల ఇండ్ల పేరుతో కాలం వెళ్లదీస్తున్నారని మండిపడ్డారు. బడ్జెట్‌లో వేల కోట్ల రూపాయలను ప్రవేశపెట్టినప్పటికీ అభివృద్ది ఎక్కడ ఉందని అన్నారు. రూ.1.12 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టామని చెబుతూ ప్రజలకు చేసిందేమీలేదన్నారు. చంద్రబాబు నాయుడుపై మంత్రి హరీష్ రావు చేస్తున్న వ్యాఖ్యలు అర్దరహితమని, రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులకు పూర్తి మద్దతు ఇస్తున్నామన్నారు. కృష్ణ, గోదావరి నుంచి తాగునీటిని తెచ్చే విషయంలో పార్లమెంట్‌లో ఏవిధంగా ప్రవేశపెట్టారో అదేవిధంగా పక్క రాష్ట్ర ప్రజలకు ఈ ప్రభుత్వం అందించాల్సి ఉందన్నారు. కెసిఆర్ కుమారున్ని ముఖ్యమంత్రిని చేయడానికే ఇతర పార్టీలోని నాయకులను తెరాస పార్టీలో చేర్చుకుంటున్నారన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టాలని కోరారు. సింగరేణిలో 10వ వేజ్‌బోర్డు అమలు చేసే యోచన ప్రభుత్వానికి ఇప్పట్లో లేదన్నారు. కెసిఆర్ ఫామ్‌హౌస్‌కు వెళ్లి ఆరోపణలు చేయడం తన నైజంగా మార్చుకున్నారన్నారు. ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టి ఫలాలు ప్రజల ధరికి చేరేలా కృషి చేయాలన్నారు. సమావేశంలో టిడిపి జిల్లా కోశాధికారి గోపతి మల్లేష్, ప్రచార కార్యదర్శి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు కిరణ్, పట్టణ ప్రదాన కార్యదర్శి మదుకర్, నాయకులు రాజ్‌కుమార్, రత్నాకర్, బెజ్జంకి సత్యనారాయణ పాల్గొన్నారు.