అదిలాబాద్

ఖరీఫ్ కష్టమే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కెరమెరి, జూన్ 23: ప్రతీ యేటా అతి వృష్టి, అనావృష్టి కారణంగా పంటలు పండక కరువు కోరల్లో చిక్కుకున్న మండల రైతాంగం ఈ ఖరీఫ్ సాగుపై గంపెడాశలతో హలాలు పట్టి పొలాలు దున్నారు. ఈసారి వర్షాలు సమృద్దిగా కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పడంతో ఈనెల మొదటివారంలోనే మండల రైతులు వేలాది రూపాయలు ఖర్చు పెట్టి పత్తి విత్తనాలను విత్తారు. పత్తి, కంది, పెసర పంటలను దాదాపు మండల రైతులు విత్తడం జరిగింది. నేల తల్లిని నమ్మి ఆకాశ వరుణునిపై గంపెడాశలతో ఖరీఫ్‌కు సిద్దమైన రైతులకు ఆదిలోనే కష్టాలు తప్పడం లేదు. వేసిన విత్తనాలు మొలకెత్తక కొందరు, మొలిచిన విత్తనాలు వర్షం లేకపోవడంతో ఎండిపోయే దుస్థితి నెలకొంది. వేలాది రూపాయలు అప్పులు చేసి నాటిన విత్తనాలు మొలకెత్తకపోవడంతో మళ్లీ విత్తనాలు విత్తేందుకు మరోసారి రైతులు అప్పుల పాలు కావాల్సిన పరిస్థితి నెలకొంది. ఈసారి వర్షాలు కురిసి, పంటలు బాగా పండితే తీసుకున్న అప్పులు ముట్టచెప్పవచ్చన్న ఆశతో ఉన్న రైతులు ఖరీఫ్ సాగు చేస్తుంటే వరుణ దేవుడు కరుణించడం లేదు. దేశానికి అన్నం పెట్టే రైతన్నపైనే వరుణదేవుడు అలిగినాడో లేక రైతుల గోస తనకెందుకులే అనుకున్నాడో గానీ వర్షాల కోసం రైతులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. మండుటెండలను సైతం లెక్క చేయకుండా పొలాలు దుక్కి దున్ని విత్తనాలు వేసిన రైతులకు వర్షం ముఖం చాటేయడంతో రైతులు బిక్కుబిక్కుమంటున్నారు. వర్షాకాలం ప్రారంభమై నెల రోజులుకావస్తున్నా పంటలకు సరిపడా వర్షం కురియలేదు. మరో నాలుగైదు రోజులు వర్షం కురవకపోతే వేసిన విత్తనాలన్నీ మొలకెత్తలేక నష్టపోయే ప్రమాదం ఉంది. ఈసారి పంటలకు వర్షం సక్రమంగా కురియకపోతే రైతులు పరిస్థితి అగమ్యగోచరంగా మారే దుస్థితి నెలకొని ఉంది. ఎక్కడ చూసినా, ఎవరినోట విన్నా వర్షాలు వస్తాయా, ఎపుడు వస్తాయంటూ ప్రతిఒక్కరు మాట్లాడుకుంటున్న సందర్భాలే కనిపిస్తున్నాయి. వర్షాలు కురియాలని పల్లెల్లో ప్రజలు వరుణ దేవున్ని ప్రార్థిస్తున్నారు. ఆకాశ వరుణుడు కర్షకులపై కనికరం చూపి వర్షాలు సమృద్దిగా కురవాలని రైతులు కోరుతున్నారు.